LURED BY INSTANT LOANS FROM FINTECHS AVOID THESE 10 MISTAKES GH VB
Instant Loans: ఫిన్‌టెక్‌ల ఇన్స్టంట్ లోన్లు టెంప్ట్ చేస్తున్నాయా.. లోన్ తీసుకునే ముందు ఈ 10 తప్పులను అస్సలు చేయకండి..!
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజుల్లో ఇన్స్టంట్ డిజిటల్ లోన్ (Instant digital loans)లను పొందడం చాలా సులభమైంది. ఇన్స్టంట్ డిజిటల్ లెండర్ యాప్‌ను డౌన్లోడ్ చేసి కేవైసీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, ఇన్కమ్ ప్రూఫ్, అడ్రస్ అందిస్తే చాలు నిమిషాల్లో రుణాలు జారీ అయిపోతున్నాయి.
ఈ రోజుల్లో ఇన్స్టంట్ డిజిటల్ లోన్ (Instant digital loans)లను పొందడం చాలా సులభమైంది. ఇన్స్టంట్ డిజిటల్ లెండర్ యాప్‌ను డౌన్లోడ్ చేసి కేవైసీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, ఇన్కమ్ ప్రూఫ్, అడ్రస్ అందిస్తే చాలు నిమిషాల్లో రుణాలు జారీ అయిపోతున్నాయి. అందుకే హఠాత్తుగా వచ్చి పడిన ఆర్థిక సమస్యల (Financial problems) నుంచి బయటపడేందుకు చాలామంది ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడానికి తొందరపడుతున్నారు. కానీ రుణాలన్నీ స్వల్ప, దీర్ఘకాలిక చిక్కులతో వస్తుంటాయి. వాటి గురించి అవగాహన లేకపోతే తిరిగి చెల్లించలేని అప్పు అనే ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. ఇన్స్టంట్ లోన్ నిమిషాల్లో తీసుకోవచ్చు. కానీ అప్పుల ఉచ్చు (dept trap)లో చిక్కుకోకుండా ఉండాలంటే రుణం తీసుకునే ముందు 10 తప్పులను అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం.
1. ముందుగా బడ్జెట్‌ను ప్లాన్ చేయకపోవడం
ఇన్స్టంట్ డిజిటల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. మీ అవసరాన్ని, నెలవారీ రీపేమెంట్ సామర్థ్యాన్ని తెలిపే ఓ బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. రుణదాతలు అధిక మొత్తాన్ని అప్పుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, అది మీ బడ్జెట్‌కు అనుగుణంగా లేకపోతే మీరు ఆ రుణమొత్తం తీసుకోకపోవడమే మంచిది. మీరు తిరిగి చెల్లించగల, మీకు అవసరానికి సరిపడా నగదును మాత్రమే రుణంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
2. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం.
ఎంచుకున్న కాల పరిమితిని బట్టి రుణం స్వల్ప, మధ్యస్థ లేదా దీర్ఘకాలిక కమిట్మెంట్లతో వస్తుంది. అందుకే మీ ఆర్థిక అవసరాన్ని తీర్చేందుకు మాత్రమే లోన్ తీసుకోండి. కచ్చితంగా లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటే... ఎంత మొత్తంలో రుణం తీసుకోవాలనే దానిపై వర్కౌట్ చేయండి. మొదటగా మీ సాధారణ, రోజువారీ ఖర్చులను లెక్కించి.. మీ నెలవారీ రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం లోన్ మొత్తం, పదవీకాలం, ఈఎంఐ నిర్ణయించండి. నెలనెలా మీరు కట్టగల అమౌంట్‌కు తగినట్టుగానే లోన్ ఉండేలా జాగ్రత్త పడండి.
3. క్రెడిట్ స్కోర్‌ను మెయింటైన్ చేయకపోవడం
రుణాన్ని జారీ చేసే ముందు రుణదాతలు రుణగ్రహీతల పేమెంట్ హిస్టరీని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తారు. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే వెంటనే లోన్ మంజూరు చేస్తారు. అందువల్ల మీరు మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా మెయింటైన్ చేయాలి. ఈ స్కోర్‌ను ఆన్లైన్లోనే ఫ్రీగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
4. కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయకపోవడం
నో-యువర్-కస్టమర్ (KYC) డాక్యుమెంట్లలో పాన్ కార్డ్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ లు ఉంటాయి. కేవైసీ డాక్యుమెంట్లలోని వివరాలు ఇతర డాక్యుమెంట్లలోని వివరాలకు భిన్నంగా ఉంటే ఇన్స్టంట్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫోన్ నంబర్లు, అడ్రస్ లు రెండు డాక్యుమెంట్లలో ఒకేలా లేనప్పుడు రుణదాతలు దరఖాస్తును తిరస్కరించవచ్చు. అందువల్ల రుణం తీసుకునే ముందు కేవైసీ డాక్యుమెంట్లలోని వివరాలను ఒకసారి సరిచూసుకోండి.
5. రుణదాతలు, వడ్డీ రేట్లను పోల్చకపోవడం
వేర్వేరు రుణదాతలు వేర్వేరు అర్హత ప్రమాణాలు, వడ్డీ రేట్లు కలిగి ఉండవచ్చు. మీకు ఏది బెస్ట్ అనేది నిర్ణయించే ముందు వివిధ రుణదాతల నిబంధనలు, వడ్డీ రేట్లను సరిపోల్చండి. బెస్ట్ రేట్స్ కోసం చెక్ చేస్తున్నప్పుడు, నిబంధనల, ఇతర నిబంధనలు, షరతులను కూడా చెక్ చేయడం చాలా ముఖ్యం.
