హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Svanidhi: ఈ స్కీమ్‌తో ఈజీగా రూ.50,000 రుణం.. అర్హతలు ఇవే!

PM Svanidhi: ఈ స్కీమ్‌తో ఈజీగా రూ.50,000 రుణం.. అర్హతలు ఇవే!

PM Svanidhi: ఈ స్కీమ్‌తో ఈజీగా రూ.50,000 రుణం.. అర్హతలు ఇవే!

PM Svanidhi: ఈ స్కీమ్‌తో ఈజీగా రూ.50,000 రుణం.. అర్హతలు ఇవే!

PM Svanidhi Yojana | మీరు లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే ఈ స్కీమ్ కింద సులభంగానే రుణం పొందొచ్చు. గరిష్టంగా రూ. 50 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. అర్హతుల ఏంటివో ఒకసారి తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

PM Svanidhi Scheme | ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా? బంధువులు లేదంటే స్నేహితుల నుంచి ఆర్థిక సాయం లభించలేదా? అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన స్కీమ్ (Scheme) అందిస్తోంది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారు రూ. 50 వేల వరకు రుణం (Loan) పొందొచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఎలా రూ. 50 వేలు రుణం పొందాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి రూ. 50 వేల వరకు రుణం లభిస్తుంది. కేవలం స్ట్రీట్ వెండర్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే వీధి వ్యాపారులు ఈ పథకం కింద రూ. 50 వేల వరకు రుణం పొందొచ్చు. పీఎం స్వనిధి వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.10 వేల నుంచి లోన్ లభిస్తుంది. గరిష్టంగా రూ. 50 వేల వరకు పొందొచ్చు.

హైస్పీడ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ఒక్క రూపాయి కట్టకుండానే బుక్ చేసుకోండిలా!

వెండర్ సర్టిఫికెట్ కచ్చితంగా కావాలి. ఈ డాక్యుమెంట్ ఉన్న వారికే లోన్ లభిస్తుంది. అలాగే ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవ్వన్నీ కలిగిన వారు ఆన్‌లైన్‌లో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అన్ని అర్హతలు ఉంటే.. రుణం లభిస్తుంది. కాగా ఇప్పటికే ఈ స్కీమ్ కింద చాలా మంది లోన్ సదుపాయం పొందొచ్చు.

రూ.70 వేలలోపు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 7 బైక్స్ ఇవే!

దాదాపు 45 లక్షల మంది పీఎ: స్వనిధి స్కీమ్ కింద లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చిరు వ్యాపారులు అయితే వెంటనే ఈ స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీ అర్హత ప్రాతిపదికన మీ లోన అమౌంట్ నిర్ణయం అవుతుంది. సాధారణంగా తొలిసారి లోన్ తీసుకునే వారికి రూ. 10 వేల రుణం లభిస్తుంది. తర్వాత ఈ లోన్ అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సక్రమంగా చెల్లించే వారికి లోన్ అమౌంట్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. లేదంటే మాత్రం తర్వాతి లోన్ పొందటం కష్టంగా మారుతుంది.అందుకే మీరు స్వనిధి స్కీమ్ కింద లోన్ తీసుకుంటే.. కచ్చితంగా తిరిగి చెల్లించాలి. తర్వాత లోన్ అమౌంట్ పెరుగుతూ వస్తుంది. రూ .50 వేల వరకు లోన్ పొందొచ్చు.

First published:

Tags: Money, Pm modi, Schemes

ఉత్తమ కథలు