Maruti Car: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారా...అయితే టాప్ 5 బడ్జెట్ కార్లు ఇవే....

పండుగ సీజ‌న్ స‌మీపిస్తున్నందున కార్ల అమ్మ‌కాల‌ను పెంచుకోవ‌డానికి వీటిపై ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో బీఎస్‌-6 పెట్రోల్‌ కార్ల‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చేవి చూద్దాం.

news18-telugu
Updated: September 21, 2020, 11:35 PM IST
Maruti Car: ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారా...అయితే టాప్ 5 బడ్జెట్ కార్లు ఇవే....
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టి నుంచి భార‌త్‌లో బీఎస్‌-6 వాహ‌నాల‌నే అమ్మాల‌ని సుప్రీంకోర్టు చెప్పిన నేప‌థ్యంలో దేశంలోని కార్ల కంపెనీలు వీటి త‌యారీపై దృష్టి పెట్టాయి. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించ‌డంతో పాటు మైలేజీ ఎక్కువ ఇచ్చేలా వీటిని రూపొందించారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే కార్ల అమ్మ‌కాల్లో వృద్ధి న‌మోద‌వుతోంది. పండుగ సీజ‌న్ స‌మీపిస్తున్నందున అమ్మ‌కాల‌ను పెంచుకోవ‌డానికి వీటిపై ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో బీఎస్‌-6 పెట్రోల్‌ కార్ల‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చేవి చూద్దాం.

మారుతి సుజుకి డిజైర్

బీఎస్‌-6 మోడ‌ల్‌లో మారుతి సుజుకి అప్‌డేటెడ్ డిజైర్ కారును విడుద‌ల చేసింది. ఇది ఇంత‌కుముందు మోడ‌ల్‌కంటే కనీసం 7 హెచ్‌పీ శక్తివంతమైనది. దీనికి‌ 1.2-లీటర్ల‌ పెట్రోల్ ఇంజన్ను అమ‌ర్చారు. ఇది 83 హెచ్‌పీ శ‌క్తిని, 113 ఎన్ఎమ్ టార్క్ను అందిస్తుంది. ARAI రేటింగ్ ప్ర‌కారం డిజైర్ మాన్యువల్ వేరియంట్ 23.26 కిలోమీట్ల వ‌ర‌కు మైలేజీని అందిస్తుంద‌ని సంస్థ ప్ర‌క‌టించింది. ఆటోమేటిక్ వేరియంట్ 24.12 కి.మీ. మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.5.89-8.81 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ).

టయోటా గ్లాంజా
గ్లాంజా మైల్డ్-హైబ్రిడ్ బీఎస్‌-6 కారును టయోటా మార్కెట్లోకి విడుద‌ల చేసింది. 1.2-లీటర్ ఇంజిన్‌తో పాటు స్టార్టర్-జెనరేటర్‌, 12-వి లిథియం-అయాన్ బ్యాటరీ దీని సొంతం. ఇది లీట‌రుకు 23.87 కి.మీ. మైలేజీని అందిస్తుంది. 83 బీహెచ్‌పీ ఇంజిన్‌తో గ్లాంజా విడుద‌ల చేసిన ఇతర మోడళ్లు 21.01 కి.మీ. మైలేజీని అందిస్తాయ‌ని ట‌యోటా ప్ర‌క‌టించింది. మైల్డ్-హైబ్రిడ్ మోడల్ ధర రూ.7.22 లక్షలు (ఎక్స్-షోరూమ్).

రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ రెండు బీఎస్-6 కార్ల‌ను విడుద‌ల చేసింది. 74 ఎన్‌ఎమ్ టార్క్, 54 హెచ్‌పీ శ‌క్తిని అందించే 0.8-లీటర్ (800 సీసీ) పెట్రోల్ ఇంజన్ మోడ‌ల్ ఒక‌టి. రెండోది 91 ఎన్‌ఎమ్ టార్క్తో 68 హెచ్‌పీ శ‌క్తిని ఇచ్చే 1.0-లీటర్ బీఎస్‌-6 ఇంజన్ వేరియంట్. 800 సీసీ క్విడ్ కారు ఒక‌ లీటరుకు 22.5 కిమీ మైలేజ్ ఇస్తుండ‌గా, 1.0-లీటర్ క్విడ్ మైలేజ్ రేటింగ్ 21.7 కి.మీగా ఉంద‌ని రెనాల్ట్ ప్ర‌క‌టించింది. దీని ధర రూ.2.92-5.01 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.మారుతి సుజుకి ఆల్టో
మారుతి సుజుకి ఆల్టో 800 సీసీ బీఎస్-6 పెట్రోల్ కారు 22.05 కి.మీ. మైలేజీని అందిస్తుంద‌ని ARAI ధ్రువీకరించింది. తక్కువ ధరలో ల‌భించ‌డం, మెయింటెనెన్స్ ఖ‌ర్చు త‌క్కువ‌గా ఉండ‌టం వంటివి ఈ కారును మార్కెట్లో ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. వినియోగ‌దారుల‌కు ఈ మోడ‌ల్ కారు ఆకర్షణీయమైన ఎంపిక అని మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీని ధర రూ.2.95-3.90 లక్షలు.(ఎక్స్-షోరూమ్, దిల్లీ).

మారుతి సుజుకి వాగన్ ఆర్‌
BS-VI వాగన్ ఆర్‌ రెండు ఇంజన్ ఆప్షన్లతో ల‌భిస్తుంది. వీటిల్లో 1.0-లీటర్ ఇంజన్, 67 హెచ్‌పీ, 90 ఎన్ఎమ్ టార్క్ తో ఒక వేరియంట్‌, 1.2-లీటర్ ఇంజన్, 81 హెచ్‌పీ, 113 ఎన్ఎమ్ టార్క్ తో న‌డిచే రెండో వేరియంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్ 21.79 కి.మీ. మైలేజీని అందిస్తుంది. 1.2 లీట‌ర్ ఇంజ‌న్ 20.52 కి.మీ. మైలేజీ అందిస్తుంది. దిల్లీ ఎక్స్-షోరూమ్ ప్ర‌కారం.. వీటి ధరలు రూ.4.45 లక్షల నుంచి రూ.5.95 లక్షల వరకు ఉన్నాయి.
Published by: Krishna Adithya
First published: September 21, 2020, 11:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading