• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • LIST OF SMARTPHONES UNDER RS 15000 PRICE IN INDIA ALONG WITH FEATURES AND SPECIFICATIONS NS GH

Smartphones: స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా..? అయితే, రూ.15 వేలలోపు లభిస్తున్న ఈ​ స్మార్ట్​ఫోన్లు ఇవే..

Smartphones: స్మార్ట్​ఫోన్​ కొనాలనుకుంటున్నారా..? అయితే, రూ.15 వేలలోపు లభిస్తున్న ఈ​ స్మార్ట్​ఫోన్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

2020 చివరి త్రైమాసికంలో, 2021 ప్రారంభంలో సాంసంగ్, నోకియా, షియోమితో పాటు అనేక కంపెనీలు రూ .15000 లోపు విలువ గల మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేశాయి. ప్రస్తుతం, భారత మార్కెట్​లో రూ.15 వేల లోపు లభిస్తున్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్ల జాబితాను పరిశీలిద్దాం.

  • Share this:
కరోనా అన్ని రంగాలను దెబ్బతీసినా, స్మార్ట్​ఫోన్​ రంగానికి మాత్రం బాగా కలిసొచ్చింది. కరోనా సమయంలోనూ 2020లో స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో, 2020 చివరి త్రైమాసికంలో, 2021 ప్రారంభంలో సాంసంగ్, నోకియా, షియోమితో పాటు అనేక కంపెనీలు రూ .15000 లోపు విలువ గల మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేశాయి. తక్కువ ఖర్చుతో వస్తున్న ఈ ఫోన్లను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం, భారత మార్కెట్​లో రూ.15 వేల లోపు లభిస్తున్న ఉత్తమ స్మార్ట్‌ఫోన్ల జాబితాను పరిశీలిద్దాం.

Nokia 5.4
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ నోకియా భారత మార్కెట్​లో రూ .15000లోపు నోకియా 5.4 పేరుతో స్మార్ట్​ఫోన్​ విడుదల చేసింది. ఇది 6.39 -అంగుళాల హెచ్‌డి + పంచ్ హోల్ డిస్​ప్లే, 720 × 1560 పిక్సెల్‌ల రిజల్యూషన్, 19.5: 9 ఆస్పెక్ట్​ రేషియోతో ఉంటుంది. 4 జీబీ + 64 జీబీ వేరియంట్​ ధర రూ .13,999 ఉండగా, 6 జీబీ + 64 జీబీ వేరియంట్​ రూ .15,499లకు లభిస్తుంది. దీనిలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. నోకియా 5.4 క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఓఎస్​తో పనిచేస్తుంది. అంతేకాక, దీన్ని ఆండ్రాయిడ్ 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 48MP సెన్సార్​, 2 MP డెప్త్​ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్​ కెమెరా, 2 MP మాక్రో కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 MP ఫ్రంట్ కెమెరాను కూడా అమర్చారు.

Oppo A15s
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్​లో ఒప్పో ఎ15 పేరుతో రూ .15000లోపు స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో పి 35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ బేసిడ్​ కలర్‌ ఓఎస్ 7.2 పై పనిచేస్తుంది. ఒప్పో A15sలో 6.52- అంగుళాల HD ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్​ప్లేతో పాటు 4 GB RAM, 64 GB స్టోరేజ్​ని అందించింది. దీనిలోని డిస్​ప్లే 60Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. గేమింగ్​ కోసం దీనిలో GE8320 GPU గ్రాఫిక్​ కార్టును కూడా అందించింది. 4 జీబీ + 64 జీబీ వేరియంట్​ ధర రూ .11,490లకు లభిస్తుంది.

మెమోరీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 256 GB వరకు పెంచుకోవచ్చు. దీనిలో నైట్ మోడ్, టైమ్ లాప్స్, స్లో మోషన్ వంటి వివిధ ఫీచర్లు కూడా అందించింది. కెమెరా విషయానికొస్తే, దీనిలో AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చేర్చింది. వీటిలో మెయిన్​ లెన్స్ 13MP, సెకండ్​ లెన్స్ 2MP, థర్డ్​ లెన్స్ 2 MP డెప్త్ సెన్సార్​లను చేర్చింది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 MP కెమెరాను అందించింది. ఇవి కాకుండా, కనెక్టివిటీ కోసం వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్‌ సపోర్ట్​లను అందించింది. OPPO A15s డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్, రాంబో సిల్వర్ కలర్​ వేరియంట్లలో లభిస్తుంది.

Realme Narzo 30A
రియల్‌మీ ఇటీవల రియల్‌మీ నార్జో 30 ఎను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. రూ .15000లోపే దీనిలో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను అందించింది. 720 × 1,600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో పాటు 6.5 -అంగుళాల మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్​ప్లేతో అట్రాక్టివ్​ డిజైన్​తో దీన్ని రూపొందించింది. కెమెరా విషయానికొస్తే.. రియల్ మి నార్జో 30Aలో ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్​ను చేర్చింది. 13MP గల దీని ప్రైమరీ కెమెరా f / 2.2 ఎపర్చర్​తో. సెకండరీ లెన్స్‌ కెమెరా f / 2.4 ఎపర్చర్‌తో వస్తుంది. ఇది f / 2.4 ఎపర్చర్‌తో వస్తుంది.

వీడియో కాలింగ్, సెల్ఫీని క్లిక్ కోసం దీనిలో 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను చేర్చింది. గేమింగ్ కోసం దీనిలో మీడియాటెక్ హీలియో జి 85 ప్రాసెసర్​ను అందించింది. పవర్ బ్యాకప్ కోసం, 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని చేర్చింది. దీనిని 18W ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఛార్జ్ చేయవచ్చు. రివర్స్ ఛార్జింగ్​కు కూడా ఇది సపోర్ట్​ ఇస్తుంది. దీనిలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ కెమెరాను అందించింది. మెమరీ కార్డ్ సహాయంతో ఫోన్ స్టోరేజ్​ స్పేస్​ను 256GB కి పెంచవచ్చు. ఇది ఫింగర్ ప్రింట్ డిటెక్షన్, థ్రీ కార్డ్ స్లాట్లలకు సపోర్ట్​ ఇస్తుంది.

Nokia 3.4
నోకియా 3.4 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కేవలం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా ఇంటర్నల్​ స్టోరేజ్​ 512GB వరకు విస్తరించుకోవచ్చు. ఇది 6.39 -అంగుళాల HD + పంచ్ హోల్ డిస్​ప్లేతో 19.5: 9 ఆస్పెక్ట్​ రేషియోతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే దీనిలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్​ను అందించింది. 13 మెగాపిక్సెల్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్ వంటి వాటిని అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను కూడా చేర్చింది. 180 గ్రాములు బరువు గల నోకియా 3.4 స్మార్ట్​ఫోన్​లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. 4 జీబీ + 64 జీబీ వేరియంట్​ రూ .11,999లకు లభిస్తుంది.

Xiaomi Redmi 9 Power
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమి.. రెడ్‌మి 9 పవర్‌ పేరుతో రూ.15000లోపు స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. దీనిలో ఆండ్రాయిడ్ 10 బేస్డ్​ ఎంఐయుఐ 12ని అందించింది. 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్​లో 1080 × 2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందించింది. రెడ్‌మి 9 పవర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, అడ్రినో 610 జిపియుతో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే దీనిలో నాలుగు బ్యాక్​ కెమెరాలు అందించింది.

ఇందులో మెయిన్​ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, సెకండరీ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్, థర్డ్​ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో, ఫోర్త్​ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలను అందించింది. అంతేకాక, సెల్ఫీ కోసం ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ లెన్స్​ను చేర్చింది. దీనిలో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించింది. ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్​ ఇస్తుంది. 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,999 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ .11,999 ధర వద్ద లభిస్తుంది. రెడ్‌మి 9 స్మార్ట్​ఫోన్​ను బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్, మైటీ బ్లాక్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు