చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవోకు (LIC IPO) మార్గం సుగమం అయింది. మార్కెట్లో ఈ ఐపీవోకు చాలా డిమాండ్ కనిపిస్తోంది. ఏప్రిల్ 28న గ్రే మార్కెట్లో(Grey Market) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లపై ప్రీమియం 80 శాతం పెరిగింది.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవోకు (LIC IPO) మార్గం సుగమం అయింది. మార్కెట్లో(Market) ఈ ఐపీవోకు(IPO) చాలా డిమాండ్(Demand) కనిపిస్తోంది. ఏప్రిల్ 28న గ్రే మార్కెట్లో(Grey Market) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Life Insurance Corporation Of India) షేర్లపై ప్రీమియం(Premium) 80 శాతం పెరిగింది. మే 4న ప్రారంభం కానున్న ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్(LIC Public Offer) దేశంలోనే అతిపెద్దది. ప్రైస్ బ్యాండ్ హైయర్ ఎండ్ ధరపై రూ.45 ప్రీమియంను ఎల్ఐసీ షేర్లు చెల్లించే సూచనలు ఉన్నాయి. ఇదే ఏప్రిల్ 27న రూ.25గా ఉంది. గ్రే మార్కెట్ ధరలుగా పేర్కొనే IPOల అనధికారిక ధరలను ట్రాక్ చేసే IPOWatch ప్రకారం ఈ ప్రీమియం వివరాలు ఉన్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియం లాంచ్ తేదీకి దగ్గరగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
LIC IPO మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ రూ.902 నుంచి రూ.949గా నిర్ణయించారు. పాలసీదారులకు రూ.60 తగ్గింపు, ఉద్యోగులకు రూ.45 తగ్గింపు అందిస్తున్నారు. గ్రే మార్కెట్ ధర సాధారణంగా షేర్లు లిస్ట్ చేసే ధరను సూచిస్తుంది. ఏప్రిల్ 28న గ్రే మార్కెట్ ధర ఆధారంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ షేర్లు 5 శాతం లాభంతో జాబితా చేయవచ్చు. అయితే ఇది తర్వాత మారే అవకాశం కూడా ఉంది.
IPOలో కంపెనీలో 3.5 శాతం వాటాకు సమానమైన 221.3 మిలియన్ షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరిలో 310 మిలియన్ షేర్లను విక్రయించే ప్రారంభ ప్రణాళిక నుండి ఆఫర్ తగ్గింది. మార్కెట్ డిమాండ్, మార్కెట్ అస్థిరత, దేశీయ ప్రవాహాలు, కంపెనీ పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మే నెలలో ఎల్ఐసీ ఐపీవోని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రైస్ బ్యాండ్ ఎగువన గతంలో రూ.60,000 కోట్లతో పోలిస్తే రూ.21,000 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. LIC వాల్యుయేషన్ గతంలో రూ.17 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రూ.6 లక్షల కోట్లుగా అంచనా వేశారు. పెట్టుబడిదారులు కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేయాలి.. ఆ తర్వాత 15 మల్టిపుల్స్ కోసం అప్లై వేయవచ్చు. 15.8 మిలియన్ షేర్లు ఎల్ఐసీ ఉద్యోగులకు, 22.1 మిలియన్ షేర్లు ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేశారు.
ఇష్యూ పరిమాణంలో సగం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కోసం, 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కు కేటాయించారు. మే 12న షేర్లు అలాట్ చేస్తారు. అదే రోజున అలాట్ కాని వారి ఖాతాల్లో నగదు వాపసు జమ చేస్తారు. ఎల్ఐసీ షేర్లు మే 17న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి.
* రిటైల్ ఇంట్రెస్ట్
IPO అనేది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన డీమెటీరియలైజ్డ్ (డీమ్యాట్) లేదా డిజిటల్ రూపంలో షేర్లను కలిగి ఉండటానికి ఖాతాలను తెరిచిన రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచింది. గ్రాస్ రిటెన్ ప్రీమియం(GWP) పరంగా 61.6 శాతం, కొత్త వ్యాపార ప్రీమియం పరంగా 61.4 శాతం, జారీ చేసిన వ్యక్తిగత పాలసీల పరంగా 71.8 శాతం మార్కెట్ వాటాతో LIC భారతదేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థగా ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.