LML Comeback: ఇండియాలోకి ఎల్​ఎంఎల్​ రీఎంట్రీ.. త్వరలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌

LML Comeback: ఇండియాలోకి ఎల్​ఎంఎల్​ రీఎంట్రీ.. త్వరలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌

LML Electric Scooter | మూడు దశాబ్దాల క్రితం ఇండియాలో స్కూటర్ మార్కెట్‌లో హవా చూపించిన ఎల్ఎంఎల్ (LML) భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ (e-scooter) లాంఛ్ చేయనుంది.

  • Share this:
ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ ఎల్​ఎంఎల్ (LML) భారత ద్విచక్ర వాహన రంగంలోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.​ ఆధునిక ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలను  (Electric Vehicles) అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది. 1990 దశాబ్ధంలో ఆటోమేటిక్ స్కూటర్ల యుగంలో ఎల్​ఎంఎల్​ వాహనాలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే నష్టాలు రావడంతో 1999లో కంపెనీ తన కార్యకలాపాలు మూసేసింది. ఇప్పుడు తన ప్రత్యర్థి బజాజ్ సంస్థ చేతక్​ (Chetak Electric) ఎలక్ట్రిక్​ వాహనాల రంగంలోకి ప్రవేశించి విజయం కావడంతో.. ఎల్​ఎంఎల్​ కూడా తన హవా చాటేందుకు సిద్దమవుతోంది. భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి దూసుకెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే దీని ఉత్పత్తి ఇంకా ప్రారంభించలేదు.

Ola Electric Scooter: ఓలా ఇ-స్కూటర్ సేల్ మొదలైంది... బండి ఎలా ఉందంటే (Photos)

వీటిని ఎప్పుడు ఆవిష్కరించాలనే దానిపై ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు. ఈ విషయంపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ఓ భాగస్వామి భారీ పెట్టుబడులతో బ్రాండ్​ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతలో కూడిన వినూత్న ఉత్పత్తిని పరిచయం చేయడానికి అభివృద్ధి వ్యూహాలపై చురుకుగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివిధ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది.

IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి

గతంలో పియాజియోతో కలిసి వాహనాల ఉత్పత్తి


భారత్​లో రీఎంట్రీపై ఎల్​ఎంఎల్​ ఎలక్ట్రిక్​ ఎండీ, సీఈఓ యోగేష్​ భాటియా మాట్లాడుతూ ‘‘భారత్​లో రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. భారత ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​ను బలోపేతం చేయడానికి అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వాహనాల ఉత్పత్తిపై పనిచేస్తున్నాం. మా ఉత్పత్తుల ద్వారా ఈ–మార్కెట్​లో గణనీయమైన మార్పులు తేవాలని యోచిస్తున్నాం. మెట్రో సిటీలతో పాటు పట్టణాలపై కూడా దృష్టి పెడతాం. తద్వారా మా మార్కెట్​ను విస్తరిస్తాం” అని చెప్పారు.

LIC PAN Link: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే మీ పాన్ నెంబర్ లింక్ చేయండి

ఎల్​ఎంఎల్​ సంస్థ 1972 నుంచి ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​ కేంద్రంగా వాహనాల ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌ వాహనాలతో పాటు వాటి విడిభాగాలు, ఉపకరణాలను తయారు చేసింది. 1983లో ఇటలీకి చెందిన పియాజియో వెస్పాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పియాజియో సహకారంతో 100 సీసీ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 1999లో పియాజియోతో భాగస్వామ్యం తెగిపోయాక కంపెనీ పతనం ప్రారంభమైంది. 2006లో కంపెనీ పూర్తిగా కాన్పూర్​ ఫ్యాక్టరీని మూసేసింది.
Published by:Santhosh Kumar S
First published: