Home /News /business /

LIST OF BEST SMARTPHONES THAT ARE AVAILABLE UNDER RS 10000 NS

Best smartphone under Rs 10,000: రూ.10 వేల లోపు ధరతో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, కేవలం రూ. 10 వేల లోపు ధర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

    ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనిషి కనిపించడం చాలా అరుదుగా మారింది. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనే సమయంలో అందరూ ఆలోచించే విషయం ధర. సాధ్యమైనంత తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ గురించి వెతుకుతుంటారు. అయితే అలాంటి వారి కోసం అనేక స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. రూ. 10 వేల కన్నా తక్కువ ధర కలిగి మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇవే..

    SAMSUNG GALAXY M30:
    ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 9,649. 3GB ర్యామ్ తో పాటు, 32GB మెమోరీని కలిగి ఉంటుంది. 6.4 అంగుళాల FHD+సూపర్ అల్మోడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 13MP+5MP+5MP ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఫ్రెంట్ 16MP సెన్సార్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.

    VIVO U10:
    ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 9, 990. 3GB, 4GB ర్యామ్ మరియు 32 GB, 64 GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 6.35 అంగుళాల హెచ్డీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5000 mAh భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం.

    XIAOMI REDMI NOTE 8:
    ఈ ఫోన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.9,999. 4GB ర్యామ్ తో పాటు 64 GB మెమోరీ ఈ ఫోన్లో ఉంటుంది. నాలుగు కలర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 6.3 అంగుళాల FHD స్క్రీన్ ఉంటుంది. 4000mAh బ్యాటరీ ఉంటుంది. 13 MP ఫ్రంట్ కెమెరాతో పాటు 48MP+2MP+2MP రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

    REALME 5:
    ఈ స్మార్ట్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 3GB ర్యామ్, 32 GB స్టోరేజ్ సామర్థ్యం కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 9999. 4GB+64GB మోడల్ ధర రూ.10,999. బ్యాటరీ సామర్థ్యం 5000mAh

    REALME 5S:
    4 GB ర్యామ్ 64GB మెమోరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ధర రూ.9,999. 6.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Realme, Redmi, Samsung, Smartphones, Xiomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు