Election Result 2019: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులు... సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000

Lok Sabha Election Result 2019 | లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే ఎన్డీఏ ఆధిక్యంలో ఉండటంతో ఓపెనింగ్‌లోనే స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.

news18-telugu
Updated: May 23, 2019, 10:41 AM IST
Election Result 2019: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులు... సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000
Election Result 2019: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులు... సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000
news18-telugu
Updated: May 23, 2019, 10:41 AM IST
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ వేళ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఆధిక్యం చూపడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ 40,000 మార్క్ దాటగా, నిఫ్టీ 12,000 మార్క్ దాటింది. స్టాక్ మార్కెట్లు ఈ మార్క్ దాటడం ఇదే మొదటిసారి. అది కూడా సెన్సెక్స్, నిఫ్టీ ఒకేరోజు ఈ ఫీట్ సాధించాయి. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే ఎన్డీఏ ఆధిక్యంలో ఉండటంతో ఓపెనింగ్‌లోనే స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. ఇప్పటివరకు సెన్సెక్స్ 893 పాయింట్లు లాభపడి, 40,005 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 267 పాయింట్లు లాభపడి 12,005 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు రూపాయి కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడింది. గురువారం 69.66 దగ్గర ముగిసిన రూపాయి ప్రస్తుతం 69.45 దగ్గర కొనసాగుతోంది.

నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి



ఇవి కూడా చదవండి:



Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

Redmi K20: షావోమీ నుంచి మరో ఫోన్... మే 28న రెడ్‌మీ కే20 రిలీజ్
First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...