Home /News /business /

LOST YOUR PAN CARD KNOW HOW TO DOWNLOAD E PAN CARD PDF ON YOUR SMARTPHONE SS

PAN Card: పాన్ కార్డ్ పోయిందా? మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా

PAN Card: పాన్ కార్డ్ పోయిందా? మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

PAN Card: పాన్ కార్డ్ పోయిందా? మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Pan Card Download | పాన్ కార్డును జేబులో క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లో పాన్ కార్డ్ కాపీ దాచుకోవాలనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా ఇ-పాన్ కార్డ్ (e-PAN Card) డౌన్‌లోడ్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
ఆర్థిక లావాదేవీలు చేసేవారు తప్పనిసరిగా పాన్ కార్డ్ తమ జేబులో క్యారీ చేస్తుంటారు. లావాదేవీలు జరిపే సమయంలో పాన్ నెంబర్ (PAN Number) అవసరం అయినప్పుడు పాన్ కార్డ్ జిరాక్స్ చేయించి ఇస్తుంటారు. అయితే జేబులో పాన్ కార్డ్ (PAN Card) దాచుకున్నవారు పొరపాటున ఆ కార్డును పోగొట్టుకోవడం సాధారణమే. లేదా ఇంట్లో ఎక్కడో ఓచోట పాన్ కార్డ్ పారేసుకొని వెతుకుతూ ఉంటారు. పాన్ కార్డ్ పోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు. పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఈజీగా పాన్ కార్డ్ డౌన్‌లోడ్ (PAN Card Download) చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

స్మార్ట్‌ఫోన్‌లో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా


Step 1- ముందుగా onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Acknowledgement Number, PAN అని రెండు ఆప్షన్స్ ఉంటాయి.

Step 3- PAN సెలెక్ట్ చేయాలి.

Step 4- మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 5- ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6- పుట్టిన సంవత్సరం, నెల సెలెక్ట్ చేయాలి.

Step 7- నియమనిబంధనలన్నీ చదివి బాక్స్ టిక్ చేయాలి.

Step 8- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 9- ఆ తర్వాత స్క్రీన్‌లో పాన్ కార్డ్ కనిపిస్తుంది.

Step 10- డౌన్‌లోడ్ చేసి స్మార్ట్‌ఫోన్‌లో భద్రపర్చుకోవాలి.

CIBIL Report: మీ సిబిల్ రిపోర్ట్‌లో తప్పులున్నాయా? ఇలా ఫిర్యాదు చేయండి

ఇటీవల పాన్ కార్డుకు దరఖాస్తు చేసినవారు కూడా ఇదే ప్రాసెస్‌తో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇందుకోసం అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. గత 30 రోజుల్లో పాన్ కార్డ్ అప్‌డేట్ చేసినవారు కూడా ఇలాగే డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇ-పాన్ కార్డ్ మూడుసార్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేయొచ్చు. 30 రోజుల కన్నా ముందు పాన్ కార్డ్ అలాట్ అయినవారైతే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి రూ.Rs.8.26 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటివరకు పాన్ కార్డ్ తీసుకోనివారు కూడా కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డ్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Savings Scheme: రూ.5 లక్షల రిటర్న్స్ కోసం నెలకు రూ.1,000 పొదుపు చేస్తే చాలు


కొత్తగా పాన్ కార్డ్ తీసుకోండి ఇలా


Step 1- ముందుగా incometax.gov.in/iec/foportal వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Instant e-PAN ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత Get New e-PAN పైన క్లిక్ చేయాలి.

Step 4- మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.

Step 5- మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

Step 6- సబ్మిషన్ పూర్తైన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది.

ఆ తర్వాత ఆధార్ కేవైసీ ప్రకారం మీ వివరాలు అప్‌డేట్ చేసి ఇ-పాన్ కార్డ్ పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: PAN card, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు