హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Railways: LOL అంటే నవ్వటం కాదట.. ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే..

Indian Railways: LOL అంటే నవ్వటం కాదట.. ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

LOL అంటే నవ్వును వ్యక్తపరచడం. ఒక వ్యక్తి నవ్వుతున్నాడు అని చెప్పడానికి లేదా హాస్యాస్పద సన్నివేశానికి చిహ్నమే ఈ లాల్ అనే పదం. అయితే భారతీయ రైల్వేలో ఈ పదం అర్థం నవ్వడం కాదట. LOL అంటే ప్రాణ నష్టమని రైల్వే శాఖ చెబుతోంది. పశ్చిమ రైల్వే జోన్ చేసిన ట్వీటే దీనికి నిదర్శనం. అసలు పశ్చిమ రైల్వే ఏం ట్వీట్ చేసిందో చూడండి.

ఇంకా చదవండి ...

LOL అనే పదం ఇంటర్నెట్(Internet) లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్, ఈ మెయిల్(E Mail) లోనూ ఈ పదం వాడతారు. సోషల్ మీడియాలో(Social Media) తరచూ ఉపయోగించే LOL అంటే నవ్వును వ్యక్తపరచడం. ఒక వ్యక్తి నవ్వుతున్నాడు అని చెప్పడానికి లేదా హాస్యాస్పద సన్నివేశానికి చిహ్నమే ఈ లాల్ అనే పదం. అయితే భారతీయ రైల్వేలో ఈ పదం అర్థం నవ్వడం కాదట. LOL అంటే ప్రాణ నష్టమని రైల్వే శాఖ చెబుతోంది. పశ్చిమ రైల్వే జోన్(Railway Zone) చేసిన ట్వీటే దీనికి నిదర్శనం. అసలు పశ్చిమ రైల్వే ఏం ట్వీట్ చేసిందో చూడండి. రైల్వే ట్రాక్ లను దాటడం వల్ల కలిగే ప్రమాదం గురించి పశ్చిమ రైల్వే ట్వీట్ చేసింది. అయితే LOL అనే పదం ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ ప్రమాదం గురించి వివరించింది.

ఇమేజ్ లోని L అంటే లాస్, O అంటే ఆఫ్, L అంటే లైఫ్.. మొత్తంగా లాస్ ఆఫ్ లైఫ్ అని పశ్చిమ రైల్వే ట్వీట్ చేసింది. ‘మీ జీవితం ఎంతో విలువైనది... రైల్వే ట్రాక్ లను అతిక్రమించి మీ ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దు. ప్రయాణీకులందరూ ఈ విషయంపై జాగ్రత్త వహించాలి’ అని రైల్వే విభాగం చెబుతోంది. ఒక ప్లాట్ ఫారమ్ నుండి మరో ప్లాట్ ఫారమ్ కు వెళ్లడానికి సరైన మార్గాలను ఎంచుకోవాలని పశ్చిమ రైల్వే ప్రయాణికులకు విఙ్ఞప్తి చేసింది. #SafetyFirst #TravelSafely అని పశ్చిమ రైల్వే ట్వీట్ చేసింది. అయితే ఈ చిత్రంలో హెచ్చరిక కూడా రాసింది. రైల్వే ట్రాక్ లను దాటడం చట్ట విరుద్ధమని పేర్కొంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 147 ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు అని తెలిపింది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూర్ 2021 అక్టోబర్ లో రైలు ప్రమాదాలపై నివేదిక విడుదల చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 13,000 కంటే ఎక్కువ రైలు ప్రమాదాలు జరిగాయని తెల్చింది. ఈ ప్రమాదాల్లో 12,000 మంది ప్రయాణికులు చనిపోయినట్లు నివేదికలో పేర్కొంది. అయితే, ఎన్ సీఆర్ బి నివేదిక కూడా 13,018 ప్రమాదాలు జరిగాయని తెలిపింది. ఈ ప్రమాదాలు ఎక్కువగా రైలు నుండి పడిపోవడం లేదా ట్రాక్ దాటుతున్నప్పుడు జరిగిన ప్రమాదాలే అని నివేదికలో పేర్కొంది. దాదాపు 9,117 అంటే 70శాతం ప్రమాదాలు రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు జరిగినవేనని తెలిపింది.

పశ్చిమ రైల్వే జోన్‌లో ఎక్కువగా ఈ ప్రమాదాలు జరిగాయని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ సబర్బన్ విభాగంలోనే 2021లో 1,114 మంది చనిపోయారని తెలిపింది. కళ్యాణ్ - బద్లాపూర్ మధ్య 164 మంది, థానే జంక్షన్ వద్ద 133 మంది, సెంట్రల్ రైల్వేలోని కుర్లా వద్ద 107 మంది చనిపోయినట్లు లెక్కలతో సహా నివేదికలో వెల్లడించింది. జోన్‌లోని బోరివ్లీలో అత్యధికంగా నిబంధనలు అతిక్రమించడంతో మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది.

ఎప్పటికప్పుడు ప్రయాణికులను అలర్ట్ చేయడంలో భారతీయ రైల్వే ఒక అడుగు ముందే ఉంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో సందేశాలను అందిస్తూనే ఉంది. రైల్వే ట్రాక్ లను దాటొద్దని ప్రయాణికులను విఙ్ఞప్తి చేస్తూనే ... దాటితే ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరిస్తూనే ఉంది. రైళ్లు కనిపించే దానికంటే వేగంగా వస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. జీవితం ఒక విలువైన బహుమతి.. ట్రాక్ లను దాటుతూ ప్రమాదాలకు గురికావద్దని ప్రయాణికులను ట్విట్టర్ ద్వారా కోరింది.

First published:

Tags: Accident, Deads, Indian, Indian Railway

ఉత్తమ కథలు