హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules in September: అలర్ట్... సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే

New Rules in September: అలర్ట్... సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే

New Rules in September: అలర్ట్... సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules in September: అలర్ట్... సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules in September | సామాన్యులకు అలర్ట్. సెప్టెంబర్‌లో మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రాబోతున్నాయి. ఈ రూల్స్‌తో లాభమా, నష్టమా తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త నెల రాగానే కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. సెప్టెంబర్ వస్తోంది. సెప్టెంబర్‌లో కూడా అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రజలకు మేలు చేసేవి అయితే, ఇంకొన్ని జేబుకు చిల్లు పెట్టేవి ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ పాలసీహోల్డర్లకు శుభవార్త, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price), పీఎం కిసాన్ పథకం (PM Kisan Scheme)... ఇలా పలు అంశాలకు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఉన్నాయి. మరి సెప్టెంబర్‌లో అమలులోకి రాబోయే కొత్త రూల్స్ ఏంటీ? అవి మీపై ఎలా ప్రభావం చూపిస్తాయి? తెలుసుకోండి.


IRDAI: ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కొత్త రూల్ అమలు చేయబోతోంది. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లకు మొదటి ఏడాది కమిషన్‌, ఇన్సెంటీవ్‌ను 20 శాతానికి పరిమితం చేయబోతోంది. ఈ నిర్ణయం దీర్ఘకాలంలో పాలసీహోల్డర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఆర్‌డీఐఏ భావిస్తోంది. ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్‌లోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.


IRCTC Shirdi Tour: సాయిభక్తులకు గుడ్ న్యూస్... విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ


LPG Gas Cylinder Price: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరతో పాటు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధరల్ని సవరిస్తాయి. గ్యాస్ సిలిండర్ ధర తగ్గొచ్చు, పెరగొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. మరి సెప్టెంబర్ 1న గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి.


PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని రైతులు ఇకేవైసీ పూర్తి చేయడానికి ఆగస్ట్ 31 వరకే గడువు ఉంది. త్వరలో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఇకేవైసీ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 1 నుంచి ఇకేవైసీ పూర్తి చేసే అవకాశం ఉండదు.


Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ కాలేదా? ఈ మెయిల్ ఐడీకి మెయిల్ పంపండి


Card Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నియమనిబంధనల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ రూల్స్ జూలై 1న అమలులోకి రావాల్సి ఉంది. బ్యాంకులు ఆర్‌బీఐని మరింత గడువు కోరడంతో సెప్టెంబర్ 30 వరకు వెసులుబాటు ఇచ్చింది. కొత్త రూల్స్ అక్టోబర్ 1న అమలులోకి వస్తాయి.Audi Cars: జెర్మన్ లగ్జరీ కార్‌మేకర్ అయిన ఆడి కార్ల ధరల్ని పెంచుతోంది. ఆడి కార్ల ధరలు 2.4 శాతం పెరగనున్నాయి. కొత్త ధరలు సెప్టెంబర్ 20న అమలులోకి రానున్నాయి. ఇండియాలో ఆడి A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 Sportback, RS 5 Sportback, RS Q8 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు పెరుగుతాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Insurance, Lpg Cylinder Price, New rules, PM KISAN, PM Kisan Scheme

ఉత్తమ కథలు