హోమ్ /వార్తలు /బిజినెస్ /

PAN card: మీ పాన్ కార్డును పోగొట్టుకున్నారా?.. కేవలం 10 నిమిషాల్లో ఈ–పాన్ కార్డ్‌ పొందండిలా..

PAN card: మీ పాన్ కార్డును పోగొట్టుకున్నారా?.. కేవలం 10 నిమిషాల్లో ఈ–పాన్ కార్డ్‌ పొందండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అత్యంత కీలకమైన పాన్ కార్డును పొందడంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు, పాత కార్డు పోగొట్టుకోవడంతో కొత్త కార్డు ఎలా పొందాలో తెలియక సతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఇంకా చదవండి ...

ప్రస్తుత కాలంలో ఆర్థిక సేవల నుంచి ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు వరకు అన్నింటికీ పాన్​ కార్డు తప్పనిసరిగా మారింది. కొన్ని రకాల పొదుపు, పెట్టుబడి పథకాలకు కూడా ఇది అవసరం. చట్టబద్ధమైన గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడే ఈ అత్యంత కీలకమైన కార్డును పొందడంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు, పాత కార్డు పోగొట్టుకోవడంతో కొత్త కార్డు ఎలా పొందాలో తెలియక సతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిలేకుండా తక్షణమే ఈ–పాన్​ కార్డును తిరిగి డౌన్​లోడ్​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. కేవలం ఆధార్​ కార్ట్​ నెంబర్​తో ఈ–పాన్​ను సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఆధార్​ కార్డు తప్పనిసరిగా మీ మొబైల్ నంబరుకు అనుసంధానించి ఉండాలి.

ఈ-పాన్​ను 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ నంబర్​తో ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఒకవేళ మీరు మీ ఫిజికల్ పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే, మీరు ఈ–పాన్​ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీకు కేవలం 10 నిమిషాల సమయం పడుతుంది. ఆన్​లైన్​లో ఈ–పాన్​ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.

చెల్లెలితో కాపురానికి భర్తను ఒప్పించిన భార్య -ఆ తర్వాత జరిగిన ట్విస్టులు మామూలుగా ఉండవు..* ఈ-పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

- ముందు ఆదాయపు పన్ను అధికారిక వెబ్​సైట్​ https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html లోకి లాగిన్​ అవ్వండి.

- ఆ తర్వాత 'డౌన్‌లోడ్ ఈ-పాన్' ఆప్షన్​పై క్లిక్ చేయండి.

- మీ పాన్​ కార్డు నంబర్​, ఆధార్​ కార్డు నంబర్లను నమోదు చేయండి.

- ఆ తర్వాత మీ పుట్టిన తేదీని నమోదు చేయండి. నిబంధనలు, షరతులను అంగీకరించండి.

- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్​ చేసి కన్ఫర్మ్ బటన్‌ను నొక్కండి.

- ఆ తర్వాత, పేమెంట్ ఆప్షన్​ చూపిస్తుంది. ఈ-పాన్​ కోసం రూ. 26 చెల్లిస్తే సరిపోతుంది, మీరు యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు పూర్తి చేయవచ్చు.

- చెల్లింపు పూర్తయిన తర్వాత, మీరు మీ e-PAN కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాన్​ కార్డ్ పీడీఎఫ్​ ఫైల్​కు పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్​ ఉంటుంది. మీ పుట్టిన తేదీని పాస్​వర్డ్​గా ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఈ–పాన్​ ఓపెన్​ అవుతుంది.

First published:

Tags: Income tax, PAN card

ఉత్తమ కథలు