Home /News /business /

LIST OF BANKS GIVING MAXIMUM RETURN UP TO 6 7 PERCENT ON FIXED DEPOSITS NS GH

Return on FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? అయితే.. అత్యధికంగా వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా బ్యాంకులో మీ డబ్బులను దాచుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ బ్యాంకుల్లో మీకు అత్యధిక వడ్డీ లభిస్తుంది. తెలుసుకోండి.

రిస్క్‌ తక్కువ.. వడ్డీ ఎక్కువ వచ్చే పెట్టుబడి ఆప్షన్‌ ఏదైనా ఉందీ అంటే అది బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అనే చెప్పాలి. ఎంత మొత్తం అయినా దాచుకోగలడగడం ఇందులో ప్రత్యేకత. అయితే కచ్చితమైన రిటర్న్స్‌, ఓవర్‌ డ్రాఫ్ట్ లాంటి కొన్ని అదనపు ఫీచర్ల ద్వారా ఖాతాదారులు లబ్ధి పొందవచ్చు. దీంతో చాలామంది తమ దగ్గరున్న డబ్బును ఎఫ్‌డీ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత ఏడాది కాలంగా ఎఫ్‌డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలకు ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తోంది అనేది ఇప్పుడు కీలకం. మరోవైపు వడ్డీ తక్కువ వస్తుండటంతో ఎఫ్‌డీలో డబ్బు దాస్తే ఉపయోగమేనా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీసీబీ బ్యాంక్‌, యస్‌ బ్యాంకు.. తమ సాధారణ ఇన్వెస్టర్లకు ఎఫ్‌డీ వడ్డీ రేటును గరిష్ఠంగా 6.75 శాతంగా మార్చాయి. ఒకవేళ మీరు సీనియర్‌ సిటిజెన్‌ అయితే దానికి మరో 0.50 శాతం ఎక్కువ ఇవ్వనున్నాయి.
Online Banking: ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసే వారికి అలర్ట్.. ఈ 12 తప్పులు అస్సలు చేయకండి

యస్‌ బ్యాంకు లెక్క ఇదీ..
యస్‌ బ్యాంకు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన తాజా వివరాల ప్రకారం రూ.రెండు కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలకు 3.5 శాతం నుండి 6.75 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. 7 రోజుల నుండి 14 రోజులు డిపాజిట్‌ చేస్తే 3.5శాతం వార్షిక వడ్డీ ిస్తారు. అదే 15 రోజుల నుండి 45 రోజుల టెన్యూర్‌ను ఎంచుకుంటే 4 శాతం వడ్డీ ఇస్తారు. ఇక 46 రోజుల నుండి 90 రోజుల పీరియడ్‌లో ఎఫ్‌డీ చేస్తే 4.5 శాతం వడ్డీ ఇస్తారు. మూడు నెలల నుండి ఆరు నెలల టెన్యూర్‌ అయితే యస్‌ బ్యాంకు ఐదు శాతం వడ్డీ ఇస్తుందట. ఇక ఆరు నెలలు - 9 నెలలు అయితే 5.5 శాతం, తొమ్మిది నెలల నుండి ఒక సంవత్సరం పీరియడ్‌ అయితే 5.75 శాతం వడ్డీ వస్తుంది.

ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు టెన్యూర్‌ అయితే యస్‌ బ్యాంకు డిపాజిట్‌దారులకు 6.25 శాతం రిటర్న్‌ ఇస్తుందట. 2 సంవత్సరాల నుండి మూడేళ్ల వ్యవధి టెన్యూర్‌కు వడ్డీ 6.5 శాతం కాగా, మూడేళ్ల నుండి 10 ఏళ్ల పీరియడ్‌ అయితే పెట్టుబడిదారుకు 6.75 శాతం వడ్డీ అందుతుంది. ఇక సీనియర్‌ సిటిజన్‌ అయితే 50 బీపీఎస్‌ ఎక్కువగా ఉంటుంది. మూడేళ్ల టెన్యూర్‌ వరకే ఇంత దక్కుతుంది. అదే మూడేళ్లు, అంత కంటే ఎక్కువ రోజులు ఎఫ్డీ చేస్తే 75 బీపీఎస్‌/ 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తారు.

డీసీబీ బ్యాంకు ఇలా ఇస్తుంది
డీసీబీ‌ బ్యాంకు వెబ్‌సైట్‌లో అందించిన వివరాల ప్రకారం ఎఫ్‌డీలకు 4.25 శాతం నుండి 6.75 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. 7 రోజుల నుండి 14 రోజులు డిపాజిట్‌ చేస్తే 4.25 శాతం వార్షిక వడ్డీ ిస్తారు. అదే 15 రోజుల నుండి 45 రోజుల టెన్యూర్‌ను ఎంచుకుంటే 4.80 శాతం వడ్డీ ఇస్తారు. ఇక 46 రోజుల నుండి 90 రోజుల పీరియడ్‌లో ఎఫ్‌డీ చేస్తే 4.75 శాతం వడ్డీ ఇస్తారు. 91 రోజుల నుండి ఆరు నెలల టెన్యూర్‌ అయితే డీసీబీ బ్యాంకు 5.5 శాతం వడ్డీ ఇస్తుందట. ఇక ఆరు నెలలు - 12 నెలలు అయితే 5.95 శాతం, 12 నెలల నుండి 15 నెలల పీరియడ్‌ అయితే 6.05 శాతం వడ్డీ వస్తుంది.

15 నెలల నుండి 18 నెలల పీరియడ్‌ అయితే డిపాజిట్‌దారులకు డీసీబీ బ్యాంకు 6.35 శాతం రిటర్న్‌ ఇస్తుందట. 18 నెలల నుండి 699 రోజుల వరకు ఎఫ్‌డీ చేస్తే 6.50 శాతం వడ్డీ దక్కుతుంది. 700 రోజులు టెన్యూర్‌గా తీసుకుంటే 6.70 శాతం ఇంట్రెస్ట్‌ ఇస్తారు. ఇక 700 రోజుల నుండి 36 నెలల పీరియడ్‌కు 6.50 శాతం ప్రాఫిట్‌ ఉంటుంది. 36 నెలల టెన్యూర్‌ అయితే 6.75 శాతం వడ్డీ ఇస్తారు. 36 నెలల నుండి 60 నెలల కాలం ఎఫ్‌డీ చేస్తే 6.75 శాతం వడ్డీనే ఇస్తారు. 60 నెలలు - 120 నెలల టైమ్‌లో ఎఫ్‌డీ చేస్తే 6.75 రిటర్న్స్‌ ఉంటాయి. ఇక ఎఫ్‌డీ చేసేది సీనియర్‌ సిటిజన్‌ అయితే మిగిలిన బ్యాంకుల్లాగే డీసీబీ కూడా 50 బీపీఎస్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే పై రేట్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ వారికి వస్తుంది.

మీ దగ్గర డబ్బులు ఉండి ఎవరైనా ఎఫ్‌డీ చేయాలనుకుంటుంటే, మరిన్ని వివరాలను ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లకు వెళ్లి తెలుసుకోవచ్చు. దాంతోపాటు అక్కడ పొందుపరిచిన నిబంధనలు తదితర అంశాలను చూసుకొని అప్పుడు ఎఫ్‌డీ చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Banking, Investment Plans, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు