హోమ్ /వార్తలు /బిజినెస్ /

LPG Gas Connection: మారుమూల గ్రామానికి మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..

LPG Gas Connection: మారుమూల గ్రామానికి మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..

LPG Gas Connection: మారుమూల గ్రామానికి మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..

LPG Gas Connection: మారుమూల గ్రామానికి మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్.. సంబరాలు చేసుకుంటున్న ప్రజలు..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఒక పల్లెటూరుకు తాజాగా మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్ మంజూరయ్యాయి. దీంతో అక్కడి ప్రజలంతా ఈ సందర్భాన్ని వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Arunachal Pradesh, India

భారతదేశంలోని చాలా మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు అంటే అతిశయోక్తి కాదు. అందులోనూ ఈశాన్య రాష్ట్రాలు(North East States) చాలా ఏళ్లుగా వివక్షకు గురయ్యాయి. అయితే ఇటీవల అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పుంజుకోవడంతో, కొండకోనల్లోని గ్రామాలకు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయి. ఈ క్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని(Arunachal Pradesh) ఒక పల్లెటూరుకు తాజాగా మొదటిసారి గ్యాస్ కనెక్షన్స్ మంజూరయ్యాయి. దీంతో అక్కడి ప్రజలంతా ఈ సందర్భాన్ని వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇండియాలో అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఒకటైన ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్-మయన్మార్ సరిహద్దులోని ఉంది. విజయ్‌నగర్‌గా పిలిచే ఈ పల్లెకు చేరుకోవాలంటే కాలినడక ఒక్కటే మార్గం. లేదంటే హెలికాప్టర్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఇలాంటి మారుమూల గ్రామానికి ఓ LPG సంస్థ గ్యాస్ కనెక్షన్ అందించింది. 15 కుటుంబాలకు ఎల్‌పీజీ సిలిండర్లను పంపిణీ చేసింది. దాంతో ఆ ఊరి ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు.

Language War: SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన..

* అక్కడ మొదటిసారి

భారతదేశంలో LPG గ్యాస్ కనెక్షన్ 1965లోనే అందుబాటులోకి వచ్చింది. అంటే 57 ఏళ్లు పూర్తవుతోంది. అయినా ఈ కాలమంతా విజయ్‌నగర్ వాసులకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ గ్రామానికి వాహనాలు ప్రయాణించడం వీలు కాలేదు. అయితే ఇటీవల ఆ గ్రామానికి వెళ్లేందుకు ఒక రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. దాంతో త్వరలోనే ఈ ఊరి ముఖచిత్రం మారిపోనుంది. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణం 90 శాతానికి పైగా పూర్తయింది. దీనివల్ల ఊరికి వాహనాలు ప్రయాణించగలగుతున్నాయి. సరుకులు, ఇతర వస్తువులను రవాణా చేస్తున్నాయి. 157 కి.మీ. పొడవుండే ఈ రోడ్డు విజయ్‌నగర్‌ను మియావోతో కలుపుతుంది. మియావో నుంచి విజయ్‌నగర్‌కు చేరుకోవడానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం, చాంగ్‌లాంగ్ జిల్లాలోని మియావో సబ్‌డివిజన్‌లో ఉన్న ఒక ఏజెన్సీ, 157 కి.మీ దూరంలోని విజయనగర్‌లో 15 కుటుంబాలకు ఎల్‌పీజీ సిలిండర్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక మంత్రి కమ్‌లుంగ్ మోసాంగ్ మాట్లాడుతూ.. ఎల్‌పీజీ పంపిణీ సేవ ప్రజల చిరకాల అవసరాలను తీర్చిందని అన్నారు. ఈ గ్రామ ప్రజలు వంట కోసం పూర్తిగా కట్టెలపై ఆధారపడతున్నారని.. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విజయ్‌నగర్‌లో జీవితం చాలా కష్టమని.. స్థానికులు 15-20 కిలోమీటర్లు నడిచి అడవికి వెళ్లి కట్టెలు సేకరించాల్సి ఉంటుందని ఒకరన్నారు. అయితే ఇప్పుడు ఏజెన్సీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో వారంతా సంతోషిస్తున్నారు.

Top 10 Skills To Get Job: ఉద్యోగ సాధనలో ఉపయోగపడే టాప్ 10 నైపుణ్యాలు ఇవే.. నివేదిక విడుదల చేసిన లింక్డ్‌ఇన్ ..

ప్రస్తుతం కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని గ్యాస్ ఏజెన్సీ యజమాని అంటు న్గేము తెలిపారు. దాదాపు 500 మంది ఇతరులు LPG కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. అయితే వారి డాక్యుమెంట్స్ ఇంకా ఏజెన్సీకి చేరలేదని తెలిపారు. “లాజిస్టిక్స్, డాక్యుమెంటేషన్ వంటి సమస్యల కారణంగా మేం గతంలో వారికి సేవను విస్తరించలేకపోయాం. వారు ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కోసం కూడా చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే’’ అని అంటు న్గేము పేర్కొన్నారు. 8,000 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విజయ్‌నగర్‌ను 1961లో "శ్రీజిత్ II (Srijit II)" అనే ఓ యాత్రలో అస్సాం రైఫిల్స్ కనుగొన్నారు. అప్పటి ఇన్‌స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏఎస్ గురయ్య నేతృత్వంలో ఆ యాత్ర కొనసాగింది. ఆ ఇన్‌స్పెక్టర్ ఈ ప్రాంతానికి తన కొడుకు విజయ్ పేరు పెట్టారు.

Published by:Veera Babu
First published:

Tags: India, Indian, Indian gas, Lpg connection

ఉత్తమ కథలు