Home /News /business /

LPG CYLINDER PRICE HIKED DOMESTIC 14 KG LPG CYLINDER RATE INCREASED BY RS50 FROM TODAY COMMERCIAL LPG DECREASED MKS

LPG Cylinder Price : మరో షాక్.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు.. నేటి నుంచే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతోన్న సామాన్య ప్రజలకు ఇంధన కంపెనీలు మరో షాకిచ్చాయి. గృహ అవసరాల కోసం వాడుకునే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఎంతంటే..

ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతోన్న సామాన్య ప్రజలకు ఇంధన కంపెనీలు మరో షాకిచ్చాయి. గృహ అవసరాల కోసం వాడుకునే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder Price)  ధరను మళ్లీ పెంచాయి. దేశీయంగా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ.50 చొప్పున పెరిగాయి. సవరించిన రేట్లతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.1053కు చేరింది.

14.2 కేజీల సిలిండర్ తోపాటు 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా పెరిగింది. చిన్న సిలిండర్ పై రూ.18 మేరకు పెరిగింది. అయితే కొంతలో కొంత ఊరటగా వాణిజ్య అవసరాకు వాడే కమర్షియల్ ఎల్పీజీ ధర కొద్దిగా తగ్గింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు రూ.8.50 మేర తగ్గాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

హైదరాబాద్ నగరంలో రూ.1055 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బుధవారం నుంచి రూ.1105కు పెరిగింది. ఈ నెల 1వతేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినా, బుధవారం నుంచి గృహ అవసరాల గ్యాస్ ధరను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
Published by:Madhu Kota
First published:

Tags: LPG Cylinder, Lpg Cylinder Price, Price Hike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు