హోమ్ /వార్తలు /బిజినెస్ /

February New Rules: ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

February New Rules: ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

February New Rules: ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

February New Rules: ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

February New Rules | ప్రతీ నెలలాగానే ఫిబ్రవరిలో కూడా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వాటిలో మీపై ప్రభావం చూపించే రూల్స్ ఏవో తెలుసుకోండి.

సరికొత్త మార్పులు, టెక్నాలజీతో లింక్ అయిన ఎన్నో మార్పులతో ఫిబ్రవరి నుంచి మనందరం కొన్ని కొత్త పద్ధతులకు పూర్తిగా అలవాటుపడాల్సి ఉంటుంది. ఓవైపు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ట్యాక్స్ విధానాల్లో మార్పులతో పాటు పలు రంగాలపై కేంద్రం ప్రకటించే సరికొత్త రాయితీలు లేదా సెస్ లకు మనం అలవాటుపడాలి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు ప్రతి నెలా ఒకటవ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రివైజ్ చేస్తాయి కనుక వీటికి మనం మానసికంగా సిద్ధపడాలి. వాహనాలున్నవారు ఫాస్టాగ్ ను తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. మరి ఏ రోజున ఏ రూల్స్ అమలులోకి వస్తాయో తెలుసుకోండి.

కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇప్పటికే 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుస్తున్న సినిమా హాళ్లు, థియేటర్లలో మరిన్ని సీట్లు బుక్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

PM Kisan Scheme: ఈ చిన్న మిస్టేక్‌తో మీ అకౌంట్‌లోకి రూ.6000 రావు... సరిదిద్దుకోండి ఇలా

Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

ఇక ఫిబ్రవరి 1న ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి ఆయిల్ కంపెనీలు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరల్ని దృష్టిలో పెట్టుకొని ధరల్ని సవరిస్తూ ఉంటాయి. డిసెంబర్ నుంచి సిలిండర్ ధర రూ.100 పెరిగిన సంగతి తెలిసిందే. మరి ఈసారి సిలిండర్ ధర తగ్గుతుందో పెరుగుతుందో చూడాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి కొత్త ఏటీఎం రూల్స్‌ను గుర్తుంచుకుని, పాటించాల్సి ఉంటుంది. ఏటీఎం యాక్టివిటీస్ ఎక్కువగా చేయటాన్ని నియంత్రిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈనెల 14న ఓ ట్వీట్ చేసింది... దాని సారాంశం ఏమిటంటే.. “ఏటీఎంల్లో నగదు బదిలీ చేసే క్రమంలో ఎన్నో మోసాలు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను నియంత్రిస్తున్నాం..గో డిజిటల్ స్టే సేఫ్”. ఈ ప్రకటన నేపథ్యంలో మీరు PNB ATM యూజర్ అయితే ఇక డిజిటల్ పేమెంట్ గేట్వేలను డౌన్ లోడ్ చేసుకుని, వీటికి అలవాటు పడాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ లిమిట్‌ను తగ్గించటంతో ఏటీఎంలపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఫైనాన్సిషయల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పై ప్రభావం పడకుండా మీరు జాగ్రత్త పడండి. పీఎన్ బీ Non-EMV ATM మెషీన్ల వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి ఈ నియమం పరిధిలోకి వస్తారు కనుక మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ కు మానసికంగా సిద్ధంగా ఉండండి. Non-EMV ATM మెషీన్లు అంటే ఏటీఎం కార్డు లేకుండానే ట్రాన్సాక్షన్స్ జరిపే సౌకర్యాన్ని కల్పిస్తాయి, అదే EMV ATM మెషీన్లయితే మీరు ఏటీఎం మెషీన్లోకి కార్డు పెడితే అది చిప్ లోని డేటా రీడ్ చేసి ట్రాన్సాక్షన్స్ ను అనుమతిస్తుందన్నమాట. కాబట్టి మీరు Non-EMV ATM వినియోగదారులా కాదా, లేక EMV ATM మెషీన్ల యూజర్లైతే తక్షణం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వెళ్లి కార్డు అప్ డేట్ చేసుకోవటం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచును సంప్రదించండి.

February 2021 Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులో పనులున్నాయా? గుడ్ న్యూస్

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయండి ఇలా

ఫిబ్రవరి 15 నుంచి అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండితీరాల్సిందే. సిటీలో, ఊళ్లలో తిరిగేందుకు ఫాస్టాగ్ అవసరం లేనప్పటికీ హైవేపై ప్రయాణించాలంటే టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలుపుదల చేయనున్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాలకు ఫాస్టాగ్ ఉండితీరాల్సిందే. మనమంతా ఉపయోగించే వాహనాలు M, N కేటగెరీల్లో కిందికు వస్తాయి, వీటికి ఫాస్టాగ్ లేకపోతే మీరు హైవేపై, ఔటర్ రింగ్ రోడ్ పై ప్రయాణించటం కుదరని పని. ఈమేరకు సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్ ను కేంద్రం జారీ చేసింది. మీరు లాంగ్ జర్నీలు చేసేవారైతే తక్షణం ఈ ఫాస్టాగ్ తీసుకోండి. కాబట్టి మీకు హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద FASTag only అనే క్యూ లైన్లే కనిపిస్తాయి.

పెన్షనర్లు ప్రతి ఏటా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ పత్రం)ను సమర్పించేందుకు తుది గడువు కూడా ఫిబ్రవరి నెలాఖరే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈమేరకు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ఫిబ్రవరి 28, 2021ను డెడ్ లైన్ గా ప్రకటించిన నేపథ్యంలో మీరు సీనియర్ సిటిజన్ అయినా, మీ ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉన్నా వారి లైఫ్ సర్టిఫికేట్ ను పీఎఫ్ ఆఫీసులో ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించండి.

First published:

Tags: ATM, Bank, Bank account, Banking, FASTag, LPG Cylinder, Pension Scheme, Pensioners, Personal Finance, Punjab National Bank

ఉత్తమ కథలు