Card Lost: మీ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు పోయిందా? ఇలా చేయండి

Card Lost | ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ కార్డు బ్లాక్ చేయడం సులువే. లేదంటే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కార్డు బ్లాక్ చేయించొచ్చు. మీ కార్డు బ్లాక్ అవగానే వెంటనే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది.

news18-telugu
Updated: October 11, 2019, 11:58 AM IST
Card Lost: మీ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు పోయిందా? ఇలా చేయండి
Card Lost: మీ క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు పోయిందా? ఇలా చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 11, 2019, 11:58 AM IST
మీ ఏటీఎం కార్డు పోయిందా? మీ క్రెడిట్ కార్డును ఎక్కడైనా పారేసుకున్నారా? కార్డు సంగతి తర్వాత చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే. మీ అకౌంట్‌ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డు పోతే చాలామంది పెద్ద పట్టించుకోరు. తర్వాత బ్యాంకుకు వెళ్లి తీసుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉంటారు. అలా నిర్లక్ష్యంగా ఉండటమే చివరకు కొంపముంచుతుంది. అందుకే కార్డు పోగొట్టుకున్న వెంటనే అప్రమత్తం కావడం మంచిది. ఎక్కువగా ప్రయాణంలో ఉన్నప్పుడే హడావుడిలో కార్డులు పారేసుకోవడం చాలామందికి అనుభవమే. లేదా జర్నీలో దొంగలు చేతివాటం చూపించి కార్డులు కొట్టేసే సందర్భాలూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎంత అలర్ట్‌గా ఉంటే అంత మంచిది. మరి మీరు ఎప్పుడైనా కార్డు పోగొట్టుకుంటే వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి.

కార్డు బ్లాక్ చేయండి: మీ కార్డు పోయిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని కార్డు బ్లాక్ చేయడం. మీ ఫోన్‌లో యాప్ ఉంటే వెంటనే ఓపెన్ చేసి కార్డు బ్లాక్ చేయొచ్చు. లేదా బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పి కార్డ్ బ్లాక్ చేయమని కోరొచ్చు. కస్టమర్ కేర్ నెంబర్లను గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు. బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి. ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీ కార్డు బ్లాక్ చేయడం సులువే. లేదంటే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కార్డు బ్లాక్ చేయించొచ్చు. మీ కార్డు బ్లాక్ అవగానే వెంటనే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఒక్కసారి మీరు కార్డు బ్లాక్ చేయించారంటే ఆ తర్వాత మీ కార్డుపై ఏ లావాదేవీలు జరిగినా మీకు సంబంధం లేదన్న విషయం గుర్తుంచుకోండి. మ

పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్: మీరు చేయాల్సిన రెండో పని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-FIR రిజిస్టర్ చేయించడం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కార్డుపై ఎలాంటి లావాదేవీలు జరిగినా మీకు సంబంధం ఉండదు. ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే డూప్లికేట్ కార్డ్‌కు దరఖాస్తు చేయడం కూడా సులువవుతుంది.

స్టేట్‌మెంట్స్ చెక్ చేయండి: కార్డు బ్లాక్ చేయించి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడంతోనే మీ పని పూర్తవదు. మీ కార్డ్ స్టేట్‌మెంట్స్, క్రెడిట్ రిపోర్ట్స్ చెక్ చేయాలి. ఇలా కొన్ని నెలలు తప్పకుండా చేయాలి. మీకు తెలియకుండా ఏవైనా లావాదేవీలు జరిగినట్టు కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. కంప్లైంట్ చేయాలి.



క్రెడిట్ రిపోర్ట్: మీ క్రెడిట్ రిపోర్ట్ తెప్పించుకోండి. సిబిల్, ఎక్స్‌పీరియన్ లాంటి సంస్థలు క్రెడిట్ స్కోర్స్ ఇస్తుంటాయి. ఉచితంగానే వీటి రిపోర్ట్ పొందొచ్చు. క్రెడిట్ కార్డు పోయిన వెంటనే రిపోర్ట్ కోసం దరఖాస్తు చేయొద్దు. మీ వివరాలు అప్‌డేట్ కావడానికి కొంత సమయం పడుతుంది.

కొత్త కార్డులకు దరఖాస్తు: పోయిన కార్డులు బ్లాక్ చేయించిన తర్వాత కొత్త కార్డులకు దరఖాస్తు చేయాలి. అవసరం ఉన్న కార్డులు మాత్రమే తీసుకోండి. దానివల్ల రీఇష్యూ ఛార్జీలు, వార్షిక ఫీజులు ఆదా చేయొచ్చు.

కార్డుల రికార్డ్ మెయింటైన్ చేయడం: మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు, ఎన్ని డెబిట్ కార్డులు ఉన్నాయో రికార్డ్ మెయింటైన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, కార్డులు, ఎక్స్‌పైరీ డేట్స్, కాల్ సెంటర్ల నెంబర్లన్నీ ఓ డైరీలో నోట్ చేసుకోవాలి.
Loading...
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Pension Scheme: కేంద్రం నుంచి రూ.3,000 పెన్షన్... అర్హతలు ఇవే

Credit Card Limit: క్రెడిట్ కార్డు ఉందా? లిమిట్ ఎప్పుడు పెంచుకోవాలో తెలుసా?

Aadhar Reprint: ఆధార్ కార్డు పోయిందా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...