హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా

SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

SBI Debit Card | పొరపాటున ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే కార్డును బ్లాక్ చేసే పద్ధతిని సులభతరం చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ డెబిట్ లేదా ఏటీఎం కార్డుతో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? జేబులో ఏటీఎం కార్డు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జేబులో ఉన్నంత ధీమా ఉంటుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఏటీఎం కార్డుల్ని పోగొట్టుకుంటారు. లేదా ఎవరైనా దొంగిలిస్తూ ఉంటారు. ఏటీఎం కార్డు కనిపించకపోతే కస్టమర్లు పడే కంగారు అంతా ఇంతా కాదు. ఆ సమయంలో కంగారు పడకుంటే ఏం చేయాలన్నది ఆలోచించాలి. లేకపోతే అకౌంట్‌లోంచి డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. వెంటనే ఏటీఎం కార్డు బ్లాక్ చేయించడం అవసరం. కస్టమర్లు కార్డు ఎలా బ్లాక్ చేయాలో, తిరిగి కొత్త కార్డు ఎలా పొందాలో ఎస్‌బీఐ వివరించింది. కార్డు బ్లాక్ చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇందుకోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కార్డు బ్లాక్ చేయించొచ్చు. అంతే కాదు కొత్త కార్డు పొందొచ్చు. ఎస్‌బీఐ కస్టమర్లు తమ ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి కార్డు బ్లాక్ చేయించొచ్చు. తమ అడ్రస్‌కు మరో కార్డు పంపమంటూ రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే కాల్ చేయాలి.

ATM: ఏటీఎం యూజర్లకు అలర్ట్... ఇక ఈ ఛార్జీలు చెల్లించాల్సిందే

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

హెల్ప్ లైన్ నెంబర్స్ మాత్రమే కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా కార్డు బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం కస్టమర్లు ముందుగా https://www.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత e-Services ట్యాబ్‌లో ATM Card Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Block ATM Card పైన క్లిక్ చేయాలి. మీ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. యాక్టీవ్‌లో, బ్లాక్‌లో ఉన్న కార్డుల వివరాలు కనిపిస్తాయి. కార్డు మొదటి నాలుగు అంకెలు, చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కార్డును సెలెక్ట్ చేసి Submit పైన క్లిక్ చేయాలి. వివరాలు ఓసారి సరిచూసుకొని కన్ఫామ్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎస్ఎస్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి. మీ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ వెంటనే బ్లాక్ అవుతుంది.

First published:

Tags: ATM, Bank, Banking, Sbi, Sbi card

ఉత్తమ కథలు