LONG WEEKENDS 2022 PLANNING VACATION OR FAMILY TOUR CHECK HERE FOR LIST OF LONG WEEKENDS IN 2022 SS
Long Weekends 2022: వచ్చే ఏడాది లాంగ్ వీకెండ్స్ లిస్ట్ ఇదే... టూర్లు ప్లాన్ చేసుకోండి ఇలా
Long Weekends 2022: వచ్చే ఏడాది లాంగ్ వీకెండ్స్ లిస్ట్ ఇదే... టూర్లు ప్లాన్ చేసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Long Weekends 2022 | వచ్చే ఏడాది టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? కుటుంబంతో కలిసి ఎక్కడికైనా లాంగ్ టూర్ (Family Tour) వెళ్లాలనుకుంటున్నారా? 2022 లో రాబోయే లాంగ్ వీకెండ్స్ జాబితా తెలుసుకోండి.
కొత్త సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ (Long Weekends 2022) చాలా వచ్చాయి. లాంగ్ వీకెండ్స్ అంటే సాధారణంగా ఉండే శనివారం, ఆదివారం సెలవుల్ని కలుపుతూ మరిన్ని సెలవులు రావడం. ప్రతీ ఏటా కొన్ని సార్లు ఇలాంటి వరుస సెలవులు వస్తుంటాయి. 2022 లో కూడా లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. సొంతూళ్లలో కొన్ని రోజులు గడపాలనుకునేవారికి, టూర్లకు (Tourism) వెళ్లాలనుకునేవారికి, హాలిడే ప్లాన్ చేసుకునేవారికి ఈ లాంగ్ వీకెండ్స్ ఉపయోగపడతాయి. ఇతర రోజుల్లో అయితే సెలవులు పెట్టాల్సి వస్తుంది. కానీ... లాంగ్ వీకెండ్స్‌లో సెలవులు కలిసే వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా లీవ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి 2022 లో వచ్చిన లాంగ్ వీకెండ్స్ లిస్ట్ తెలుసుకోండి.
January: జనవరిలో న్యూ ఇయర్ శనివారం వచ్చింది. ఆ తర్వాత ఆదివారం సెలవు కాబట్టి రెండురోజులు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 14 శుక్రవారం నాడు మకర సంక్రాంతి సెలవు. ఆ తర్వాత శని, ఆదివారాలు కూడా సెలవు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
March: మార్చి 1న మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు. ఫిబ్రవరి 28 సోమవారం సెలవు పెట్టుకుంటే అంతకన్నా ముందు శనివారం, ఆదివారం సెలవులు కలిసి వస్తాయి. ఇక మార్చి 17న గురువారం నాడు హోలీ పండుగ వచ్చింది. శుక్రవారం సెలవు పెట్టుకుంటే ఆ తర్వాత శనివారం, ఆదివారం సెలవుల ఉంటాయి.
April: ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు. ఆ తర్వాత శనివారం, ఆదివారం కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
May: మే 3 మంగళవారం నాడు రంజాన్ సందర్భంగా సెలవు. మే 2 సోమవారం సెలవు తీసుకుంటే అంతకన్నా ముందు శనివారం, ఆదివారం సెలవులతో మొత్తం నాలుగు రోజులు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
August: ఆగస్ట్ 8న సోమవారం నాడు మొహర్రం సందర్భంగా సెలవు. శనివారం, ఆదివారం సెలవులతో కలిపి మొహర్రం వచ్చింది. కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవుల్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కూడా సోమవారం వచ్చింది. అంతకన్నా ముందు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఆగస్ట్ 19 శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు. ఆ తర్వాత శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు ఉంటాయి.
October: అక్టోబర్ 24 సోమవారం దీపావళి సందర్భంగా సెలవు. కాబట్టి శనివారం నుంచి సోమవారం వరకు దీపావళి సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా టూర్లకు వెళ్లొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.