Home /News /business /

LOTTERY TICKET MADE KERALA PAINTER A MILLIONAIRE WON A REWARD OF 12 CRORES MK

Kerala Bumper Lottery Result 2022: కేరళలో అద్భుతం..పెయింటర్‌కు రూ.12 కోట్ల లాటరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kerala Bumper Lottery Result 2022: కేరళలోని కొట్టాయంలోని ఒక పెయింటింగ్ కార్మికుడికి బంపర్ లాటరీ తగిలింది. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా రూ.12 కోట్ల లాటరీ తగిలింది. క్రిస్మస్-న్యూ ఇయర్ లాటరీ (X'mas New Year Bumper 2021-22) మొదటి బహుమతి కింద, ఏకంగా రూ.12 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు.

ఇంకా చదవండి ...
    Kerala Bumper Lottery Result 2022:  కేరళలోని కొట్టాయంలోని ఒక పెయింటింగ్ కార్మికుడికి బంపర్ లాటరీ తగిలింది. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా రూ.12 కోట్ల లాటరీ తగిలింది. క్రిస్మస్-న్యూ ఇయర్ లాటరీ (X'mas New Year Bumper 2021-22) మొదటి బహుమతి కింద, ఏకంగా రూ.12 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు. తిరువనంతపురంలో కుడయంపాడికి చెందిన సదానందన్ అలియాస్ సదన్ గత వారం ఒక షాపులో  XG 218582 నంబర్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ఆ లాటరీ తగలడంతో అతడి అదృష్టం మారిపోయింది. అతడు స్థానిక మీడియాకు చెబుతూ,  “ఈ ఉదయం నేను చికెన్ కొందామని, సమీపంలోని మార్కెట్‌కు వెళ్లాను. అక్కడే  సెల్వన్ అనే లాటరీ టిక్కెట్ వర్తకుడి నుంచి సరదాగా టిక్కెట్‌ కొనుగోలు చేసాను" అని సదానందన్ చెప్పుకొచ్చారు. ఈ టిక్కెట్టును కొట్టాయం పట్టణంలోని లాటరీ ఏజెంట్ బిజి వర్గీస్, కుడేంపాడి సమీపంలోని పాండవంలో లాటరీ డీలర్ కు కున్నెపరంబిల్ సెల్వన్‌కు విక్రయించగా, అతడి నుంచి సదానందన్ కొనుగోలు చేశాడు.

    క్రిస్మస్ బంపర్ టిక్కెట్ ధర రూ. 300 కాగా మొదటి బహుమతిగా రూ.12 కోట్లు, రెండో బహుమతి రూ. 3 కోట్లు, మూడో బహుమతి రూ. 60 లక్షలుగా నిర్ణయించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం లాటరీ విభాగం ప్రారంభంలో 24 లక్షల టిక్కెట్లను ముద్రించగా, అందులో సదానందం విజేతగా నిలవడం అదృష్టం అనే చెప్పాలి.

    ఇదిలా ఉంటే గెలిచిన 12 కోట్లతో ఏం చేస్తావని సదానందంను ప్రశ్నించగా, తన పిల్లలు సనీష్, సంజయ్‌ల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వినియోగిస్తానని చెప్పాడు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2021లో, ఓనం తర్వాత కేరళ ఆటో డ్రైవర్ రూ. 12 కోట్ల లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Kerala Lottery

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు