జర్మనీ టు ఇండియా... లుఫ్తాన్సా విమాన సేవలు..

ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ, మ్యూనిచ్ నుంచి ఢిల్లీ, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బెంగళూరు, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబై మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి.

news18-telugu
Updated: August 15, 2020, 5:42 PM IST
జర్మనీ టు ఇండియా... లుఫ్తాన్సా విమాన సేవలు..
లుఫ్తాన్సా విమానం (Image;@Lufthansa India)
  • Share this:
జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్, మ్యూనిచ్ నుంచి భారత్‌లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరులకు విమానాలు నడుపుతున్నట్టు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. భారత్, జర్మనీ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంతో లుఫ్తాన్సా విమానసర్వీసులు ఆరంభం కానున్నాయి. ఈ విమాన సర్వీసులు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ప్రయానికులు ఇప్పుడు లుఫ్తాన్సా ద్వారా భారతదేశానికి ప్రయాణించడానికి అర్హులు. ఆగస్టు చివరి వరకు 40 విమానాలు ఆఫర్‌లో ఉన్నాయి. లుఫ్తాన్సా ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి అవుట్‌బౌండ్ విమానాలను నడుపుతోంది. ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాలలో కొత్త పిసిఆర్ కరోనావైరస్ పరీక్షా కేంద్రాలు ఉండడం వల్ల అక్కడ క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ, మ్యూనిచ్ నుంచి ఢిల్లీ, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బెంగళూరు,
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ముంబై మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి. లుఫ్తాన్సా విమానాలకు వర్తించే భారత అధికారుల నిబంధనల గురించి మొత్తం సమాచారం ఆన్‌లైన్‌లో https://www.lufthansa.com/in/en/homepage లో అందుబాటులో ఉంది. లుఫ్తాన్సా గ్రూప్ విమానయాన సంస్థలు నడుపుతున్న విమానంలో దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి కలుషితాల క్యాబిన్ గాలిని శుభ్రపరిచే ఫిల్టర్లు ఉన్నట్టు సంస్థ తెలిపింది. ప్రస్తుత పరిస్థితిలో కూడా తన అతిథులకు సౌకర్యం, భద్రతను అందించడానికి ప్రయత్నిస్తుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 15, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading