హోమ్ /వార్తలు /బిజినెస్ /

Electric Scooter: ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ బుక్ చేసుకోండిలా!

Electric Scooter: ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ బుక్ చేసుకోండిలా!

Electric Scooter: ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోండిలా!

Electric Scooter: ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోండిలా!

LML Star Scooter | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Electric Vehicles | మీరు కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) అయితే బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. తాజాగా ఎల్ఎంఎల్ (LML) స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కంపెనీ స్కూటర్ బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఎల్ఎంఎల్ స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లోకి బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఒక్క రూపాయి కట్టకుండానే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లోకి ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ నుంచి మార్కెట్‌లోకి రానున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం. ఈ స్కూటర్ స్పోర్ట్స్ లుక్‌లో ఉంది. ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌టీయర్ డిజైన్‌తో అదిరిపోతోందని చెప్పుకోవచ్చు.

ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త కారు!

డిస్‌ప్లే ప్యానెల్, స్టెప్డ్ సీట్స్, టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనో షాక్, డిస్క్ బ్రేక్స్ వంటి పలు ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒక్క రూపాయి కట్టకుండానే స్కూటర్‌ను రిజర్వు చేసుకోవచ్చని తెలిపింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అదిరిపోయే స్పీడ్, ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న కొత్త స్కూటర్ కస్టమర్ల మనుసు గెలుచుకుంటుందని ఎల్ఎంఎల్ ఎండీ, సీఈవో యోగేశ్ భాటియా పేర్కొన్నారు.

శుభవార్త.. పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మారాయ్.. ఇంకా అధిక పెన్షన్!

ఎల్ఎంఎల్ స్కూటర్ మార్కెట్‌లోకి వస్తే.. ఇది ఓలా ఎస్1 ఎయిర్‌ స్కూటర్‌, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ అనేది ఓలా ఎంట్రీ లెవెల్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత ఉంటుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దీని రేటు రూ.లక్ష నుంచి రూ. 1.10 లక్షల మధ్యలో ఉండొచ్చు. ఇకపోతే ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఓలా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాకుండా మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫైరింగ్ ఘటనలు కూడా ఇప్పుడు చోటుచేసుకోవడం లేదు. గతంలో అయితే చాలా స్కూటర్లు దీపావళి చిచ్చుబుడ్లు మాదిరి పేలిపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. కంపెనీలు బ్యాటరీలపై అధికంగా ఫోకస్ చేశాయి.  కాగా ఈ కొత్త స్కూటర్‌ను https://www.lmlemotion.com/star లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

First published:

Tags: Electric Scooter, Ev scooters, SCOOTER

ఉత్తమ కథలు