Home /News /business /

LOAN AVAILABLE FOR BULLET MOTORCYCLE IN JUST 3 MINUTES MK

Loan For Royal Enfield: బుల్లెట్ బండి కొంటున్నారా...3 నిమిషాల్లో L&T ఫైనాన్స్ ప్రత్యేక రుణం మీ కోసం..

 Royal Enfield (ప్రతీకాత్మకచిత్రం)

Royal Enfield (ప్రతీకాత్మకచిత్రం)

దేశంలోనే ప్రముఖ ఫైనాన్స్ సంస్థ L&T ఫైనాన్స్ ప్రత్యేకంగా రుణాలు అందిస్తోంది. L&T ఫైనాన్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌ల కోసం “వెల్‌కమ్ 2022” పేరిట ప్రత్యేకంగా లోన్‌ లను ప్రకటించింది.

    Loan For Royal Enfield:  బుల్లెట్ బండి నడపడం అనేది ప్రతీ ఒక్క బైక్ ప్రేమికుడి కల, ఎన్ని బైక్స్ నడిపినా బుల్లెట్ బండికి ఉండే క్రేజ్, ఫీలు వేరే అనే చెప్పాలి. మన ఇండియన్ రోడ్స్ మీద కింగ్ అనేది ఏదైనా ఉందంటే అంది బుల్లెట్టు బండి అనే చెప్పాలి. బుల్లెట్ బండి ధర కూడా ఆ రేంజులోనే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన ఈ తరహా క్లాసిక్ బైక్స్ ధర మిడిల్ క్లాస్ జీవులకు అందని ద్రాక్షే, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనుగోలు చేసేందుకు దేశంలోనే ప్రముఖ ఫైనాన్స్ సంస్థ L&T ఫైనాన్స్ ప్రత్యేకంగా రుణాలు అందిస్తోంది. L&T ఫైనాన్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌ల కోసం “వెల్‌కమ్ 2022” పేరిట ప్రత్యేకంగా లోన్‌ లను ప్రకటించింది. ఈ పథకం కింద మీ ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో (7.99% నుండి) 3 నిమిషాలలోపు అవాంతరాలు లేని, శీఘ్ర లోన్ లను అందిస్తుంది. మొత్తం ధరలో 90% వరకు ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది.

    EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... అకౌంట్‌లోకి వడ్డీ జమ చేసేది ఎప్పుడంటే

    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి గోవిందరాజన్ మాట్లాడుతూ, “మా విభిన్న కస్టమర్ సెగ్మెంట్‌ల అవసరాలను తీర్చేందుకు అనువైన, ఉపయోగించడానికి సులభమైన ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ఎల్‌అండ్‌టి ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను కస్టమర్లకు  మరింత చేరువ చేస్తుందని తెలిపింది.

    ఈ పథకాన్ని పొందేందుకు, కస్టమర్‌లు తమ సమీప రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ లేదా L&T ఫైనాన్స్ శాఖను సంప్రదించవచ్చు లేదా www.ltfs.comని సందర్శించవచ్చు. అనలిటిక్స్ ఆధారిత క్రెడిట్ డెసిషన్ మేకింగ్, డిజిటల్ ఆన్-బోర్డింగ్ , బెస్ట్-ఇన్ ఇండస్ట్రీ టర్న్‌అరౌండ్ టైమ్ (TAT) కంపెనీ టూ-వీలర్ ఫైనాన్స్ వ్యాపారంలో కీలకమైన ప్రత్యేక లక్షణాలు. టైర్ 1, టైర్ 2 , టైర్ 3 నగరాలు , పట్టణాల్లోని కస్టమర్‌లు తమకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను సులభంగా , అవాంతరాలు లేని పద్ధతిలో పొందడానికి ఈ అసోసియేషన్ సహాయం చేస్తుంది.

    PF Aadhaar Link: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేశారా? వెంటనే చేయండి ఇలా

    ఇక రాయల్ ఎన్ఫీల్డ్ పురాతన మోటార్ సైకిల్ బ్రాండ్. కంపెనీ ప్రీమియం లైనప్‌లో సరికొత్త క్లాసిక్ 350, మెటోర్ 350 క్రూయిజర్, ఇంటర్‌సెప్టర్ 650 , కాంటినెంటల్ GT 650 ట్విన్స్, హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ , ఐకానిక్ బుల్లెట్ 350 ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంచాలని ప్లాన్ చేసింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bikes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు