Home /News /business /

LIST OF CHEAPEST HOME LOANS YOU CAN TRANSFER YOUR HOME LOAN BALANCE TO ANOTHER LENDER GH SK

Cheapest Home Loans: వడ్డీ రేటు పెరిగిందా? హోమ్‌ లోన్‌ ఈఎంఐ చెల్లించలేకపోతున్నారా? ఇలా చేయండి

Home Loan

Home Loan

Home Loans: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 2022 ఆగస్టు 5న జరిగిన మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్‌లో రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మొదటిసారి రెపో రేటును పెంచినప్పటి నుంచి.. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 2022 ఆగస్టు 5న జరిగిన మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్‌లో రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు రెపోరేటును పెంచిన ఆర్‌బీఐ.. తాజాగా మూడోసారి అదే బాటలో నడిచింది. రెపో రేటులో ఏదైనా పెరుగుదల తీసుకొస్తే అది నేరుగా రుణాలు, రుణగ్రహీతల ఈఎంఐ(EMI)లపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు, కొత్త కస్టమర్‌లు కూడా ప్రభావితమవుతారు. 2022 మే నెలలో ఆర్‌బీఐ ఈ ఏడాది మొదటిసారి రెపో రేటును పెంచినప్పటి నుంచి.. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ నిర్ణయాల ప్రభావం రుణగ్రహీతలపై కనిపిస్తోంది.

పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా హోమ్ లోన్ EMIలను చెల్లించడం కష్టంగా భావిస్తే.. తక్కువ హోమ్‌లోన్‌ (Home Loans)ఇంట్రెస్ట్‌ అందిస్తున్నసంస్థకు బ్యాలెన్స్ బదిలీ చేయడం మంచి ఆలోచన. ప్రయోజనాలు, ఇతర ఇబ్బందులను విశ్లేషించి, హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ ఆప్షన్‌ ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కోటీశ్వరులను చేసే పంట.. ఈ సాగుతో 4 నెలల్లోనే ఆదాయం ఎన్ని లక్షలంటే

తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

- పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌(RLLR) 7.5%, కనిష్ట వడ్డీ రేటు 6.8%, గరిష్ట వడ్డీ రేటు 8.05%గా ఉంది.

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 6.85%, కనిష్ట వడ్డీ 7.05%, గరిష్ట వడ్డీ 7.3%గా పేర్కొంది.

- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.75%, కనిష్ట వడ్డీరేటు 7.3%, గరిష్ట వడ్డీ రేటు 9%గా ఉంది.

-బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.7%, కనిష్ట వడ్డీ రేటు 7.3%, గరిష్ట వడ్డీ రేటు 8.7%గా ఉంది.

NRI: ఎన్ఆర్ఐలకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి పేమెంట్స్ చేసుకునే అవకాశం

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.7%, కనిష్ట వడ్డీ రేటు7.4%, గరిష్ట వడ్డీరేటును 9.1%గా తెలిపింది.

- పంజాబ్ & సింధ్ బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 7.5%, కనిష్ట వడ్డీ రేటు 7.4%, గరిష్ట వడ్డీరేటును 8.25%గా పేర్కొంది.

- UCO బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.8%గా, కనిష్ట వడ్డీ రేటు 7.4%గా, గరిష్ట వడ్డీ రేటు 7.6%గా ఉంది.

- బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.45%, కనిష్ట వడ్డీ రేటు 7.45%, గరిష్ట వడ్డీ రేటు 8.8% ఉంది.

- కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.5%, కనిష్ట వడ్డీరేటు 7.5%, గరిష్ట వడ్డీ రేటు 8%గా ఉంది.

- ఐడీబీఐ బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 7.5%గా, కనిష్ట వడ్డీ రేటును 7.5%గా, గరిష్ట వడ్డీ రేటును 9.15%గా నిర్ణయించింది.

ఆర్‌బీఐ దాని సర్క్యులర్‌లో..‘బ్యాంకులు తమ రిటైల్ రుణ వడ్డీ రేట్లను కింది ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌లలో దేనికైనా లింక్ చేయాలని ఆదేశించింది:
- ఆర్‌బీఐ రెపో రేటు
- ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (FBIL)ప్రచురించిన భారత ప్రభుత్వ 3 నెలల ట్రెజరీ బిల్లు రాబడి.
- FBIL ప్రచురించిన 6 నెలల ట్రెజరీ బిల్లు రాబడి
- FBIL ప్రచురించిన ఏదైనా ఇతర బెంచ్‌మార్క్ మార్కెట్ వడ్డీ రేటు

చాలా బ్యాంకులు ఆర్‌బీఐ రెపో రేటును తమ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌గా ఎంచుకున్నాయి. రెపో రేటుతో అనుసంధానించిన రుణ వడ్డీ రేటును రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేటు(RLLR) అంటారు. RLLR అనేది ఆర్‌బీఐ రెపో రేటు, స్ప్రెడ్ లేదా మార్జిన్‌తో రూపొందిస్తారు.



* హోమ్‌ లోన్‌ పేమెంట్‌
సాధారణంగా, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్(EMI)ని అప్పును తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తారు. ప్రిన్సిపల్‌ అమౌంట్‌, ఇంట్రెస్ట్‌ ఆధారంగా EMI రూపొందిస్తారు. రుణం ప్రారంభ సంవత్సరాల్లో.. ఇంట్రెస్ట్‌ పార్ట్, ప్రిన్సిపల్‌ అమౌంట్‌ పార్ట్‌ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. పోను పోనూ చివరికి ప్రిన్సిపల్‌ అమౌంట్‌ పార్ట్‌ పెరుగుతుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Home loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు