హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: అలర్ట్... జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్

New Rules: అలర్ట్... జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్

New Rules: అలర్ట్... జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: అలర్ట్... జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ (ప్రతీకాత్మక చిత్రం)

New Rules from July 1 | ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి అలర్ట్. జూలై 1 నుంచి కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి. క్రెడిట్ కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు పన్నులకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.

కొత్త నెల రాగానే కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. జూలై వచ్చేస్తోంది. జూలైలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ (New Rules) కూడా ఉన్నాయి. ఇందులో డబ్బులు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపే ప్రతీ ఒక్కరూ ఈ రూల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. పాన్ ఆధార్ లింకింగ్ (PAN Aadhaar Linking), క్రెడిట్ కార్డ్ (Credit Card), క్రిప్టో కరెన్సీ, డీమ్యాట్ అకౌంట్ ఇలా పలు రకాల అంశాలకు సంబంధించి జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. మరి ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.

Credit Card: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొద్ది రోజుల క్రితం క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఇష్యూయెన్స్ అండ్ కండక్ట్ డైరెక్షన్స్ 2022 పేరుతో రూల్స్ ప్రకటించింది. 2022 జూలై 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజ్ చేసే విషయంలో బ్యాంకులు కస్టమర్ల రిక్వెస్ట్‌ను వీలైనంత త్వరగా అంగీకరించాల్సి ఉంటుంది. ఏడు వర్కింగ్ డేస్‌లో ఆ రిక్వెస్ట్‌ను బ్యాంకులు పరిగణలోకి తీసుకొని ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఆలస్యమైతే ప్రతీ రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి.

PAN Card: పాన్ కార్డ్ ఉన్నవారు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. గడువు 2022 మార్చి 31న ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేస్తే రూ.500 జరిమానా చెల్లిస్తే చాలు. జూలై 1 నుంచి పాన్, ఆధార్ లింక్ చేస్తే రూ.1,000 జరిమానా చెల్లించాలి.

LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీతో వరుసగా మూడేళ్లు డబ్బులొస్తాయి... పూర్తి వివరాలివే

Cryptocurrency: జూలై 1 నుంచి అన్ని క్రిప్టో లావాదేవీలపై పన్నులు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం 1 శాతం టీడీఎస్ విధించనుంది. క్రిప్టో ట్రేడింగ్‌లో నష్టపోయినా పన్నులు వర్తిస్తాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్రిప్టో ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధించిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 1 శాతం టీడీఎస్ అమలులోకి వస్తుంది.

Labour Codes: జూలై నుంచి కొత్త లేబర్ చట్టాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్ కోడ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. కంపెనీలు వారానికి 6 రోజులు లేదా వారానికి 5 రోజులు లేదా వారానికి 4 రోజుల వర్క్ వీక్ ఎంచుకోవచ్చు. గ్రాస్ సాలరీలో బేసిక్ సాలరీ 50 శాతం ఉండాలి. ఉద్యోగులు, యాజమాన్యం పీఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది.

AC Price: బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఎనర్జీ రేటింగ్ రూల్స్‌ని మార్చింది. ఈ రూల్ ప్రకారం 5 స్టార్ ఏసీలన్నీ ఆటోమెటిక్‌గా 4 స్టార్ ఏసీలుగా మారతాయి. కంపెనీలు ఏసీల ధరల్ని 10 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.

PAN Card: పాన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... మీకు ఈ రూల్స్ తెలుసా?

LPG Prices: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్ని పరిగణలోకి తీసుకొని ధరల్ని సవరిస్తాయి. జూలై 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చే లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు.

Demat Account: డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినవారు తప్పనిసరిగా జూన్ 30 లోగా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. లేకపోతే వారి డీమ్యాట్ అకౌంట్ జూలై 1 నుంచి తాత్కాలికంగా నిలిచిపోతుంది. ట్రేడింగ్ చేయడం కుదరదు.

TDS Rules: డాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతరులు ఎవరైనా ఉచిత బహుమతులు, ఇతర ప్రయోజనాలు పొందితే 10 శాతం టీడీఎస్ చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదేశిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని 194ఆర్ సెక్షన్ ప్రకారం 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. ఈ రూల్ 2022 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది.

Straw Ban: భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధం అమలులోకి రానుంది. జూలై 1 నుంచి బెవరేజ్ కంపెనీలు ప్లాస్టిక్ స్ట్రాలు సప్లై చేయకూడదు. పేపర్ స్ట్రా మాత్రమే సప్లై చేయాలి. ఈ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తుందని అమూల్ సహా ఇతర బెవరేజ్ కంపెనీలు ఆశిస్తున్నాయి.

First published:

Tags: Aadhaar Card, Income tax, Lpg Cylinder Price, New rules, PAN card, Personal Finance