Home /News /business /

LPG CYLINDER PRICE UPDATES LPG 19 KG COMMERCIAL CYLINDER PRICE CUT TODAY KNOW RATES IN YOUR CITY MKS

LPG Cylinder Price : గుడ్ న్యూస్.. తగ్గిన వంట గ్యాస్ సిలిండర్‌ ధర.. దేనిపై ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంధన ధరలకు సంబంధించి చాలా రోజుల తర్వాత కాస్త ఊరట వార్త వెలువడింది. ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర కొద్దిగా దిగొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఇది వాణిజ్య (కమర్షియల్) సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆయిల్ కంపెనీలు ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేశాయి. LPG 19 Kg Commercial Cylinder Price Cut

వంట గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి. సోమవారం నుంచి సిలిండర్ పై రూ.36 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1,976కు చేరింది.

ధర తగ్గించకముందు, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2012గా ఉండేది. తాజాగా ధర తగ్గింపుతో టీ స్టాళ్లు, చిన్న పాటి టిఫిన్ సెంటర్లు నడుపుకునే వారికి కాస్త ఊరట లభించనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Commrcial lpg dip, LPG Cylinder, Lpg Cylinder Price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు