Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా? 10 రోజుల్లో వెనక్కి పొందొచ్చు ఇలా

Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా? 10 రోజుల్లో వెనక్కి పొందొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Online Fraud | మీరు ఆన్‌లైన్‌లో మోసపోయారా? మీ అకౌంట్ నుంచి అనధికార లావాదేవీలు (Unauthorized Transactions) జరిగాయా? మీ ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు మీ డబ్బు వాడుకున్నారా? మీ డబ్బును తిరిగి ఎలా పొందాలో తెలుసుకోండి.

  • Share this:
    ఒకప్పుడు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి డబ్బులు పంపాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. బ్యాంకుకు వెళ్లి, ఫామ్ ఫిల్ చేసి, డబ్బులు డిపాజిట్ చేస్తే అవతలివారి అకౌంట్‌లోకి రెండు మూడు రోజుల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) అయ్యేవి. కానీ ఇప్పుడు క్షణాల్లో ఒకరి అకౌంట్ నుంచి మరొకరి అకౌంట్‌లోకి క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. లక్షల రూపాయల డబ్బుల్ని నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. టెక్నాలజీతో ఇదంతా సాధ్యమవుతోంది. టెక్నాలజీ పెరిగిపోవడంతో యూపీఐ (UPI), ఐఎంపీఎస్ (IMPS), ఆర్‌టీజీఎస్ (RTGS), నెఫ్ట్ (NEFT) ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ కూడా చాలా సులువైపోయింది. నోట్ల రద్దు, కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

    Health Insurance Tips: ఈ టిప్స్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ ఈజీగా చేయొచ్చు

    ఆన్‌లైన్ లావాదేవీల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీతో లావాదేవీలు పెరిగిపోతే అందుకు తగ్గట్టుగా సైబర్ నేరాలు, మోసాలు కూడా పెరుగుతున్నాయి. గత ఏడాదిలోనే 2.7 కోట్ల మంది టార్గెట్ అయ్యారని అంచనా. వీరిలో అనేక మంది ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోయారు. బ్యాంకు లావాదేవీలు జరిపేవారి అకౌంట్ వివరాలు తెలుసుకొని నేరగాళ్లు మోసం చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల్లో డబ్బులు వెనక్కి పొందడం దాదాపు అసాధ్యమే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ డబ్బు వెనక్కి పొందొచ్చు. ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇతరలకు తెలిసినట్టు అనుమానం వచ్చినా, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లాంటివి పోగొట్టుకున్నా వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి.

    Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత పొదుపు చేయాలో తెలుసా?

    బ్యాంకులు మాత్రమే కాదు పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని పొందుతున్నా మీ అకౌంట్ వివరాలు లీక్ అయినట్టైతే సమాచారం ఇవ్వాలి. వాటిని బ్లాక్ చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటాయి. మీ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరగకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పోయినట్టు బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా మీ అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగినట్టైతే మీకు సంబంధం లేదు. మీ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ఎంత డబ్బు వాడుకున్నా బ్యాంకులు మీకు తిరిగి ఇవ్వాల్సిందే. అయితే మీరు సరైన సమయంలో బ్యాంకుకు సమాచారం ఇస్తేనే ఇది వర్తిస్తుంది.

    Credit Report: మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఎందుకో ఇలా తెలుసుకోండి

    చాలావరకు బ్యాంకులు తమ కస్టమర్లకు ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇన్స్యూరెన్స్ అందిస్తున్నాయి. ఇందుకోసం కొంత ఛార్జీలను తీసుకుంటాయి. అయితే కస్టమర్లు సకాలంలో బ్యాంకును అప్రమత్తం చేయడం అవసరం. మీరు బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత జరిగే లావాదేవీలకు మీకెలాంటి సంబంధం లేదు. మీరు సమాచారం ఇచ్చిన తర్వాత అకౌంట్ నుంచి లావాదేవీలు జరిగితే బ్యాంకు మీకు 10 రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ లావాదేవీలు జరిగిన మూడు రోజులకు సమాచారం ఇచ్చినట్టైతే మీరు గరిష్టంగా రూ.25,000 వరకే డబ్బు వెనక్కి పొందొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: