హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules from August 1: అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules from August 1 | ఆగస్ట్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. మీపై ప్రభావం చూపించే రూల్స్ గురించి తెలుసుకోండి.

మీరు ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే అలర్ట్. 2021 ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ సామాన్యులను ఎక్కువగా ప్రభావితం చేసేవే. ఏటీఎం లావాదేవీలు, ఎల్‌పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్ట్ 1న మారబోయే రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? తెలుసుకోండి.

Salary, Pension, EMI: మీకు ప్రతీ నెల ఒకటో తేదీన జీతం అకౌంట్‌లో పడుతుందా? ఒక్కోసారి ఒకటో తేదీ ఆదివారం వస్తే సాలరీ రావడం ఆలస్యం అవుతుంది. కానీ ఇకపై ఇలాంటి సమస్యే ఉండదు. సెలవు రోజుల్లో కూడా ఖాతాదారుల అకౌంట్లలో వేతనాలు, పెన్షన్లు జమ చేసేలే నేషనల్ ఆటోమెటెడ్ క్లియరెన్స్ హౌజ్-NACH మార్పులు చేసింది. 2021 ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆగస్ట్ 1 ఆదివారం రోజు కూడా వేతనాలు, పెన్షన్లు, డివిడెండ్, వడ్డీ క్రెడిట్ అవుతాయి. అంతేకాదు... మీరు చెల్లించాల్సిన ఈఎంఐ, మ్యూచువల్ ఫండ్ సిప్, లోన్ పేమెంట్ లాంటి వాటికీ ఈ రూల్ వర్తిస్తుంది. అంటే సెలవు రోజుల్లో కూడా పేమెంట్స్ జరిగిపోతాయి.

Rs 15 lakh prize money: మోదీ ప్రభుత్వం అద్భుత అవకాశం... రూ.15,00,000 గెలుచుకోండి ఇలా

Bank Holidays in August 2021: ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి

ATM Cash Withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.17 చెల్లించాలి. నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.6 చెల్లించాలి. ప్రస్తుతం ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.15, నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ఉన్న సంగతి తెలిసిందే.

LPG Gas Cylinder Price: ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. జూలైలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. మరి ఆగస్టులో సిలిండర్ ధర పెరుగుతుందా, తగ్గుతుందా అన్న విషయం ఆగస్ట్ 1న తెలుస్తుంది.

India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB కస్టమర్లు డోర్‌స్టెప్ సర్వీసులకు ఇక అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఐపీపీబీ 2021 ఆగస్ట్ 1 నుంచి డోర్‌స్టెప్ సేవలకు రూ.20+జీఎస్‌టీ వసూలు చేయనుంది. ఇప్పటివరకైతే ఐపీపీబీ డోర్‌స్టెప్ సేవలకు ఛార్జీలు లేవు.

IRCTC New Rule: ఐఆర్‌సీటీసీ కొత్త రూల్... టికెట్ బుక్ చేయాలంటే ఇది కంపల్సరీ

Airtel Plans: రూ.299 నుంచి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ తెలుసుకోండి

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ పలు ఛార్జీలను సవరించింది. క్యాష్ ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్ బుక్ లాంటి అంశాల్లో 2021 ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఆ తర్వాత జరిపే లావాదేవీలకు రూ.150 ఛార్జీలు చెల్లించాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు హోమ్ బ్రాంచ్‌లో ప్రతీ రోజు రూ.1,00,000 వరకు లావాదేవీలు ఉచితం. రూ.1,00,000 దాటితే ప్రతీ రూ.1,000 కి రూ.5 ఛార్జీ చెల్లించాలి. కనీసం రూ.150 ఛార్జీ చెల్లించాలి. నాన్ హోమ్ బ్రాంచ్‌లో ప్రతీ రోజు రూ.25,000 వరకు లావాదేవీలు ఉచితం. రూ.25,000 దాటితే ప్రతీ రూ.1,000 కి రూ.5 ఛార్జీ చెల్లించాలి. థర్డ్ పార్టీ లావాదేవీలు రూ.25,000 వరకు ఉచితం. ఆ తర్వాత ప్రతీ లావాదేవీకి రూ.150 చెల్లించాలి. ఇక ఒక ఏడాదిలో 25 లీవ్స్ ఉన్న చెక్ బుక్ ఉచితం. ఆ తర్వాత 10 లీవ్స్ ఉన్న చెక్ బుక్‌కు రూ.20 చెల్లించాలి.

Central Board of Direct Taxes: 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15 కి పొడిగించింది.

Honda Cars: హోండా కార్స్ ఆగస్టులో కార్ల ధరల్ని పెంచుతోంది. అయితే ఏఏ మోడల్స్‌పై ఎంత ధర పెరగనుందో ఇంకా తెలియదు.

First published:

Tags: ATM, Atm withdrawal, Check the Price of LPG, Icici, Icici bank, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు