Loan against property: ఆస్తులను తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా..ఇది మీకోసం..

(ప్రతీకాత్మక చిత్రం)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వివిధ మార్గాల్లో కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీరుస్తున్నాయి. వీటిల్లో స్థిరాస్తిని తనఖా పెట్టుకొని ఇచ్చే ప్రాపర్టీ లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (LAP) ఒకటి. ఈ మార్గంలో స్థిరాస్తిపై యాజమాన్య హక్కును కోల్పోకుండా, వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఆర్థిక సంస్థల నుంచి నిధులను పొందవచ్చు.

  • Share this:
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వివిధ మార్గాల్లో కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీరుస్తున్నాయి. వీటిల్లో స్థిరాస్తిని తనఖా పెట్టుకొని ఇచ్చే ప్రాపర్టీ లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (LAP) ఒకటి. ఈ మార్గంలో స్థిరాస్తిపై యాజమాన్య హక్కును కోల్పోకుండా, వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఆర్థిక సంస్థల నుంచి నిధులను పొందవచ్చు. LAP ద్వారా సులభంగా, ఎక్కువ మొత్తంలో డబ్బు పొందవచ్చు. కానీ ఈ లోన్‌కు దరఖాస్తు చేసేవారు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. LAPల వడ్డీరేటు, లోన్ గడువు, ప్రాసెసింగ్ ఫీజు, LTV నిష్పత్తి.. వంటి విషయాలపై కస్టమర్లు అవగాహన పెంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

వడ్డీ రేటు ఎంత?
LAP వడ్డీరేటును కస్టమర్ల క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా లెక్కిస్తారు. రుణదాతలను బట్టి ఈ రేటు మారవచ్చు. సాధారణంగా LAPలపై వడ్డీ రేటు సంవత్సరానికి 8.15 శాతం నుంచి 13.2 శాతం వరకు ఉంటుంది. కస్టమర్లు నివసిస్తున్న సొంత ఇంటిపై కొన్ని సంస్థలు తక్కువ వడ్డీ, కమర్షియల్ ప్రాపర్టీలపై ఎక్కువ వడ్డీ విధించవచ్చు. కస్టమర్లు ఎంచుకున్న లోన్ మొత్తం, లోన్ తిరిగి చెల్లించే కాలపరిమితిని బట్టి కూడా వడ్డీరేట్లు మారవచ్చు.

లోన్ తిరిగి చెల్లించే కాలపరిమితి (రీ పేమెంట్ టెన్యూర్)
రుణదాతలు స్థిరాస్తిపై ఇచ్చే లోన్‌ రీపేమెంట్‌కు 15-20 సంవత్సరాల గడువును నిర్దేశిస్తారు. ఇది గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, టాప్ అప్ హోమ్ లోన్ వంటి ఇతర లోన్ ఆప్షన్ల కంటే చాలా ఎక్కువ. గోల్డ్ లోన్ రీపేమెంట్ టెన్యూర్ మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. పర్సనల్ లోన్‌కు 1-5 సంవత్సరాలు, టాప్ అప్ హోమ్ లోన్‌కు 15 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. తక్కువ కాలపరిమితి ఉంటే.. ఎక్కువ EMI చెల్లించాలి. కానీ వీటిపై తక్కువ వడ్డీ విధిస్తారు. ఎక్కువ టెన్యూర్ ఉండే లోన్‌లకు తక్కువ EMIలు ఉంటాయి. కానీ వీటిపై అధిక వడ్డీ వసూలు చేస్తారు. అందువల్ల ఆర్థిక లక్ష్యాలను బట్టి లోన్ రీపేమెంట్ టెన్యూర్‌ను కస్టమర్లు ఎంచుకోవాలి. వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి మిగులు నిధులు ఉన్నప్పుడు ఈ లోన్‌లను ముందస్తుగా రీపేమెంట్ చేయాలి.

లోన్ అమౌంట్
రుణదాతలు స్థిరాస్తుల మార్కెట్ విలువలో 50-70 శాతం వరకు LAPగా మంజూరు చేస్తారు. కస్టమర్ల రీపేమెంట్ సామర్థ్యం, ఆదాయం.. వంటి వాటిపై ఈ విలువ ఆధారపడి ఉంటుంది. ఆస్తి మార్కెట్ విలువను మదింపు చేసేటప్పుడు ఆస్తి ఉన్న ప్రదేశం, నిర్మాణం వయసు, మౌలిక సదుపాయాలు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. నిధుల ఖర్చుపై లోన్ ఇచ్చిన సంస్థలు ఎలాంటి పరిమితులు విధించవు. పిల్లల ఉన్నత చదువులు, వ్యాపార విస్తరణ, మెడికల్ ఖర్చులు, ఇతర ఆస్తుల కొనుగోలు.. వంటి అవసరాలకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.

ఎన్ని రోజుల్లో లోన్ ఇస్తారు?
తాకట్టు పెట్టిన ఆస్తి విలువను మదింపు చేసి, లోన్ ఇచ్చేందుకు మూడు వారాల వరకు సమయం పట్టవచ్చు. సంబంధిత ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రుణదాతలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అసలు యజమానిని గుర్తించి, ఆస్తి విలువను లెక్కిచడానికి చిన్నపాటి అధ్యయనం చేస్తారు. ఇందుకు కాస్త సమయం పడుతుంది. అందువల్ల లిక్విడ్ ఫండ్స్ కావాలనుకునే వారికి ఈ లోన్ సరైన ఎంపిక కాదు.

ప్రాసెసింగ్ ఫీజులు
చాలా సంస్థలు లోన్ ఇచ్చిన మొత్తంలో 1- 2 శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తాయి. సాధారణంగా LAPలో లోన్ అమౌంట్‌ పెద్ద మొత్తంగా ఉంటుంది. దీంట్లో ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం కస్టమర్లకు భారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల LAPకి దరఖాస్తు చేసేముందు తక్కువ ప్రాసెసింగ్ ఛార్జీలను వసూలు చేసే సంస్థల గురించి ఆరా తీయాలి. అతి తక్కువ ఫీజులు వసూలు చేసే రుణదాతను ఎంపిక చేసుకోవాలి.

గడువుకు ముందే లోన్ చెల్లిస్తే?
ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేటుతో మంజూరు చేసిన LAPలపై వడ్డీని గడువుకు ముందు చెల్లిస్తే.. దానిపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయకూడదని రిజర్వు బ్యాంకు తెలిపింది. కానీ ఫిక్స్‌డ్ ఇంట్రస్ట్ రేటుతో మంజూరు చేసిన LAPపై రుణదాతలు ఛార్జీలు విధించవచ్చు. అందువల్ల గడువుకు ముందే లోన్‌ను తిరిగి చెల్లించాలి అనుకునేవారు ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల ప్రీ పేమెంట్ ఛార్జీలు మిగులుతాయి.
Published by:Krishna Adithya
First published: