Demand for Electric Vehicles: లగ్జరీ కార్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లకు మారడానికి కారణమేంటీ?

Demand for Electric vehicles: లగ్జరీ కార్ల వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్లకు మారడానికి కారణమేంటీ? (ప్రతీకాత్మక చిత్రం)

Demand for Electric Vehicles | లగ్జరీ కార్ల వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతున్నారు. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. పర్యావరణహితమైన ఈ విద్యుత్ కార్లను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లగ్జరీ కార్లను సైతం వదులుకొని ఈవీలపై మొగ్గు చూపే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో వినియోగదారుల ప్రాధాన్యతలో ఈ స్థిరమైన మార్పు కనిపిస్తోంది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో పాటు పుణెకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు కూడా మెర్సిడెజ్ బెంజ్, వోల్వో లాంటి బ్రాండ్‌లు వాడుతున్నప్పటికీ.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ లాంటి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మెర్సిడెజ్, వోల్వో లాంటి బ్రాండ్లు ఈ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లేనందున టాటా మోటార్స్, జీప్, మహీంద్రా సంస్థలు వీటితో పోటీపడుతున్నాయి.

2015లో మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఏను నడిపిన చెన్నైవాసి మిథున్ బాబు జేడ్ఎస్ ఈవీని ఎంచుకున్నాడు. ఇది మెరుగైన రైడ్ అనుభూతిని అందిస్తుందని ఆయన చెప్పారు. సగటున రోజుకు 50 నుంచి 70 కిలోమీటర్ల డ్రైవ్ చేస్తానని తెలిపారు. చెన్నైలోని తన ఇంటి నుంచి కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న తన ఫ్యాక్టరీ వరకు ఇంత దూరం ఉంటుందన్నారు. "నేను ఈవీకి మారతానానికి ముందుగా అనుకోలేదు. అయితే టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అది నా అవగాహనను మార్చివేసింది. ఈ కారుకు గేర్ బాక్స్ లేదు. దీన్ని నడిపే విధానం కూడా వేరే స్థాయిలో ఉంటుంది. నిజానికి ఈ కారును మా అమ్మ కోసం కొన్నాను. కానీ నేనే తరచూ ఆఫీసుకు వెళ్తుంటా" అని వివరించారు.

Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

ప్రస్తుతం మిథున్‌ కుటుబంలో జెడ్ఎస్ ఈవీతో పాటు 7-సీటర్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కూడా ఉంది. దీన్ని సుదూర ప్రయాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇది జెడ్ఎస్ ఈవీ అందించే 400 కిలోమీటర్ల రేంజ్‌కు మించి ఉంటుంది. ఎలక్ట్రిక్ కారులో డ్రైవింగ్ సాధారణ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కంటే మెరుగ్గా ఉంటుందని మిథున్ వివరించారు.

పుణేలోని అల్కురర్ ఇంజీనీర్స్ అధిపతి 70 ఏళ్ల గురునాథ్‌ వామన్ అలుర్కర్ కూడా విద్యుత్ వాహనానికి మారారు. "కాలుష్యం రికార్డు స్థాయిలో ఉన్న నగరాల్లో ఈవీల వాడకాన్ని ప్రోత్సహించాలి. నాకు కూడా శ్వాస సంబంధ సమస్యలు ఉన్నాయి. పర్యావరణానికి నావంతు సాయం చేసేందుకు ఎంజీ జెడ్ఎస్ ఈవీని ఎంచుకున్నాను" అని గురునాథ్ తెలిపారు. ఆయన 2014లో మెర్సిడెజ్ బెంజ్ బీ క్లాస్ నడిపారు. ఈ వాహనం మాదిరిగానే ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఉందని తెలిపారు. తన రోజువారీ డ్రైవ్ కేవలం 15-20 కిలోమీటర్ల దూరమే ఉన్నందున ప్రతి నెల రెండు సార్లు మాత్రమే కారుకు ఛార్జింగ్ పెడతానని చెప్పారు. బావ్దాలోని తన ఇంటి నుంచి కోత్రూడ్‌లో ఉన్న ఆఫీస్ వరకు మాత్రమే విద్యుత్ కారులో వెళ్తానని వివరించారు.

Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

SBI Loans: ఎస్‌బీఐలో లోన్ ఇస్తామని ఫోన్ వచ్చిందా? అయితే అలర్ట్

2021 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణీకులు 0.22 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా ప్రభావం ఉన్నా కూడా బ్యాటరీ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల కొనుగోళ్లు 60-75 శాతం పెరిగాయని అంచనా. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021లో ఈవీల అమ్మకాలు 5500-6000 పెరిగాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఈ విభాగంలో 3400 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందులో టాటా నెక్సాన్ అగ్రస్థానంలో ఉంటూ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది.
Published by:Santhosh Kumar S
First published: