హోమ్ /వార్తలు /బిజినెస్ /

Instant Personal Loan: 10 నిమిషాల్లో లోన్.. అకౌంట్‌లోకి రూ.50,000, ఇలా అప్లై చేసుకోండి!

Instant Personal Loan: 10 నిమిషాల్లో లోన్.. అకౌంట్‌లోకి రూ.50,000, ఇలా అప్లై చేసుకోండి!

 Instant Personal Loan: 10 నిమిషాల్లో లోన్.. అకౌంట్‌లోకి రూ.50,000, ఇలా అప్లై చేసుకోండి!

Instant Personal Loan: 10 నిమిషాల్లో లోన్.. అకౌంట్‌లోకి రూ.50,000, ఇలా అప్లై చేసుకోండి!

Personal Loan | మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు సులభంగానే రుణం పొందొచ్చు. అర్హత కలిగిన వారికి త్వరితగతిన రుణాలు లభిస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Instant Loan | లోన్ పొందాలని భావిస్తున్నారా? అది కూడా ఇన్‌స్టంట్ లోన్ (Loan) కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. తక్షణ రుణం పొందే వెసులుబాటు ఒకటి అందుబాటులో ఉంది. లోన్ ట్యాప్ ఇటీవల కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. ఎల్‌టీ క్యాష్ పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను (App) ఆవిష్కరించింది. దీని ద్వారా సులభంగానే రుణం పొందొచ్చు.

ఎల్‌టీ క్యాష్ యాప్ ద్వారా రూ. 50 వేల వరకు రుణం పొందొచ్చు. లోన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. ఎలాంటి కాగితాలు (ఫిజికల్ డాక్యుమెంట్స్) సమర్పించాల్సిన పని లేదు. ఆన్‌లైన్ ప్రాసెస్‌లోనే లోన్ పొందొచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లోన్ ప్రాసెస్ అంతా కేవలం 10 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అర్హత ఉంటే లోన్ డబ్బులు అకౌంట్‌లోకి వస్తాయి. లేదంటే లేదు.

ఎస్‌బీఐ బంపరాఫర్లు.. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీలపై రూ.12 వేల డిస్కౌంట్!

లోన్ ట్యాప్ అనేది ఆర్‌బీఐ రిజిస్టర్డ్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ. అందువల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంతేకాకుండా ఎల్‌టీ క్యాష్ యాప్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మీద పని చేసే ఈ యాప్‌ అల్గరిథమ్స్ ద్వారా కస్టమర్ల ప్రొఫైల్స్‌ను త్వరితగతిన అనలైజ్ చేస్తుంది. అలాగే వారి అర్హతలకు తగినట్లుగా లోన్ ఆఫర్లను అందుబాటులో ఉంచుతుంది.

భారీ తగ్గింపు ఆఫర్లు.. కారు కొంటే ఏకంగా రూ.63,000 డిస్కౌంట్!

ఈ యాప్ ద్వారా వెంటనే రూ. 50 వేలు పొందొచ్చు. వడ్డీ రేటు వార్షికంగా 24 శాతంగా ఉంటుంది. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అయితే ఈ తరహా రుణాలు పొందాలని భావించే వారి నెలవారీ ఆదాయం రూ. 30 వేలు ఉండాలి. అలాగే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. 100 శాతం ఆన్‌లైన్ ప్రాసస్ ద్వారా లోన్ పొందొచ్చు. ఎల్‌టీ క్యాష్ యాప్‌లో ఆర్‌బీఐ లైసెన్స్డ్ ఎన్‌బీఎఫ్‌సీ అకౌంట్ అగ్రిగేటర్ ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం ఈ యాప్ సేవలు పుణే, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, రాయ్‌పూర్, ఛండీగర్, భోపాల్, అహ్మదాబాద్, కోయంబత్తూరు, జైపూర్, వడోదర, ఇండోర్, నాగ్‌పూర్, నాసిక్, లక్నో, భువనేశ్వర్, రాజ్‌కోట్, సూరత్, పాట్నా, మైసూర్, విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఎల్‌టీ క్యాష్ లేదంటే లోన్ ట్యాప్ యాప్ ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. పలు రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి.

First published:

Tags: Banks, Money, Personal Loan

ఉత్తమ కథలు