టెక్నాలజీ పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ (Train Ticket Booking) చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ (IRCTC Ticket Booking) సదుపాయంతో ఆన్‌లైన్‌లో ఈజీగా రైలు టికెట్లు బుక్ చేస్తున్నారు. అయినా ఇప్పటికీ రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్‌లో రైలు టికెట్లు (Train Tickets) తీసుకుంటున్నవాళ్లు ఉన్నారు. మరి రైలు టికెట్ పోతే ఏం చేయాలి? జర్నీలో భారీగా ఫైన్ కట్టాల్సిందేనా? డూప్లికేట్ ట్రైన్ టికెట్ (Duplicate Train Ticket) తీసుకోవచ్చా? ఇలా రైల్వే ప్రయాణికులకు అనేక సందేహాలు ఉంటాయి. దీనిపై భారతీయ రైల్వే నియమనిబంధనలు (Indian Railways Rules) ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
రైలు ప్రయాణ సమయంలో జర్నీ పూర్తి చేసుకొని, మీరు దిగాల్సిన స్టేషన్‌లో రైలు దిగి, బయటకు వెళ్లేంత వరకు మీ రైలు టిక్కెట్ మీ దగ్గరే ఉండటం అవసరం. టికెట్ పోగొట్టుకున్నా లేదా సీటు బుక్ చేసుకోకుండా ప్రయాణించినా భారీ జరిమానాను చెల్లించాల్సిన పరిస్థితి రావొచ్చు. అయితే రైల్వే నియమనిబంధనల గురించి తెలియకపోవడం వల్ల రైల్వే ప్రయాణికులు, తమ రైలు టికెట్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక కంగారుపడుతుంటారు.
LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారికి కొత్త రేట్స్... ఎక్కువ రిటర్న్స్
మీరు ట్రైన్ టికెట్ పోగొట్టుకున్నట్టైతే మీ పేరుతో టికెట్ కౌంటర్‌లో లేదా టీటీఈ సాయంతో డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు. ఇందుకోసం కాస్త ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ పోయినట్టు గుర్తించిన ప్రయాణికులు నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లి లేదా టీటీఈని కలిసి డూప్లికేట్ టికెట్ కావాలని కోరాలి.
డూప్లికేట్ ట్రైన్ టికెట్ ఎలా పొందాలో భారతీయ రైల్వే తమ అధికారిక వెబ్‌సైట్‌లో వివరించింది. స్లీపర్ లేదా సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.50 ఛార్జీ చెల్లించాలి. ఏసీ కోచ్ టికెట్ అయితే రూ.100 ఫీజు చెల్లించాలి. ఒకవేళ రిజర్వేషన్ ఛార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత డూప్లికేట్ టికెట్ కావాలంటే మొత్తం ఛార్జీలో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ట్రైన్ టికెట్ చిరిగిపోతే ఛార్జీలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు డూప్లికేట్ టికెట్ జారీ చేయరు.
PAN Card: పాన్ కార్డ్ ఉన్నవారికి లాస్ట్ వార్నింగ్... అప్పటివరకే ఛాన్స్
రైల్వే ప్రయాణికులకు ఇక్కడ ఓ వెసులుబాటు ఉంది. మీరు డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఒరిజినల్ టికెట్ దొరికితే ఏం చేయాలి? అని డౌట్ రావొచ్చు. డూప్లికేట్ టికెట్ కౌంటర్‌లో డిపాజిట్ చేసి రీఫండ్ తీసుకోవచ్చు.
ఇలా భారతీయ రైల్వేకి సంబంధించి అనేక నియమనిబంధనలు ఉన్నాయి. తరచూ రైల్వే ప్రయాణం చేసేవారు ఇలాంటి రూల్స్ తెలుసుకుంటే జర్నీలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways