హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: వృద్ధుల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారా? ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి..

Health Insurance: వృద్ధుల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారా? ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి తక్కువ ప్రీమియంతో వృద్ధాప్యంలో వారి అవసరాలను తీర్చగల సమగ్ర కవరేజీని ఎంచుకోవాలి.

ఒకప్పుడు మనదేశంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి శాతం చాలా తక్కువగా ఉండేది. కానీ గతేడాది మహమ్మారి ప్రభావంతో బీమా కొనుగోళ్లు పెరిగాయి. గతంతో పోలిస్తే వివిధ రకాల పాలసీలను వినియోగదారులు ఎంచుకుంటున్నారు. అయితే వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పెరుగుతున్న వైద్య వ్యయ భారం, రోగనిరోధక శక్తి బలహీనపడటం లాంటి మొత్తం కుటుంబంపై ఆర్థిక, భావోద్వేగ ప్రభావాన్ని చూపుతాయి. సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి తక్కువ ప్రీమియంతో వృద్ధాప్యంలో వారి అవసరాలను తీర్చగల సమగ్ర కవరేజీని ఎంచుకోవాలి. ఇలాంటి పాలసీలే ప్రయోజనకరంగా ఉంటాయి. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్ ప్రాసెస్‌ విషయంలో అదనపు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వృద్ధుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని ఫీచర్లు మారే అవకాశముంటుంది.

క్లెయిమ్ చేసుకోవడానికి, తిరస్కరణలు నివారించడానికి పాటించాల్సిన 10 నిబంధనలు..

1. పాలసీని అర్థం చేసుకోవాలి..

ముందు పాలసీ తీసుకున్న తర్వాత సంబంధిత పత్రాలను క్షుణ్నంగా చదవాలి. నూతన పాలసీ కొనుగోలు చేసే సమయంలో నిబంధనలు, షరతులు, మినహాయింపులు, చేర్పులు పరిశీలించాలి. తక్కువ ప్రీమియం ఉన్న మీ పాలసీ యూసేజీని గణనీయంగా పరిమితం చేసే అవకాశముంటుంది. ఒకవేళ మీరు తక్కువ ప్రీమియం ప్లాన్ ను ఎంచుకున్నట్లయితే క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఫీచర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విస్తృతమైన కవరేజీని ఎంచుకున్నట్లయితే మినహాయింపుల గురించి బీమా కంపెనీని అడగండి.

2. సమాచారం సరిగ్గా లేకపోతే..

పాలసీదారుడి ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ స్థితి, వయస్సుకు సంబంధించి డాక్యుమెంటేషన్ కచ్చితమైన, కీలకమైన సమాచారాన్ని అందించాలి. ప్రీమియం మొత్తాన్ని నిర్ధారించడానికి బీమా సంస్థకు సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి. ఇచ్చిన సమాచారం తప్పు అని తేలితే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది.

3. సహ-చెల్లింపు నిబంధన..

దీని ప్రకారం ఆసుపత్రి ఖర్చుల్లో కొంత శాతాన్ని కస్టమర్ భరించాల్సి ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారుడు దీని గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆమోదించిన క్లెయిమ్ మొత్తంలో ఇది 20 నుంచి 50 శాతం వరకు మారవచ్చు. క్లెయిమ్ చేయడానికి ముందు బీమా కంపెనీతో తనిఖీ చేసుకోవాలి. తద్వారా ఫైనాన్స్ నిర్వహించుకోవచ్చు.

4. వెయిటింగ్ పీరియడ్

ప్రతి బీమా పాలసీ ప్లాన్ లో వెయిటింగ్ పీరియడ్ భిన్నంగా ఉంటుంది. కొన్ని లిస్టెడ్ పరిస్థితులకు అనుగుణంగా ఇది 30 రోజుల నుంచి రెండు లేదా మూడు సంవత్సరాల వరకు మారవచ్చు. పాలసీదారుడు వెయిటింగ్ పీరియడ్ లో క్లెయిమ్ ను కొనసాగించలేరు. మీ తల్లిదండ్రులు అలాంటి పాలసీ పరిధిలోకి వస్తే కార్పోరేట్ హెల్త్ పాలసీలకు సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ ఉండదు.

5. ముందుగా ఉన్న అనారోగ్యం లేదా వ్యాధి..

సీనియర్ సిటిజన్లు ఇంతకుముందే ఉన్న రుగ్మతలను కవర్ చేసే నిబంధన ఉన్న ప్రణాళికలను తీసుకొని ఉంటారు. అయితే పాలసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో ముందుగా ఉన్న అనారోగ్యాలు/వ్యాధులు/ వ్యాధుల క్లెయిమ్ ప్రాతిపదికను చాలా కంపెనీలు తిరస్కరించవచ్చు. ముందుగా ఉన్న అనారోగ్యం కవరేజ్, నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్లను చేర్చడం గురించి మీ బీమా కంపెనీతో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు హెర్నియా వంటి నిర్దిష్ట వ్యాధులకు పాలసీ శాతాన్ని కవర్ చేయవచ్చు. ఓ నిర్దిష్ట వ్యాధికి చికిత్స కోసం వ్యతిరేకంగా క్లెయిమ్ చేయడం కోసం మీరు మీ బీమా సంస్థతో చెక్ చేసుకోవాలి.

6. మీ తగ్గింపులను తెలుసుకోండి..

కొన్ని పాలసీలకు డిడక్టబుల్స్ ఆప్షనల్ గా ఉంటాయి. అంటే క్లెయిమ్ సమయంలో పాలసీదారుడు స్వయంగా చెల్లించడానికి అంగీకరించిన మొత్తం, క్లెయిమ్ చేసేటప్పుడు మినహాయించిన మొత్తాన్ని గుర్తుంచుకోవాలి.

7. ముఖ్యమైన డాక్యుమెంట్లు..

క్లెయిమ్ ప్రక్రియను కొనసాగించడానికి ముందుగా పూర్తి లేదా అసలైన డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి. పత్రాలు అసంపూర్తిగా లేదా హాస్పిటల్ అథారిటీ ద్వారా ధ్రువీకరించనట్లయితే అలాంటి సందర్భంలో క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. కంపెనీ క్లెయిమ్ ను ఒప్పుకోవాలంటే, మీ క్లెయిమ్ కు మద్దతు ఇచ్చే సరైన డాక్యుమెంట్లు, రిపోర్టులు ఉండాలి.

8. స్థానిక ఆసుపత్రిలో చేరడం..

ఒక వేళ మీరు గృహ సంరక్షణ చికిత్సను ఎంచుకుంటే మీ బీమాదారునికి తెలియజేయండి, మీ వైద్య సంరక్షణను వైద్య అభ్యాసకుల ప్రిస్క్రిప్షన్ పై మాత్రమే పరిగణించాలి. క్లెయిమ్ తిరస్కరణను నివారించడానికి పాలసీ మార్గదర్శకాలను అనుసరించాలి.

9. ప్రత్యామ్నాయ చికిత్సలు..

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు యునాని, హోమియోపతి, ఆయుర్వేదం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను అందిస్తున్నాయి. ఇలాంటి చికిత్సల కోసం క్లెయిమ్ చేయడానికి ముందు మీరు మీ బీమా కంపెనీతో చేక్ చేసుకోవాలి.

10. అవయవ దాత ఖర్చులు..

కొన్ని బీమా పాలసీలు అవయవ దానం వైద్య ఖర్చులను కవర్ చేస్తాయి. బీమాదారుడితో మీ హెల్త్ పాలసీ కింద వైద్య ఖర్చులు క్లెయిమ్ చేయవచ్చో లేదో నిర్ధారించుకోవాలి.

First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు