Home /News /business /

LOOKING TO APPLY FOR SBI CAR LOAN CHECK ELIGIBILITY OTHER DETAILS HERE NS GH

SBI Car Loan ఎలా పొందాలో తెలుసా..? రుణం పొందడానికి ఈ అర్హత ఉండాలి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించే రుణాలను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ నూతన ప్యాసింజర్ కార్లు, మల్టీ యుటిలిటీ వెహికల్స్(MPV), స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SUV)ను కొనుగోలు చేయడానికి ఈ రకమైన రుణాన్ని ఉపయోగించవచ్చు.

ఇంకా చదవండి ...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి చెల్లించే రుణాలను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ నూతన ప్యాసింజర్ కార్లు, మల్టీ యుటిలిటీ వెహికల్స్(MPV), స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SUV)ను కొనుగోలు చేయడానికి ఈ రకమైన రుణాన్ని ఉపయోగించవచ్చు. ఫైనాన్సింగ్ అనేది ఆన్ రోడ్ ధరపై జరుగుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్, పొడిగించిన వారంటీ, టోటల్ సర్వీస్ ప్యాకేజీ, వార్షిక నిర్వహణ, కాంట్రాక్ట్ ఉపకరణాల ఖర్చు ఉన్నాయి. దీనికి ముందుస్తు EMI అవసరం లేదు. SBI కారు రుణం పొందడానికి వ్యక్తులు కనీసం 21 నుంచి 67 సంవత్సరాల గరిష్ఠ వయసును కలిగి ఉండాలి అంతేకాకుండా ఈ కింది మూడు వర్గాల్లో ఒకదానికి చెందినవారై ఉండాలి.

మొదటి విభాగం..
కేంద్ర ప్రభుత్వ ఎంటర్ ప్రైజెస్(మహరత్నా, నవరత్న, మినిరత్న) ఉద్యోగులు, డిఫెన్స్ సాలరీ ప్యాకేజీ, పారామిలిటరీ సాలరీ ప్యాకేజీ, ఇండియన్ కోస్టల్ గార్డ్ ప్యాకేజీ చెందిన కస్టమర్లు, వివిధ రక్షణ సంస్థల షార్ట్ కమిషన్ అధికారులై ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తుదారుడి నికర వార్షిక ఆదాయం రూ.3 లక్షల ఉండాలి. గరిష్ఠ లోన్ మొత్తం వచ్చేసి నికర ఆదాయానికి 48 రెట్లు ఉంటుంది.
రెండో విభాగం..
నిపుణులు, స్వయం ఉపాది, వ్యాపారవేత్తలు, యాజమాన్య లేదా భాగస్వామ్యసంస్థలు ఆదాయపు పన్ను చెల్లించే తదితరులు ఈ కేటగిరీలో ఉన్నారు. నికర లాభం లేదా స్థూల పన్ను పరిధిలోకి రూ.3లక్షలు ఉండాలి. లోన్ అమౌంట్ వచ్చేసి ఆదాయపు పన్ను రిటర్నుల ప్రకారం 4 రెట్లు నికర లాభం లేదా స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తిరిగి ఉన్న తరుగుదల అన్ని రుణాలను తిరిగి చెల్లించిన తర్వాత అర్హులవుతారు.
మూడో విభాగం..
వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తులు, వ్యవసాయదారులో విషయంలో ఆదాయపు పన్ను రిటర్నులు అవసరం లేదు. దరఖాస్తుదారు లేదా నికర దరఖాస్తుదారుడు నికర వార్షిక ఆదాయం కనీసం 4 లక్షలు ఉండాలి. రుణం మొత్తం వచ్చేసి నికర వార్షిక ఆదాయంలో 3 రెట్లు అధికంగా ఉంటుంది.





ఉద్యోగులు SBI రుణం కోసం తగిన పత్రాలను సమర్పించాలి..
-గత ఆరు నెలలుగా బ్యాంకు ఖతాలు స్టేట్మెంట్ ను ప్రకటించాలి, 2 పాస్ పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు ధృవీకరణ
-అడ్రెస్ ప్రూఫ్
-ఇన్ కమ్ ప్రూఫ్
-లేటెస్ట్ సాలరీ పత్రాలు,  ఫామ్ 16
-ఐటీ రిటర్నులు లేదా రెండేళ్ల కోసం ఫామ్ 16
-గుర్తింపు, ధ్రువీకరణ కోసం పాస్ పోర్టు లేదా పాన్,
వోటర్ల ఐడీ కార్డు, లైసెన్స్ తదితర పత్రాలు ఉండాలి.
-అడ్రెస్ ప్రూఫ్.. కోసం రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్స్ ఐడీ, పాస్ పోర్ట్, టెలిఫోన్ బిల్, విద్యుత్ బిల్లు, లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలో ఏదైనా సమర్పించాలి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank loans, CAR, Car loans, Sbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు