అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారి డాలర్ల అమ్మకం..

అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారి డాలర్ల అమ్మకం..శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల నిల్వలను టీటీడీ బోర్డు అమ్మకానికి ఉంచింది. ఆసక్తి ఉన్న భక్తులు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది.

news18-telugu
Updated: May 6, 2019, 12:23 PM IST
అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారి డాలర్ల అమ్మకం..
తిరుమల తిరుపతి దేవస్థానం
news18-telugu
Updated: May 6, 2019, 12:23 PM IST
అక్షయ తృతీయ రానే వచ్చింది. ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం ఓ ఆనవాయితీ.. పసిడి, వెండి కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మరింత సంపద వచ్చి చేరుతుందని భారతీయుల సెంటిమెంట్. ఈ సందర్భంగా.. శ్రీవారి డాలర్లను విక్రయించేందకు టీటీడీ బోర్డు ఏర్పాట్లు చేసింది. అక్షయతృతీయ అయిన మంగళవారం రోజున శ్రీవారి డాలర్లు అమ్మకం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల నిల్వలను టీటీడీ అమ్మకానికి ఉంచింది.

ఇప్పటికే శ్రీవారి డాలర్లను అమ్మాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. అందుకోసం ఈ నెల ఏడో తేదీ వరకు కొన్ని ధరలను ఖరారు చేసింది..  ఆ ధరలు మీకోసం..

డాలర్ల రకం రూ.లలో..బంగారం 10 గ్రాములు రూ.32,78బంగారం 5 గ్రాములు రూ.16,311బంగారం 2 గ్రాములు రూ.6,754వెండి 10 గ్రాములు రూ.593వెండి 5 గ్రాములు రూ.320రాగి 10గ్రాములు రూ.26రాగి 5 గ్రాములు రూ.20

అక్షయతృతీయ సందర్భంగా అందిస్తున్న ఈ అద్భుత అవకాశాన్నిభక్తులు సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...