LPG Booking Offer | గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? అయితే మీకు శుభవార్త. అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. సిలిండర్ బుకింగ్‌పై తగ్గిపుం సొంతం చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్‌ను (LPG Cylinder) చాలా మార్గాల్లో బుక్ చేసుకోవచ్చు. కాల్ చేసి సిలిండర్ బుక్ చేయొచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా సిలిండర్ బుక్ చేయొచ్చు. పేటీఎం, గూగుల్ పే (Google Pay) ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సార్లు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే ఆఫర్లు లభిస్తూ ఉంటాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా కూడా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా మీరు సిలిండర్ బుక్ చేస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. గరిష్టంగా రూ. 50 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎలా క్యాష్ బ్యాక్ పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.
0 వడ్డీకే లోన్, రూ.5,500 తగ్గింపు.. బైక్ , స్కూటర్ కొనే వారికి కళ్లుచెదిరే ఆఫర్లు!
బజాజ్ ఫైనాన్స్ అనేది బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ను అందిస్తోంది. ఈ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గరిష్టంగా రూ. 50 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని కోసం ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నెలలో కేవలం ఒక్క సారి మాత్రమే సిలిండర్ బుకింగ్‌పై ఈ ఆఫర్ పొందొచ్చు. మీరు బజాజ్ పే యూపీఐ ద్వారా సిలిండర్ బుక్ చేయాలి. దీని కోసం మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను బజాజ్ యూపీఐతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు.. రూ.19 వేల డిస్కౌంట్ పొందండి!
బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా సిలిండర్ ఎలా బుక్ చేయాలంటే?
ముందుగా బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ లోకి వెళ్లాలి. తర్వాత హోమ్ పేజ్‌లోకి వెళ్లాలి. ఇందులో ఎల్‌పీజీ గ్యాస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు బుకింగ్ అమౌంట్‌ను చూపిస్తుంది. తర్వాత బజాజ్ పే యూపీఐ పేమెంట్ మోడ్‌ను ఎంచుకోవాలి. మీరు బజాజ్ పే వాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత స్క్రాచ్ కార్డు వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుస్తుంది. తర్వాత కూడా మీరు సలుభంగా ఈ విధంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price