హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: ఫిబ్రవరిలో కొత్త రూల్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి

New Rules: ఫిబ్రవరిలో కొత్త రూల్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి

New Rules: ఫిబ్రవరిలో కొత్త రూల్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: ఫిబ్రవరిలో కొత్త రూల్స్... ఈ విషయాలు గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

New Rules from February 1 | ఫిబ్రవరి 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి. సామాన్యుల జేబుకు చిల్లుపెట్టేవే ఎక్కువగా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త నెల రాగానే కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఫిబ్రవరిలో కూడా కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రానున్నాయి. వాటిలో సామాన్యుల జేబులకు చిల్లుపెట్టేవి కూడా ఉన్నాయి. ఇంకొన్ని రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మరో విషయం ఏంటంటే, ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను (Union Budget) పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇక ఫిబ్రవరిలో అమలులోకి రాబోయే కొత్త రూల్స్ ఏంటీ? అవి మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తెలుసుకోండి.

Union Budget 2023-24: వచ్చే ఏడాదికి ఎన్నికల ముందు ఇదే చివరి బడ్జెట్. దీంతో అన్ని వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుంది? ఏఏ వరాలు కురిపిస్తుంది? అని ఉద్యోగుల నుంచి రైతుల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రజలకు ఊరట కలిగించే, జేబుకు చిల్లుపెట్టే అంశాలు ఉంటాయి.

LIC Policy: రోజూ రూ.40 పొదుపు... రూ.25 లక్షల రిటర్న్స్... ఈ ఎల్ఐసీ పాలసీతో సాధ్యం

LPG Gas Cylinder: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి రోజున గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. ఫిబ్రవరి 1న గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా? తగ్గుతుందా? అని సామాన్యులు ఎదురుచూస్తుంటారు. ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధర పెంచవచ్చు. తగ్గించవచ్చు. లేదా స్థిరంగా కొనసాగించవచ్చు.

Credit Card: బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తే 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ యూజర్లకు భారం తప్పదు.

Packaging Rules: మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి కొత్త ప్యాకేజింగ్ రూల్స్ అమలుచేయనుంది. పిండి, బిస్కిట్స్, నీళ్లు, సిమెంట్ బ్యాగ్స్, ధాన్యాల లాంటి 19 రకాల వస్తువులపై ప్యాకేజింగ్ సమాచారం తప్పనిసరి కానుంది. అందులో బరువు, తయారు చేసిన తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి.

Electric Bike: మేడ్ ఇన్ హైదరాబాద్ ఎలక్ట్రిక్ బైక్... కిలోమీటర్ ఖర్చు 25 పైసలు మాత్రమే

Tata Motors: టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచింది. కొత్త ధరలు 2023 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.2 శాతం వరకు పెంచింది కంపెనీ. అంటే రూ.10 లక్షల కారుపై సుమారు రూ.12,000 వరకు ధర పెరగనుంది.

New Rules in Goa: గోవా వెళ్లేవారికి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. పర్యాటకులు బీచ్‌లో ఇతరుల అనుమతి లేకుండా వారి ఫోటోస్ క్లిక్ చేయకూడదు. ఫారినర్స్ ఫోటోలు క్లిక్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. బీచ్‌లో మద్యం సేవించకూడదు. వంటలు చేసుకోకూడదు. ఈ రూల్స్ పాటించకపోతే రూ.50,000 ఫైన్ చెల్లించాలి.

First published:

Tags: Credit cards, LPG Cylinder, Lpg Cylinder Price, New rules, Personal Finance, Tata Motors

ఉత్తమ కథలు