Gas Cylinder | ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? మళ్లీ సిలిండర్ బుక్ చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై పేటీఎం (Paytm) పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. పేటీఎం ద్వారా ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే అదిరే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పేటీఎం ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌పై 4 రకాల ఆఫర్లను అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎంత క్యాష్‌బ్యాక్ వస్తుందో ఎవ్వరీకి తెలీదు. వచ్చిన తర్వాతనే తెలుసుతుంది. రూ. 5 నుంచి రూ. 1000 వరకు మధ్యలో ఎంతైనా రావొచ్చు. పేటీఎం అందిస్తున్న నాలుగు రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. కీలక ప్రకటన!
గ్యాస్1000 అనే ప్రోమో కోడ్ ఉంది. దీని ద్వారా కస్టమర్లు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడాల్సి ఉంటుంది. అలాగే ఫ్రీగ్యాస్ అనే ప్రోమో కోడ్ కూడా ఉంది. ఈ ప్రోమో కోడ్ ఎంచుకుంటే.. ప్రతి 500వ కస్టమర్‌కు రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా పేటీఎం మరో ఆఫర్ కూడా అందిస్తోంది. ఏయూ క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేస్తే.. రూ. 50 వరకు తగ్గింపు పొందొచ్చు. దీనికి ఏయూసీసీ50 ప్రోమో కోడ్ వాడాలి. ఇంకా యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. సిలిండర్ బుకింగ్‌పై రూ. 30 తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్ పొందాలంటే గ్యాస్‌యస్‌సీసీ అనే ప్రోమో కోడ్ వాడాలి.
క్రెడిట్ కార్డ్ వాడే వారికి శుభవార్త.. రూ.25 వేల డిస్కౌంట్!
పేటీఎం ద్వారా ఎలా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా పేటీఎం యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ బుక్ గ్యాస్ సిలిండర్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీది ఏ గ్యాస్ కంపెనీయో ఎంచుకోవాలి. భారత్, హెచ్‌పీ, ఇండేన్ ఇలా మూడు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రోమో కోడ్ అప్లై చేసుకోవాలి. అటుపైన బుకింగ్ చేయాలి. ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు క్యాష్‌బ్యాక్ అమౌంట్ లభిస్తుంది. కాగా ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gas, HP gas, Indane Gas, LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price