MacKenzie Bezos: విడాకుల తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో మెకెంజీ బెజోస్

MacKenzie Bezos Divorce Settlement | అమెజాన్‌లో నాలుగు శాతం వాటా మెకెంజీ బెజోస్‌ నియంత్రణలో ఉంటుందని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు సమాచారం ఇచ్చింది అమెజాన్.

news18-telugu
Updated: April 5, 2019, 4:05 PM IST
MacKenzie Bezos: విడాకుల తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో మెకెంజీ బెజోస్
MacKenzie Bezos: విడాకుల తర్వాత ప్రపంచ కుబేరుల జాబితాలో మెకెంజీ బెజోస్ (File Photo: Reuters)
news18-telugu
Updated: April 5, 2019, 4:05 PM IST
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వైవాహిక బంధం అనూహ్య రీతిలో ముగిసిన సంగతి తెలిసిందే. జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకెంజీ మధ్య విడాకుల సెటిల్మెంట్ కొలిక్కి వచ్చింది. అమెజాన్‌లో మెకెంజీ బెజోస్‌కు 35.6 బిలియన్ డాలర్ల షేర్లు దక్కాయి. 890 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న అమెజాన్‌లో నాలుగు శాతం వాటా మెకెంజీ బెజోస్‌ నియంత్రణలో ఉంటుందని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు సమాచారం ఇచ్చింది అమెజాన్. ఇక జెఫ్ బెజోస్‌కు 12 శాతం వాటా ఉంటుంది. అంటే 110 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ది వాషింగ్టన్ పోస్ట్‌తో పాటు అంతరిక్ష పరిశోధన సంస్థ బ్లూ ఆరిజిన్‌లో ఉన్న తన మొత్తం వాటాను జెఫ్ బెజోస్‌కు ఇచ్చేందుకు మెకెంజీ బెజోస్ అంగీకరించింది. ఆమెకు లభించిన వాటాలతో ప్రపంచంలో అత్యంత ధనవంతులైన మహిళల జాబితాలో మెకెంజీ బెజోస్‌కు మూడో స్థానం దక్కిందని ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం. మహిళా కుబేరుల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఫ్రాంకోయిజ్ బెటెన్‌కోర్ట్ మెయర్స్, అలీస్ వాల్టన్ ఉన్నారు.

Read this: IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

ప్రస్తుతం జెఫ్ బెజోస్ వయస్సు 55 ఏళ్లు. మెకెంజీ వయస్సు 48 ఏళ్లు. వీరికి 1993లో పెళ్లైంది. నలుగురు పిల్లలున్నారు. 1994లో అమెజాన్ సంస్థను ఏర్పాటు చేయడంలో మెకెంజీ బెజోస్ పాత్ర కీలకం. కొంతకాలంగా వీరి వివాహబంధంలో వివాదాలు మొదలయ్యాయి. ఇందుకు జెఫ్ బెజోస్ గాళ్ ఫ్రెండ్ లారెన్ సాన్షేతో ఎఫైరే కారణమన్న ప్రచారం ఉంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఓ మ్యాగజైన్ రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. అప్పట్నుంచీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్తా విడాకులకు దారితీసాయి. ఈ ఏడాది జనవరిలో ట్విట్టర్‌లో తమ విడాకుల విషయాన్ని జెఫ్ బెజోస్, మెకెంజీ బెజోస్ ప్రపంచానికి తెలిపారు. ఏప్రిల్ 4న విడాకుల సెటిల్మెంట్ కొలిక్కి వచ్చింది.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్



ఇవి కూడా చదవండి:

ICICI Home Loan: ఒక్క రోజులో రూ.1 కోటి హోమ్ లోన్... ఇలా అప్లై చేయండి
Loading...
Mi LED TV: రూ.12,999 విలువైన ఎంఐ ఎల్ఈడీ టీవీ... ఒక్క రూపాయికే

ONGC Jobs: ఓఎన్జీసీలో 900 ఖాళీలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...