• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • LOOK AT THESE FOUR GOVERNMENT SCHEMES TO EASY TO GET LOAN TO START ANY BUSINESS FULL DETAILS HERE HSN GH

Small Business: బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? ఈజీగా లోన్ లభించే నాలుగు ప్రభుత్వ స్కీములను ఓ లుక్కేయండి..!

ప్రతీకాత్మక చిత్రం

రుణాలకు దరఖాస్తు చేసుకునే వారికి సరైన శిక్షణ, కొన్ని అర్హత ప్రమాణాలను చేర్చింది. ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో స్టార్టప్​ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిపై ఓలుక్కేద్దాం.

  • Share this:
కరోనా విజృంభించిన తర్వాత, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడంతో సొంత బిజినెస్ ల​ వైపు అడుగులు వేస్తున్నారు. అంతేకాక, నేటి తరం యువత ఆలోచనల్లో కూడా మార్పు కన్పిస్తోంది. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే, కష్టమైనా సరే తామే సొంతంగా బిజినెస్​ చేయాలని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. వీరికి తోడుగా ప్రభుత్వం కూడా లోన్లు అందిస్తోంది. మేకిన్​ ఇండియా, స్టార్టప్​ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున యువతకు రుణాలు అందిస్తుంది. మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) సంస్థలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, ఇవి అభివృద్ధికి కీలకంగా పనిచేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానత, సామాజిక అసమానత వంటి ప్రధాన ఆర్థిక సమస్యలకు ఎంఎస్‌ఎంఈ పరిష్కారం చూపగలదని భావిస్తోంది.

అయితే, రుణాలకు దరఖాస్తు చేసుకునే వారికి సరైన శిక్షణ, కొన్ని అర్హత ప్రమాణాలను చేర్చింది. ప్రభుత్వం అందించే వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతేకాక, బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది కాబట్టి, మీ క్రెడిట్ స్కోరు కనీసం 650 ఉండేలా చూసుకోండి. ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో స్టార్టప్​ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిపై ఓలుక్కేద్దాం.

రుణం పొందటానికి కావాల్సిన డాక్యుమెంట్స్
మీరు ప్రభుత్వ పథకాల కింద లోన్​ కోసం దరఖాస్తు చేసే క్రమంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్​ అందజేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి మీ బిజినెస్ ప్లాన్ బ్లూప్రింట్, జిఎస్టి గుర్తింపు సంఖ్య వివరాలు, గత 3 నుండి 5 ఏళ్లుగా చెల్లించిన ఆదాయపు పన్ను, వయస్సు, చిరునామా గుర్తింపు, ఆదాయ రుజువు, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, గత 2 ఏళ్ల ఆదాయపు పన్ను రిటర్న్, E-KYC కోసం దరఖాస్తు చేయడానికి కావాల్సిన ఇతర డాక్యుమెంట్స్​, లోన్​ టైప్​, కంపెనీ డైరెక్టర్లు, పార్ట్​నర్ల వివరాలు, పాస్​పోర్ట్​ ఫోటోలు వంటివి అవసరం అవుతాయి. ఆయా డాక్సుమెంట్స్​ను సిద్ధం చేసుకొని, లోన్​ కోసం సంబంధిత బ్యాంకును సంప్రదించండి.
ఇది కూడా చదవండి: రాజీవ్‌తో ప్రేమ పెళ్లికి ఒకే ఒక్క కండీషన్ పెట్టిన దేవదాస్ కనకాల.. నేరుగా సుమ ఫోన్ చేసి చెప్తే..

స్మాల్​ బిజినెస్​ కోసం ఉత్తమ గవర్నమెంట్ లోన్​ స్కీమ్స్​

ఎంఎస్‌ఎంఈ లోన్
భారత ప్రభుత్వం చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎస్​ఎంఈ లోన్​ స్కీమ్​ను ప్రవేశపెట్టింది. అంతేకాక, ఈ లోన్​ వేగంగా ప్రాసెస్​ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. దరఖాస్తు చేసిన కేవలం 59 నిమిషాల్లోనే మీ లోన్​ ప్రాసెస్​ పూర్తవుతుంది. ఎమ్ఎస్ఎంఈ స్కీమ్​ కింద రూ .10 పది లక్షల నుండి 5 కోట్ల రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. దీనికి వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీ లోన్​ ఆమోదించబడితే 7 నుండి 8 రోజుల్లో మీ ఖాతాలోకి రుణం జమచేయబడుతుంది. మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం, క్రెడిట్​ ఫెసిలిటీలను పరిశీలించి మీకు ఎంత మేర లోన్​ ఇవ్వాలనే విషయాన్ని ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి.