6. ప్రాసెసింగ్ ఫీజు లేదా హిడెన్ ఛార్జీల గురించి తెలుసుకోకపోవడం
అనేక సందర్భాల్లో దరఖాస్తుదారులు అవసరమైన మొత్తం కోసం దరఖాస్తు చేస్తారు. డబ్బు జమ అయ్యాక కొంత అమౌంట్ కట్ అవ్వడంతో వారు షాక్ అవుతారు. దాదాపు అన్ని రుణదాతలు నగదు జమ చేసే ముందు రుణం మొత్తం నుంచి కొన్ని రుసుములను వసూలు చేస్తారు. అందుకే రుణ దరఖాస్తుదారులు ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీతో సహా అదనపు ఖర్చులు వంటి అన్ని ఛార్జీలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, లోన్ ఆఫర్‌ను అంగీకరించే ముందు హిడెన్ ఛార్జీలు లేవని నిర్ధారించుకోవాలి.
7. సరైన పదవీకాలాన్ని ఎంచుకోకపోవడం
త్వరలోనే తమకు ఏదో ఒక మార్గం నుంచి డబ్బులు అందుతాయని భావనలో కొందరు రుణగ్రహీతలు తక్కువ కాలపరిమితితో చెల్లించే రుణాన్ని తీసుకుంటారు. అయితే ఈ స్వల్పకాలిక రుణాల ఈఎంఐలు చాలా ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. అందువల్ల, మీకు అవతల వైపు నుంచి డబ్బులు అందినా.. అధిక ఈఎంఐలు కట్టడం కష్టం కావచ్చు. ఇలాంటి వారు ఈఎంఐలు ఎక్కువగా ఉండని మధ్యస్థ (mid-term) కాలపరిమితిని ఎంచుకోవడం సురక్షితం. అవసరమైన కాలపరిమితితో సరసమైన ఈఎంఐని నిర్ణయించడానికి వ్యక్తిగత రుణ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. ఈఎంఐ ఎక్కువగా ఉంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఈఎంఐ మిస్సయే ఛాన్సెస్ ఉన్నాయి. దీని వల్ల క్రెడిట్ స్కోరు తగ్గే ప్రమాదముంది.
Redmi Note 11: రెడ్మీ నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు.. ఈ సారి అందరికీ అందుబాటు ధరల్లో.. ఫీచర్ల వివరాలివే..
8. రీపేమెంట్ మోడ్‌లను చెక్ చేయకపోవడం
కొన్నిసార్లు, రుణగ్రహీతలు నిర్దిష్ట రీపేమెంట్ మోడ్‌ను చెక్ చేయనందున ఇబ్బందుల్లో పడతారు. కొంతమంది రుణదాతలు తమ యాప్‌లు లేదా పోర్టల్‌ల ద్వారా ఈఎంఐ చెల్లింపులను కోరుకుంటారు. అయితే ఇతరులు ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) డెబిట్ల కోసం రుణగ్రహీత బ్యాంక్‌కు స్టాండింగ్ సూచనలను అందించాల్సి ఉంటుంది. నిర్దిష్ట రీపేమెంట్ మోడ్, ఈఎంఐ గడువు తేదీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పేమెంట్ మిస్ అవ్వదు. ఒకవేళ పేమెంట్ మిస్సైతే అది పెనాల్టీ ఛార్జీలను ఆకర్షించి క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
9. ప్రీపేమెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకోకపోవడం
రుణగ్రహీతలు తమకు సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలోనే రుణాన్ని తిరిగి చెల్లించాలి. తక్కువ సమయంలో రుణం తిరిగి చెల్లించడం ద్వారా ఆర్ధిక ప్రయోజనాలు అందుకోవచ్చు. లేనిచో వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, లోన్ దరఖాస్తుదారులు లోన్ లాక్-ఇన్ పీరియడ్, ప్రీపేమెంట్ ఆప్షన్లు, ప్రాసెస్, సంబంధిత ఛార్జీలను ముందుగానే చెక్ చేసుకోవాలి. ఏది మీకు సూట్ అవుతుందో దానిపై ఆధారపడి, రుణాన్ని ముందస్తుగా చెల్లించాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు.
10. ఫైన్ ప్రింట్ సరిగ్గా చదవకపోవడం
రుణ దరఖాస్తుదారులు ఇన్స్టంట్ లోన్ పొందాలనే తొందరపాటులో చేసే అత్యంత సాధారణ తప్పు ఇది. రుణదాతలు నిబంధనల్లో మీకు అనుగుణంగా లేని కొన్ని నిబంధనలు ఉండవచ్చు. వాటి గురించి ముందస్తుగా తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొన్ని మోసపూరిత లెండింగ్ యాప్‌లు సులభమైన నిబంధనలపై ఇన్స్టంట్ డిజిటల్ లోన్‌ను ఆఫర్ చేస్తుంటాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండకపోతే.. మోసగాళ్ల వలలో పడి కష్టపడి సంపాదించిన డబ్బంతా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న పది తప్పులు చేయకుండా ఉంటే మీరు మీ ఇన్స్టంట్ లోన్‌ను సులభంగా తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.