హోమ్ /వార్తలు /బిజినెస్ /

LML Star: ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి. వెళ్లొచ్చు.. అదిరే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!

LML Star: ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి. వెళ్లొచ్చు.. అదిరే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!

LML Star: ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి. వెళ్లొచ్చు.. అదిరే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!

LML Star: ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కి.మి. వెళ్లొచ్చు.. అదిరే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!

Electric Scooter | మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. అదిరే ఫీచర్లు ఈ ఇ-స్కూటర్ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ముందు భాగంలో స్టేటస్ పెట్టకోవచ్చు. అడ్జస్టబుల్ సీటు ఉంది. ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Electric Vehicles | ఆటో ఎక్స్‌పో 2023లో చాలా కంపెనీలు వాటి భవిష్యత్ వెహికల్స్‌ను ఆవిష్కరించాయి. స్కూటర్లు, కార్లు, బైక్స్, త్రివీలర్స్, బస్సులు ఇలా చాలా వాటిని ప్రదర్శించాయి. వీటిల్లో చాలా వెహికల్స్ (EV) భిన్నమైన డిజైన్‌తో సందర్శకులను కట్టి పడేస్తున్నాయి. ఇలాంటి వెహికల్స్‌తో ఎల్ఎంఎల్ స్టార్ కూడా ఒకటి. ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ (e-Scooter). ఇందులో డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. స్కూటర్ ముందు భాగంలో దీన్ని అమర్చారు. ఇందులో మెసేజ్, స్టేటస్ వంటివి సెట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా మీరు స్టేటస్ ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. మీకు నచ్చిన స్టేటస్ పెట్టుకోవచ్చు.

ఉదాహరణకు మీరు మీ పేరును స్టేటస్‌గా పెట్టుకోవాలని భావిస్తే.. మొబైల్ యాప్‌లోకి వెళ్లి మీ పేరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు టైప్ చేసిన తర్వాత సేవ్ చేస్తే.. మీరు ఏ పేరు అయితే యాప్‌లో టైప్ చేశారో.. ఆ పేరు మీ స్కూటర్ ముందు భాగంలో ఉన్న స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. దీంతో మీ స్కూటర్‌కు రిచ్ లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే స్కూటర్ ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్‌ లైట్స్, హెడ్ లైట్ వంటివి ఉన్నాయి.

రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీ‌ర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా ఈ ఎల్ఎంఎల్ స్టార్ రేంజ్ ఎక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ప్రస్తుతం ఏఆర్ఏఐ ఈ స్కూటర్ రేంజ్‌ను టెస్ట్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ వెహికల్ ప్రిబుకింగ్స్‌ను ప్రారంభించింది. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర వివరాలు పొందొచ్చు.

రూ.58 పొదుపుతో రూ.8 లక్షలు పొందండి.. ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్!

ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో సింగిల్ స్ప్రింగ్ షాక్ అబ్సార్బర్ ఉంటుంది. అలాగే డ్యూయెల్ వెర్టికల్ టెయిల్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇందులో 360 డిగ్రీ కెమెరా, హ్యాప్టిక్ ఫీడ్ బ్యాక్, అడ్జస్టబుల్ సీటు, ఆటో హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇకపోతే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటి అమ్మకాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ వంటి కంపెనీలు వాటి ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి.

First published:

Tags: Electric Scooter, Electric Vehicles, Ev scooters, SCOOTER