ముద్రా లోన్
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీపీఎంవై)ను ప్రారంభించింది భారత ప్రభుత్వం. ప్రజలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బి), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బి), సహకార బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్‌ఐ), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి వ్యవసాయేతర కార్యకలాపాల కోసం ఈ రుణాలను పొందవచ్చు. ముద్రా అనేది మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ & రిఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ (ఎంఎఫ్​ఐ)కి సంక్షిప్త రూపం. ముద్రా పథకం కింద మహిళలకు అనేక అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా, ఎంఎఫ్‌ఐలు/ ఎన్‌బిఎఫ్‌సిల నుండి రుణాలు పొందే మహిళలకు 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు లభిస్తుంది. ముద్రలోన్​లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో మొదటిది శిశు.. దీని కింద రూ .50 వేల వరకు రుణాలు మంజూరు చేస్తారు. కిషోర్ కింద రూ .50 వేల నుండి రూ .5 లక్షల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ కింద రూ .5 నుంచి రూ .10 లక్షల మధ్య రుణం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్

స్మైల్​ స్కీమ్​
చిరు వ్యాపారులన ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం SMILE (SIDBI మేక్ ఇన్ ఇండియా సాఫ్ట్ లోన్ ఫండ్ ఫర్ MSMEs) పథకాన్ని ప్రవేశపెట్టింది. తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చెందాలనుకునే చిన్న వ్యాపారాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వ రుణ పథకాన్ని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బిఐ) 2015లో ప్రారంభించింది. కొత్త చిన్న వ్యాపారాలకు ప్రోత్సహించి, వారికి ఆర్థిక చేయూతనివ్వడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. SMILE ప్రోగ్రామ్ కింద కనీసం రూ. 25 లక్షల రుణం మంజూరు చేస్తారు. ఈ రుణానికి పది సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే కాలం కూడా ఉంటుంది. భారత ప్రభుత్వం చేపట్టిన "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన 25 రంగాల్లోని ఎంఎస్‌ఎంఈలకు తక్కువ వడ్డీ రేటుతోనే రుణాన్ని అందజేస్తాయి. ఈ పథకం కింద రుణాలు సాఫ్ట్ లోన్స్, టర్మ్ లోన్స్ రూపంలో లభిస్తాయి. కొత్త సంస్థను ప్రారంభించాలని చూస్తున్న షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)/ షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) / మహిళా పారిశ్రామికవేత్తలకు నిధుల సమకూర్చడంలో భాగంగా దీన్ని రూపొందించారు. ఈ పథకం కింద ఒక మహిళ, ఎస్సీ/ఎస్టీ రుణగ్రహీతకు కనీసం రూ. 10 లక్షలు, గరిష్టంగా రూ. 1 కోటి వరకు రుణం అందజేస్తారు. యంత్రాలు, సౌకర్యాలు వంటి వాటి కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయాలలో 75% లోన్​ కింద అందిస్తారు.

క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (సిజిఎస్)
ఎంఎస్‌ఎంఈ పరిశ్రమకు సరసమైన రుణాలు అందించడానికి, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సిజిటిఎంఎస్‌ఈ) కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌ను రూపొందించింది. దీని కింద చిన్న వ్యాపారులు గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు రుణం పొందవచ్చు. దీనికి ఎటువంటి ఆస్తి హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది వరకే స్థాపించబడిన చిన్న తరహా కంపెనీల అభివృద్ధి కోసం, కొత్త కంపెనీల స్థాపన కోసం ఈ లోన్​ తీసుకోవచ్చు. మీ వ్యాపారానికి అవసరమయ్యే మొత్తం అమౌంట్​లో గరిష్టంగా 85% వరకు లోన్​ మంజూరు చేస్తారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..
First published: