Home /News /business /

LOK SABHA ELECTION RESULT 2019 SENSEX DOWN 298 POINTS AND NIFTY DOWN 55 POINTS ON COUNTING DAY SS

Stock Market: స్టాక్ మార్కెట్లకు షాక్... ఫలితాల రోజున నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Lok sabha election result 2019 | ఓ దశలో సెన్సెక్స్ 40,100 మార్క్‌ను, నిఫ్టీ 12,034 మార్క్‌ను తాకాయి. దీంతో మార్కెట్లు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అనుకున్నారు.

    లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం సంచలనంగా మారింది. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. తొలిరౌండ్ నుంచే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉండటంతో ఉదయం 9.15 గంటలకు స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. నిమిషాల్లోనే సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 మార్క్‌ను దాటి రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి. ఒకే రోజు ఈ రికార్డ్ సాధించడం మరో విశేషం. ఓ దశలో సెన్సెక్స్ 40,100 మార్క్‌ను, నిఫ్టీ 12,034 మార్క్‌ను తాకాయి. దీంతో మార్కెట్లు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అనుకున్నారు.

    స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయన్న ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మార్కెట్లు భారీగా లాభపడ్డాయని ఇన్వెస్టర్లు సంతోషంలో ఉండగానే... కొన్ని గంటల్లో సూచీలు పడిపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55.40 పాయింట్స్ పడిపోయి 11682.50 పాయింట్ల దగ్గర నిలవగా, సెన్సెక్స్ 298.82 పడిపోయి 38811 పాయింట్ల దగ్గర నిలిచింది. ఇంట్రాడే గెయిన్స్, మదుపరులు లాభాలు స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు పడిపోయాయని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. మొత్తంగా చూస్తే 1182 షేర్లు లాభపడగా, 1303 షేర్లు నష్టపోయాయి. 170 షేర్ల ధరల్లో మార్పులేదు.

    Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    SSC MTS Jobs: 10,000 పోస్టులు... ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు... మే 29 చివరి తేదీ

    LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

    Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 142 ఖాళీలు... వివరాలివే
    First published:

    Tags: Lok Sabha Elections 2019, Sensex, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు