• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIST OF THE TOP 8 CARS WITH THE HIGHEST WAITING PERIODS IN THE INDIAN MARKET HERE FULL DETAILS NS GH

Popular Cars: ఇండియా మార్కెట్​లో ఈ కార్లకు ఫుల్​ డిమాండ్​.. వీటిని దక్కించుకోవాంటే కొన్ని నెలలు ఆగాల్సిందే

Popular Cars: ఇండియా మార్కెట్​లో ఈ కార్లకు ఫుల్​ డిమాండ్​.. వీటిని దక్కించుకోవాంటే కొన్ని నెలలు ఆగాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని కార్ల మోడళ్లకు మాన్యుఫాక్చరింగ్ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటిని దక్కించుకోవాలంటే ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వస్తోంది. 2021 మార్చి నాటికి భారత మార్కెట్​లో అత్యధిక నిరీక్షణ కలిగిన టాప్ 8 కార్ల జాబితాను పరిశీలిద్దాం.

  • Share this:
ఒకప్పుడు కారును లగ్జరీ కింద పరిగణించేవారు. కానీ ఇప్పుడు అవి అవసరంగా మారాయి. దీంతో భారత మార్కెట్​లో ఆటోమొబైల్​ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా, కరోనాతో వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరగడం, కొత్త మోడళ్లు మార్కెట్​లోకి విడుదలవ్వడంతో ఈ డిమాండ్​ మరింతగా పెరుగుతోంది. అయితే, గతేడాది కరోనా కారణంగా అమ్మకాలు భారీగా క్షీణించాయి. అయితే, దేశంలో లాక్​డౌన్​ ఎత్తివేయడంతో ఆటోమొబైల్​ పరిశ్రమ క్రమంగా కోలుకుంటోంది. అయినప్పటికీ, కొన్ని మోడళ్లకు మాన్యుఫాక్చరింగ్ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటిని దక్కించుకోవాలంటే ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వస్తోంది. 2021 మార్చి నాటికి భారత మార్కెట్​లో అత్యధిక నిరీక్షణ కలిగిన టాప్ 8 కార్ల జాబితాను పరిశీలిద్దాం.

1. మహీంద్రా థార్ (9 నెలలు)
భారత మార్కెట్​లో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్​గా మహీంద్రా థార్​ గుర్తింపు పొందింది. ఇది గతేడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఎస్‌యూవీ మోడల్​ తయారీ, డిమాండ్​కు మాధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో దీని కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం, ఈ మోడల్​ను దక్కించుకోవాలంటే 9 నెలల పాటు ఆగాల్సిందే. మహీంద్రా థార్​లోని ఫీచర్లు కూడా దీని డిమాండ్​ పెరగడానికి మరో ప్రధాన కారణం.

2. హ్యుందాయ్ క్రెటా (9 నెలల వరకు)
ప్రస్తుతం భారత మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్​యూవీ, మిడ్​ సైజ్​ ఎస్​యూవీ వాహనంగా హ్యుందాయ్ క్రెటా ప్రసిద్దికెక్కింది. ఈ మోడల్​ తయారీ యూనిట్ల కంటే డిమాండ్​ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వస్తోంది. జనవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా క్రెటా నిలిచింది. ఈ కారు డిమాండ్​ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం, క్రెటా బేస్ E ట్రిమ్ వేరియంట్​ వెయిటింగ్ పీరియడ్ 9 నెలల వరకు ఉండగా, ఇతర వేరియంట్లను దక్కించుకోవాలంటే 3 నెలల పాటు నిరీక్షించాల్సిందే.

3. మారుతి ఎర్టిగా (8 నెలల వరకు)
మారుతి సుజుకి ఎర్టిగా భారతీయ మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడైన మిడ్​ రేంజ్​ వాహనం. అందుబాటు ధరలోనే కారు లోపల అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్​ను అందించడం దీని ప్రత్యేకత. అందువల్ల, దీనికి మార్కెట్​లో భారీ డిమాండ్ నెలకొంది. వేరియంట్​ను బట్టి దీని వెయిటింగ్​ పీరియడ్​ మారుతుంది. దీన్ని దక్కించుకోవాలంటే 8 నెలల వరకు వేచి చూడాల్సిందే.

4. నిస్సాన్ మాగ్నైట్ (6 నెలల వరకు)
నిస్సాన్ ఎస్​యూవీ విభాగంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మాగ్నైట్‌ సబ్–4 ఎమ్​ వాహనానికి భారత మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. దీన్ని గతేడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి విడుదల చేశారు. సరసమైన ధరలోని విస్తృతమైన ఫీచర్లను అందిస్తుండటంతో దీని కొనుగోళ్లు పెరిగాయి. దీంతో, హ్యుందాయ్​ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచింది. కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో నిస్సాన్​ మాగ్నైట్​ను దక్కించుకోవాలంటే 6 నెలల పాటు వేచి చూడాల్సి ఉంది.

5. కియా సోనెట్ (5 నెలల వరకు)
భారత మార్కెట్​లో ప్రారంభించిన వెంటనే అత్యధికంగా అమ్ముడైన సబ్​ 4 ఎమ్​ ఎయూవీగా కియా సోనెట్ నిలిచింది. ఇది మూడు ఇంజన్​ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో మెరుగైన ట్రాన్స్మిషన్ ఆప్షన్లు, ఫీచర్లను అందించారు. అందుకే, సోనెట్ కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. తద్వారా, ఈ వాహనాన్ని దక్కించుకోవాలంటే 5 నెలల వరకు వేచి చూడాల్సిందే.

6. టయోటా ఫార్చ్యూనర్ (4 నెలల వరకు)
టయోటా ఇటీవలే భారత మార్కెట్​లో ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్, ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్లను భారత మార్కెట్​లో విడుదల చేసింది. ఇది భారత మార్కెట్​లో గణనీయమైన డిమాండ్​ను ఏర్పర్చుకుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడటంతో టయోటా కార్ల ఉత్పత్తి నెమ్మదించింది. అందువల్ల, ఈ ఎస్‌యూవీని దక్కించుకోవాలంటే ప్రస్తుతం 2 నుండి 4 నెలల మధ్య వేచి చూడాల్సిందే.

7. రెనాల్ట్ కిగర్ (2 నెలల వరకు)
రెనాల్ట్ కిగర్ భారత మార్కెట్​లోకి గత నెలలో విడుదలైంది. ఇది ఇప్పటికే భారత మార్కెట్లో బలమైన డిమాండ్​ను కలిగి ఉంది. అద్భుతమైన స్టైలింగ్, ఫ్రూగల్​ ఇంజిన్ ఆప్షన్లు, సరసమైన ధర వంటివి దీని డిమాండ్​ పెరగడానికి ప్రధాన కారణాలు. న్యూ ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్ వంటి ఎంచుకున్న పట్టణాల్లోని కొనుగోలుదారులు కిగర్ వేరియంట్​ కోసం 8 వారాల వరకు వేచిచూడాల్సిందే.

8. కొత్త టాటా సఫారి (2 నెలల వరకు)
టాటా సఫారిని కూడా గత నెలలో భారత మార్కెట్​లోకి విడుదల చేశారు. దీనికి అతి కొద్ది రోజుల్లోనే బలమైన డిమాండ్​ ఏర్పడింది. ప్రస్తుతం, ఈ మోడల్​ని దక్కించుకోవాలంటే 45 రోజుల నుండి 60 రోజుల వరకు వేచి చూడాల్సిందే. బుకింగ్ సంఖ్య పెరిగేకొద్దీ, వెయిటింగ్​ పీరియడ్​ కూడా పెరిగే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published: