Loan Transfer: లోన్ ట్రాన్స్‌ఫర్స్‌కు ఆర్​బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ.. కీలక మార్పులను పరిశీలించండి

ప్రతీకాత్మక చిత్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా రుణ బదిలీలపై (Loan Transfer) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 24 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి)లకు ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది.

  • Share this:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా రుణ బదిలీలపై (Loan Transfer) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 24 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపింది. అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి)లకు ఈ కొత్త నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మాత్రం వీటి అమలును తప్పనిసరి చేయలేదు. దీనిపై ఆర్​బీఐ ట్వీట్ చేస్తూ “స్మాల్​ ఫైనాన్స్ బ్యాంకులతో సహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఆర్​బీఐ విధించిన రుణ బదిలీ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మాత్రం ఈ నిబంధనల నుంచి సడలింపు ఉంటుంది. ఆల్-ఇండియా టర్మ్ ఫైనాన్షియల్ ఇన్​స్టిట్యూషన్స్ పరిధిలోకి వచ్చే నాబార్డ్, ఎన్​హెచ్​బీ, ఎగ్జిమ్​ బ్యాంక్, సెడ్​బీ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో వీటిని అమలు చేయాల్సి ఉంటుంది”అని పేర్కొంది.

Aadhaar-Ration card linking: ఆధార్‌ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయాలా... ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే


వివిధ వర్గాల రుణాలకు కనీస హోల్డింగ్ వ్యవధిని కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఈ వ్యవధి తర్వాతే వారు తమ రుణ ఖాతాలను ఇతర బ్యాంకుకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త మార్గదర్శకాలను మూల్యాంకనం, డేటాను నిల్వ చేయడం, నిర్వహించడం, రిస్క్ మేనేజ్‌మెంట్, బోర్డ్ స్థాయి వ్యక్తుల పర్యవేక్షణ మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించినట్లు తెలిపింది. ఆర్‌బీఐ 'రుణ ఎక్స్‌పోజర్‌ల బదిలీ' ఆదేశాలపై 2020 జూన్‌లోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అప్పుడే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఆర్​బీఐ నిన్న ఫైనల్​ డ్రాఫ్ట్​ జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే


లోన్​ ట్రాన్స్​ఫర్​ అంటే ఏమిటి?
ఒక బ్యాంకులో హోమ్​లోన్​ తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఆ బ్యాంకులోని వడ్డీ రేటు, ఇతరత్రా విషయాలు నచ్చకపోవచ్చు. అలాంటి సమయంలో మనకు నచ్చిన బ్యాంకులకు హోమ్​లోన్​ను ట్రాన్స్​ఫర్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియనే లోన్ ట్రాన్స్​ఫర్​ అంటారు. ఇది ఒకరకంగా కొత్తగా లోన్​ తీసుకోవడం లాంటిదే. అంటే మీరు ఏ బ్యాంకులోకి అయితే లోన్​ ట్రాన్స్​ఫర్​ చేసుకుంటారో.. ఆ బ్యాంకు మీకు కొత్తగా లోన్​ ఇస్తుంది. కాకపోతే ఆ మొత్తాన్ని మీకు కాకుండా మీ ఎగ్జిస్టింగ్​ లోన్​ ఉన్న బ్యాంకుకు చెల్లిస్తుంది. అయితే, వడ్డీరేటు మాత్రం కొత్త బ్యాంకులో లోన్​ తీసుకున్నప్పుడు వర్తించే వడ్డీరేటే వర్తిస్తుంది.
Published by:Krishna Adithya
First published: