LPG Price | దీపావళి పండుగ వచ్చేసింది. ఈ రోజు గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరను అలాగే కొనసాగించాయి. కమర్షియల్ సిలిండర్ ధరలో కూడా మార్పు లేదు. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ రేటు రూ.1100 పైనే ఉంది. ప్రస్తుతం ఏపీలో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే రూ. 1,111 చెల్లించుకోవాలి. ఆన్లైన్ బుకింగ్‌కు ఇది వర్తిస్తుంది. సిలిండర్ డెలివరీ బాయ్‌కు మళ్లీ రూ.20 నుంచి రూ.30 చెల్లించుకోవాలి. అంటే సిలిండర్ ఇంటికి రావాలంటే దాదాపు రూ. 1150 ఖర్చు అవుతోందని గమనించాలి.
బ్యాంకులకు ఈ వారంలో 4 రోజులు సెలవులు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు పని చేయవంటే?
అదే తెలంగాణలో అయితే గ్యాస్ సిలిండర్ రేటు రూ. 1105గా ఉంది. అంటే దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ రేటు సమానంగానే ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ కూడా దాదాపు రూ.1150 వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సిలిండర్ రేటు రూ.1100 అంటే చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో సిలిండర్ రేటు పెరగలేదు.
ఇదే సువర్ణావకాశం.. మిస్ అయితే ఇక బంగారం, వెండి కొనలేం.. ఎందుకంటే?
దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే.. లేహ్‌లో రూ. 1290గా ఉంది. ఐజ్వాల్‌లో రూ. 1205 చెల్లించుకోవాలి. శ్రీనగర్‌లో రూ. 1169, పాట్నాలో రూ. 1151, కన్యాకుమారిలో రూ. 1137, అండమాన్‌లో రూ. 1129, రాంచీలో రూ.1110, సిమ్లాలో రూ. 1098, లక్నోలో రూ. 1090, ఉదయ్‌పూర్‌లో రూ. 1084, ఇండోర్‌లో రూ. 1081, కోల్‌కతాలో రూ. 1079, చెన్నైలో రూ. 1068, బెంగళూరులో రూ. 1055, ఢిల్లీలో రూ. 1053, ముంబైలో రూ. 1052 చెల్లించుకోవాలి. అంటే దేశవ్యాప్తంగా గమనిస్తే.. గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1300కు సమీపంలో ఉందని చెప్పుకోవచ్చు.
ఇకపోతే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీలో రూ. 1859గా ఉంది. కోల్‌కతాలో ఈ రేటు రూ. 1959. ఇక ముంబైలో సిలిండర్ రేటు రూ. 1811గా ఉంది. చెన్నైలో అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 2 వేలు దాటింది. రూ. 2009 వద్ద కొనసాగుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వన్‌టైమ్ నష్టపరిహారం కింద భారీ మొత్తాన్ని అందించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price