• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LOCK YOUR AADHAAR NUMBER TO AVOID MISUSE OF AADHAAR CARD AND KNOW HOW TO UNLOCK SS

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Lock Aadhaar | మీ ఆధార్ కార్డు పోయిందా? మీ ఆధార్ కార్డును ఇతరులు వాడకుండా లాక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    ఆధార్ కార్డ్... ఐడీ ప్రూఫ్‌గా లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఎక్కువగా పనికొచ్చే డాక్యుమెంట్. అంతేకాదు... బ్యాంక్ అకౌంట్ దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక సేవల్ని పొందడానికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. అయితే ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్స్‌ని అందిస్తోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరైనా మీ ఆధార్ నెంబర్‌ను ఎక్కడైనా ఉపయోగించాలనుకుంటే అస్సలు సాధ్యం కాదు. మళ్లీ మీరు కొత్త ఆధార్ కార్డ్ తీసుకునే వరకు నెంబర్‌ను లాక్ చేసి, కొత్త ఆధార్ కార్డు వచ్చిన తర్వాత అన్‌లాక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఓ ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు. ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. అన్‌లాక్ అవుతుంది. అయితే మీ ఆధార్ నెంబర్‌కు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపితేనే ఆధార్ నెంబర్ లాక్ లేదా అన్‌లాక్ చేయడం సాధ్యమవుతుంది. మరి మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఆధార్ నెంబర్ లాక్ లేదా అన్‌లాక్ చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

    PAN Card: పాన్ కార్డ్‌లోని 10 డిజిట్స్‌కి అర్థం ఏంటో తెలుసా?

    Aadhaar Card Address Update: అడ్రస్ ప్రూఫ్ లేదా? అయినా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చండి ఇలా

    Lock Aadhaar Number: ఆధార్ నెంబర్ లాక్ చేయండి ఇలా


    ఆధార్ నెంబర్ లాక్ చేయడానికి ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో GETOTP అని టైప్ చేయాలి. స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు నెంబర్ 1234 అనుకుంటే మీరు GETOTP 1234 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మరో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం LOCKUID అని టైప్ చేయాలి. స్పేస్ ఇచ్చి మొదట ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు టైప్ చేయాలి. ఆ తర్వాత 6 అంకెల ఓటీపీ టైప్ చేయాలి. ఉదాహరణకు మీకు వచ్చిన ఓటీపీ 777777 అని ఉంటే GETOTP 1234 777777 అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు.

    PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

    mAadhaar App: ఎంఆధార్ యాప్ ఉందా? 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు ఇలా

    Unlock Aadhaar Number: ఆధార్ నెంబర్ అన్‌లాక్ చేయండి ఇలా


    ఆధార్ నెంబర్ అన్‌లాక్ చేయడానికి కూడా పైన చెప్పినట్టుగానే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా వర్చువల్ ఐడీ క్రియేట్ చేయాలి. ఇందుకోసం RVID అని టైప్ చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెల్ని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీరు వర్చువల్ ఐడీ వస్తుంది. ఆ తర్వాత GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత Unlocking UID అని టైప్ చేసి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెల్ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటీపీ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: