Home /News /business /

LPG GAS CYLINDER PRICE TO VEHICLE INSURANCE KNOW ABOUT NEW RULES WILL IMPLEMENT FROM JUNE SS

New Rules: ప్రజలకు అలర్ట్... జూన్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules: ప్రజలకు అలర్ట్... జూన్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: ప్రజలకు అలర్ట్... జూన్‌లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | జూన్‌లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వెహికిల్ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్, గోల్డ్ హాల్‌మార్కింగ్ (Gold Hallmarking), బ్యాంకు ఛార్జీలు... ఇలా అనేక అంశాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.

కొత్త నెల వస్తే కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. జూన్ వస్తోంది. జూన్‌లో అమలులోకి రాబోయే కొత్త రూల్స్ (New Rules) చాలానే ఉన్నాయి. ఈ కొత్త రూల్స్ గురించి ప్రజలు తెలుసుకోవడం అవసరం. ఇందులో ప్రజల జేబులకు చిల్లు పెట్టే నిబంధనలు కొన్ని ఉంటే, అందరికీ ఉపయోగపడే రూల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. మరి జూన్‌లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు (Important Dates) ఏవి? అమలులోకి రాబోయే కొత్త రూల్స్ ఏవీ? తెలుసుకోండి.

Vehicle Insurance: కేంద్ర ప్రభుత్వం థర్డ్ పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్ (Third Part Insurance) ప్రీమియం పెంచిన సంగతి తెలిసిందే. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం వివరాలను వెల్లడించింది. పెరిగిన ప్రీమియం జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. కార్లు, టూ వీలర్లు కొనేవారు కాస్త ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిందే.

Govt Scheme: నెలకు ఒక్క రూపాయితో రూ.2,00,000 బెనిఫిట్స్... ఈ స్కీమ్ ఉందని మీకు తెలుసా?

Gold Hallmarking: గోల్డ్ హాల్‌మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. 2021 జూన్ 16న గోల్డ్ హాల్‌మార్కింగ్ మొదటి దశ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని 256 జిల్లాల్లో మొదటి దశ అమలైంది. రెండో దశలో మరో 32 జిల్లాలు కవర్ అవుతాయి. నగల షాపుల్లో హాల్‌మార్కింగ్ నగల్ని మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం.

LPG Gas Cylinder Price: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. మరి జూన్ 1న గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్న ఉత్కంఠ సామాన్యుల్లో ఉంది. మేలో రెండు సార్లు గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. మే 8న రూ.50, మే 19న రూ.3.50 చొప్పున సిలిండర్ ధరలు పెరిగాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్, జూలైలో బ్యాంకులకు సెలవులు లేవు

Bank Charges: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీలను ప్రకటించింది. AePS ట్రాన్సాక్షన్స్ జరిపేవారు ఈ ఛార్జీలు చెల్లించాలి. కొత్త ఛార్జీలు 2022 జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్ కోసం రూ.20 + జీఎస్‌టీ, మినీ స్టేట్‌మెంట్ కోసం రూ.5+ జీఎస్‌టీ చెల్లించాలి.

Plastic Ban: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) జూన్ 5 నుంచి వైజాగ్‌లో ప్లాస్టిక్‌ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రజలు ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా ఇకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉపయోగించాలని కోరింది. జూన్ 5 నుంచి సింగిల్ యూజ్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉపయోగించినవారి నుంచి జీవీఎంసీ జరిమానా వసూలు చేయనుంది.

IRCTC Shri Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రను ప్రకటించింది. జూన్ 21న యాత్ర ప్రారంభం కానుంది. 18 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. 11 థర్డ్ ఏసీ క్లాస్ కోచ్‌లల్లో 600 మంది ప్రయాణికుల్ని యాత్రకు తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. ఈ యాత్రలో రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank charges, Gold, Gold jewellery, Insurance, Lpg Cylinder Price, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు