హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్... గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు

New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్... గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు

New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్... గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్... గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడం మాత్రమే కాదు, కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త నెల వచ్చిన ప్రతీసారి కొత్త రూల్స్ (New Rules) అమలులోకి వస్తుంటాయి. ఈసారి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. కాబట్టి కొత్త రూల్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఏప్రిల్ 1 నుంచి అనేక అంశాలకు సంబంధించి మార్పులు ఉండబోతున్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఆదాయపు పన్ను, పాన్ ఆధార్ లింకింగ్ (PAN Aadhaar Linking), బీఎస్6 రెండో దశ, మ్యూచువల్ ఫండ్స్... ఇలా అనేక అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. మరి ఈ రూల్స్‌లో మీపై ప్రభావం చూపించేవి ఏవి? మీ జేబుకు చిల్లు పెట్టేవి ఏవి? తెలుసుకోండి.

PAN Aadhaar Linking: ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి 2023 మార్చి 31 వరకే అవకాశం ఉంది. రూ.1,000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్ లింక్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఆ పాన్ కార్డుల్ని ఎక్కడా ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించకూడదు.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక డెట్ ఫండ్ ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తించవు. ఫైనాన్స్ బిల్ 2023లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం 35 శాతం కన్నా ఎక్కువ ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే లాభాలను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గానే పరిగణిస్తారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది.

PAN Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఈ 5 సమస్యలు తప్పవు మరి

LPG Gas Cylinder Price: ప్రతీ నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. సిలిండర్ ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. మార్చి 1న గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరగగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.350 పెరిగింది. మరి ఏప్రిల్ 1న ఏం జరుగుతుందో చూడాలి.

New Income Tax Regime: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన సమయంలో కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులన్నీ 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. అంతే కాదు 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. పాత పన్ను విధానంలో కొనసాగాలనుకునేవారు తప్పనిసరిగా ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.

NPS New Rules: ఎన్‌పీఎస్ ఖాతాదారులు విత్‌డ్రాయల్ ప్రాసెస్ చేయాలంటే 2023 ఏప్రిల్ 1 నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్ ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయల్ ఫామ్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్, ప్రాణ్ కార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి.

Akshaya Tritiya: అక్షయ తృతీయకు నెల రోజులు... బంగారం ఇప్పుడు బుక్ చేయడమే మంచిదా?

BS6 Phase 2: ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 ఫేజ్ 2 అమలులోకి వస్తోంది. BS6 ఫేజ్ 2లో, వాహనాలు తప్పనిసరిగా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. బీఎస్6 ఫేజ్ 2 అమలులోకి వస్తుండటంతో కొత్త కార్లు, బైకుల ధరలు కూడా పెరగడం ఖాయం. ఒక్కో కార్ ధర రూ.10,000 నుంచి రూ.50,000 వరకు పెరుగుతుందని అంచనా.

First published:

Tags: Income tax, Lpg Cylinder Price, New rules, Personal Finance

ఉత్తమ కథలు