Home /News /business /

LONG TERM HEALTH INSURANCE ONE STOP SOLUTION TO REDUCE THE BURDEN OF YEARLY RENEWAL GH VB

Long-Term Health Insurance: దీర్ఘకాలిక ఆరోగ్య బీమాతో ఎన్నో ప్రయోజనాలు.. రెన్యువల్​ భారాన్ని తగ్గించుకునేందుకు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఇతర బీమా కవరేజీలు మీ పెట్టుబడి ప్రణాళికలు పట్టాలు తప్పకుండా కాపాడతాయి. అందుకే, మీ అవసరాలకు సరిపోయే ఒక మంచి ఆరోగ్య బీమా ప్లాన్‌ని ఎంచుకున్న తర్వాత, ఎంత వ్యవధిలో పాలసీ తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి.

కరోనా(Corona) మహమ్మారి ఆరోగ్య బీమా అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన వైద్య చికిత్స పొందడానికి ప్రైవేట్ ఆసుపత్రులను(Private Hospitals) సందర్శించడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో జీవిత కాలం చేసిన పొదుపు(Saving) మొత్తం ఒక్కసారి చికిత్సకే పెట్టాల్సి వస్తుంది. అందువల్ల చికిత్స ఖర్చులు తగ్గించుకోవడానికి, తగినంత ఆరోగ్య బీమా కవరేజి (Coverage) తీసుకోవడం అనేది ఒక అత్యవసరంగా మారింది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఇతర బీమా కవరేజీలు మీ పెట్టుబడి ప్రణాళికలు పట్టాలు తప్పకుండా కాపాడతాయి. అందుకే, మీ అవసరాలకు సరిపోయే ఒక మంచి ఆరోగ్య బీమా ప్లాన్‌ని ఎంచుకున్న తర్వాత, ఎంత వ్యవధిలో పాలసీ తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. 1 సంవత్సరం లేదా ఎక్కువ కాలం కవర్‌ని తీసుకోవాలా? లేదా? అనేది అని నిర్ణయించుకోవాలి.

IRCTC BoB Credit Card: బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డ్... బెనిఫిట్స్ ఇవే

స్వల్పకాలిక, దీర్ఘకాలిక పాలసీలకు బీమా ప్రయోజనాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఎక్కువ కాలం పాటు కవర్ చేయడం ద్వారా రెన్యువల్ సమయంలో అధిక ప్రీమియం చెల్లించకుండా డబ్బు ఆదా చేసుకోవచ్చు. “కస్టమర్లు ఆరోగ్య బీమా కోసం వార్షిక లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వ్యాలిడిటీ గల కవర్‌ను కొనుగోలు చేయాల్సిన అవకాశం ఉంది. దీర్ఘకాలిక పాలసీలు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. బీమా సంస్థ ఆ వ్యవధిలో ప్రీమియం రేట్లను పెంచినప్పటికీ, దీర్ఘకాలిక పాలసీల విషయంలో 3 సంవత్సరాల వరకు పాలసీ ప్రీమియంలో ఎటువంటి మార్పు ఉండదు.

ఉదాహరణకు, సంవత్సరం చివరిలో ప్రీమియం వాల్యూ 10 శాతం మేర పెరిగినప్పటికీ, మిగిలిన సంవత్సరాలకు సైతం పాత ప్రీమియం విధానం ప్రకారం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. దీంతో, ఈ సందర్భంలో 10 శాతం ప్రీమియం ఆదా అవుతుంది. మరో రెండు సంవత్సరాల పాటు కూడా అదే ధర కొనసాగుతుంది.” అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సీఈఓ మయాంక్ బత్వాల్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

IRCTC Govindam Tour: శ్రీవారి ప్రత్యేక దర్శనంతో తిరుమల టూర్... రూ.4,000 లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

లాంగ్​టర్మ్​ కవరేజీ ద్వారా ప్రీమియంపై ఎంత తగ్గింపు లభిస్తుంది?

“లాంగ్​ టర్మ్​ పాలసీదారులు 3- సంవత్సరాల పాలసీకి 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మొదటి సంవత్సరం చెల్లించవలసిన ప్రీమియంతో సహా మిగతా 2 సంవత్సరాల పాలసీకి 7.5 శాతం తగ్గింపును పొందేందుకు కూడా అర్హులు. ఇది వారి పొదుపును మరింత పెంచుతుంది. సుదీర్ఘ పాలసీ మొత్తం కుటుంబానికి ఎక్కువ కాలం పాటు రక్షణగా నిలుస్తుంది. అంతేకాదు, లాంగ్​ టర్మ్ పాలసీల ద్వారా పాలసీ వ్యవధి ఉన్నంత కాలం పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.” అని బత్వాల్ చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Health benifits, Health Insurance, Life Insurance

తదుపరి వార్తలు