కరోనా మహమ్మారి విజృంభనతో జన జీవణం అస్తవ్యస్తమైంది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా వ్యాపారాలు దెబ్బతినడంతో అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిండం, జీతాలను తగ్గించడం వంటివి అమలు చేశాయి. అయితే, ఈ విపత్కర సమయంలో మీరు కూడా ఉద్యోగాన్ని కోల్పోయారా? లేదా మీ జీతంలో కోతను అనుభవిస్తున్నారా? అయితే, మీరు బాధపడనక్కర్లేదు. ఈ సమయాన్ని పాజిటివ్ గా తీసుకోండి. కంఫర్ట్ జోన్ నుండి వైదొలగడానికి, మీ స్వంత ఆలోచనలతో డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయంగా భావించండి. తద్వారా ఈ విపత్కర సమయంలో మీ కుటుంబానికి అండగా ఉండండి. మీకున్న నైపుణ్యాలతోనే ఈ 7 కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదించండి.
సమయంమీ సమయాన్నే పెట్టుబడిగా పెట్టండి. మీకున్న విలువైన సమయాన్ని స్వయం ఉపాధికి, మీ నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా పనిచేయడానికి ప్రయత్నించండి. అప్‌వర్క్, ఫ్రీలాన్సర్ వంటి వెబ్సైట్లలో మీరు కస్టమర్లను, టాస్క్‌లను కనుగొనవచ్చు. ఇదే కాకుండా స్టార్టప్ లేదా స్నేహితుడి వ్యాపారంతో పనిచేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. వారికి డేటా ఎంట్రీ, రిమోట్ కస్టమర్ సర్వీస్ లేదా రికార్డింగ్ సేల్స్ లీడ్స్ వంటి సేవలను అందించడం ద్వారా మీ నిబద్ధతను కొనసాగించవచ్చు.
నైపుణ్యం
ఫ్రెషర్ కంటే మీకున్న అదనపు అర్హతలు, అనుభవాలు, నైపుణ్యాల గురించి తెలుసుకోండి. ఇప్పుడు మీ నైపుణ్యాలకు చెల్లించే కస్టమర్లు, అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లు, చిన్న వ్యాపారాలను కనుగొనండి. బిజీగా ఉండే వ్యాపార యజమానుల కోసం రిమోట్ ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేయండి. ఇక్కడ మీరు డబ్బుతో పాటు చాలా విషయాలను నేర్చుకోగలుగుతారు.
నాలెడ్జ్
ఇండెప్త్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో జాబ్ మార్కట్లో మీ విలువను పెంచుకోండి. మీ నైపుణ్యాలతో సలహాదారుగా లేదా ఉపాధ్యాయుడిగా కూడా పనిచేయవచ్చు. దీనికి గాను మీకు గంట చొప్పున కూడా డబ్బులు చెల్లిస్తాయి ఆయా ఫ్రీలాన్నింగ్ కంపెనీలు. మీకున్న అనుభవంతో, మీరు మీ వ్యాపార యజమానులకు డబ్బు లేదా వారి వ్యాపారంలో కొంత భాగాన్ని ఇవ్వమని అడగవచ్చు. దీనిలో భాగంగా ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ నిపుణుడిగా, ఒక ప్రాజెక్ట్ సహాయకుడిగా వ్యాపారులకు సహాయంగా పనిచేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, వేదాంతు, వైట్‌హాట్ జూనియర్ వంటి ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
డబ్బు
మీ వద్ద ఉన్న డబ్బును మంచి పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేసి స్వంత ఆదాయాన్ని సృష్టించండి. దీనికి గాను మ్యూచువల్ ఫండ్స్, వృద్ధి లేదా డివిడెండ్ స్టాక్స్ గురించి తెలుసుకోవడం ఉత్తమ మార్గం. మంచి రిటర్న్స్ కోసం మీ డబ్బును పొదుపు ఖాతా కంటే మెరుగైన వాటికి ఉపయోగించుకోవడం ఉత్తమ మార్గం. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–-కామర్స్ మార్కెట్ల ద్వారా ఉత్పత్తులను సృష్టించడానికి, విక్రయించడానికి మీ వద్ద ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టండి.
సృజనాత్మకత
ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడా క్రియేటివిటీని ఉపయోగించుకొని డబ్బు సంపాదించవచ్చు. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీని ఇష్టపడితే, ఇమేజెస్ బజార్ వంటి స్టాక్ ఫోటో సైట్లలో హై క్వాలిటీ చిత్రాలను అప్లోడ్ చేయండి. మీ చిత్రాలను ఇతరులు డౌన్లోడ్ చేసినప్పుడు మీకు డబ్బు వస్తుంది. ఒకవేళ మీకు వీడియోలను రూపొందించడంపై ఎక్కువ ఇష్టం ఉంటే యూట్యూబ్ వంటి వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించండి. మీరు బ్లాగర్ అయితే, మీడియం వంటి బ్లాగులు లేదా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాఠకుల సంఖ్యను పెంచుకోండి. కంటెంట్‌ను సృష్టించడం ద్వారా కూడా మీరు సంపాదించవచ్చు.
టెక్నాలజీ
ఏదైనా టెక్- సంబంధిత నైపుణ్యం మీకు ఉంటే మీ సేవలతో వెబ్‌సైట్‌ను నడపడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే మీ వ్యూహ ప్రయత్నంతో సహాయం చేయవచ్చు లేదా బ్రాండ్‌ను పెంచుకోవచ్చు. క్లయింట్ వెబ్సైట్ లేదా మీ స్వంత ట్రాఫిక్‌తో అమ్మకాలను పెంచవచ్చు. తద్వారా ఆయా కంపెనీల నుంచి కమిషన్ సంపాదించవచ్చు. దీని కోసం మీరు అనుబంధ మార్కెటింగ్ కోర్సులను నేర్చుకోండి.
ఇంటర్న్ షిప్
ఇంటర్న్ షిప్ లు చేయడం ద్వారా మీ నాలెడ్జ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాక దీని ద్వారా భవిష్యత్‌లో మీ ఆదాయానికి అతిపెద్ద ప్రోత్సాహం లభిస్తుంది. క్రొత్త పరిష్కారాన్ని కనుగొనడానికి లేదా పరిష్కారం కనుగొనే బృందాన్ని ఒకచోట చేర్చడానికి, వ్యక్తుల మధ్య కనెక్షన్లను కనుగొనడానికి మీ నాలెడ్జ్‌ను ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. కొన్ని ఇంటర్న్‌షిప్‌లలో మీరు ఉచితంగా పనిచేసినప్పటికీ, భవిష్యత్తులో మీరు నగదు ప్రవాహాన్ని, సంపదను సృష్టించగలరు.